Podharillu Serial Today Episode:రిసార్ట్‌లో మహాలక్ష్మీ దగ్గర బిల్డప్ ఇవ్వాలనుకున్న చక్రి మరోసారి అబాసుపాలవుతాడు. తాను చిన్నప్పటి నుంచి లాంగ్‌జంప్‌లో ఛాంపియన్‌ను అనిచెప్పి కోతలు కోస్తాడు.ప్లేగ్రౌండ్‌ దగ్గరకు తీసుకెళ్లి....లాంగ్‌జంప్‌కు ట్రై చేసి నడుము విరగ్గొట్టుకుంటాడు. అదిచూసిన మహాలక్ష్మీ పడిపడి నవ్వుతుంది. 

Continues below advertisement

ఆ తర్వాత అందరూ కలిసి రూమ్‌కు వస్తారు. రూమ్‌ మొత్తం చెల్లాచెదురుగా ఉండగా క్లీన్ చేసి పెట్టమని చక్రి,కేశవ్‌కు చెప్పి కన్నాను తీసుకుని మహా బయటకు వెళ్తుంది. అప్పుడే నిహారిక తన కూతురుని తీసుకుని ప్లేగ్రౌండ్‌కు వచ్చి ఆడిస్తుంటుంది. ఇంతలో లలిత ఫోన్ చేయడంతో కీర్తిని అక్కడే ఆడుకోమని చెప్పి రూమ్‌కు వెళ్తుంది.బయట నడుచుకుంటూ వెళ్తున్న మహాలక్ష్మీ కీర్తిని చూసి దగ్గరకు వస్తుంది. నువ్వు ఒక్కదానివే ఎలా వచ్చావని అడగ్గా....నాయనమ్మ,తాతయ్య అమ్మానాన్నా అందరూ వచ్చారని చెబుతుంది. దీంతో మహా చాలా సంతోషిస్తుంది. నీకు చాక్లెట్లు,ఐస్‌క్రీమ్‌లు కొనిస్తానని తీసుకుని వెళ్తుంది.

లలిత ఫోన్ చేయడంతో రూమ్‌కు వచ్చిన నిహారిక ఎందుకు అత్తయ్య పిలిచారు అని అడుగుతుంది.రూమ్‌లో బోరుకొడుతోందని..సరదాగా బయటకు వెళ్దామని పిలిచానని అంటుంది. కీర్తి ఎక్కడని అడగ్గా....ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటుందని చెబుతుంది. దీంతో ఇద్దరూ కలిసి బయటకు వస్తారు.ప్లేగ్రౌండ్‌లో కీర్తి కనిపించకపోయేసరికి నిహారిక కంగారుపడుతుంది. ఆమెను వెతుకుతూ వెళ్లగా....మహాలక్ష్మీదగ్గర ఉండటం చూసి వెళ్తారు.తల్లిని చూడగానే మహా అమ్మా అంటూ దగ్గరకు వస్తుంది.నా కూతురు నా గడప దాటినప్పుడే చచ్చిపోయిందని...ఇప్పుడు నువ్వు కొత్తగా వరసలు కలిపి దగ్గర అవ్వొద్దని అంటుంది. 

Continues below advertisement

ఆమె చేతిలో ఉన్న కీర్తిని లాక్కుని వెళ్లిపోతుంది. తల్లి చేసిన పనికి చాలా బాధపడుతుంది మహాలక్ష్మీ..కానీ అందులోనూ ఆనందం ఉందని సంతోషిస్తుంది.ఎందుకంటే ఈ విధంగానైనా మానాన్న  ఇక్కడికి వచ్చారని తెలిసిందని...ఆయన్ను చూసే భాగ్యం దక్కిందని అంటుంది. మీనాన్నా నిజంగా నిన్ను దగ్గరకు రానిస్తారంటావా వదినా అని కన్నా అడగ్గా....నన్ను చూస్తే మాత్రం ఖచ్చితంగా  దగ్గరకు తీసుకుంటారని అంటుంది.రూమ్‌కు తిరిగి వెళ్తుండగా... మహాకు తన తండ్రి  కనిపించేసరికి సంతోషంతో పరుగెత్తుకుంటూ వెళ్లి నాన్నా అని పిలుస్తుంది. నాకు అసలు కూతురే పుట్టలేదమ్మా...ఇలా ఎవరినిపడితే వారిని నాన్నా అని పిలవకూడదని చెప్పి వెళ్లిపోతాడు. నీవల్ల ఆయనకు ఇంట్లో కూడా మనశ్శాంతి లేదని...ప్రశాంతంగా ఉందమని ఇక్కడికి వస్తే నువ్వు ఇక్కడికి కూడా దాపురించావా అని తల్లి లలిత మండిపడుతుంది.

స్విమ్మింగ్‌పూల్‌ దగ్గర చక్రి,మాధవ్‌ను చూసి ఆది కోపంతో రగిలిపోతాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారురా అని మంండిపడతాడు. ఈ రీసార్ట్‌ ఏమైనా మీబాబు కట్టించాడా...డబ్బులు ఇస్తే ఎవడైనా  రావొచ్చని చక్రి అంటాడు.  మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్లండని ఆది అంటాడు. మీకు అంత కష్టంగా  ఉంటే మీరే వెళ్లండని చక్రి బదులిస్తాడు. మాధవ్‌ చక్రికి సర్దిచెప్పి  అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. 

రూమ్‌కు వెళ్లిన తర్వాత ఇక్కడ మనం ఉండటం మంచిది కాదని...తిరిగి వెళ్లిపోదామని మాధవ్‌ అనగా....వాళ్లకు భయపడి మన సంతోషాన్ని ఎందుకు దూరం చేసుకోవాలని మహా అంటుంది.దీంతో అందరూ అక్కడే ఉంటారు.రాత్రి అయ్యే సరికి నారాయణ మందు తాగడానికి బార్‌కు వెళ్లగా...అప్పటికే అక్కడ మందుతో వెయిట్‌చేస్తున్న ప్రతాప్‌ పిలిచి మందుతాగుదాం రమ్మని అంటాడు. దీంతో ఇద్దరూ కలిసి మందు తాగుతారు.ఎందుకు అలా చిరాకుగా ఉన్నారని నారాయణ అంటే...నా కూతురు కనిపించిందని,అందుకే చిరాకుగా ఉందని ప్రతాప్‌ చెబుతాడు.