Podharillu Serial Today Episode: సర్టిఫికేట్ల కోసం కాలేజీకి వెళ్లిన మహాను అడ్డుకునేందుకు వచ్చిన ఆదిచేతిలో నారాయణ కత్తిపోట్లకు గురవుతాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్తుంది మహా. ఈవిషయం చక్రికి చెప్పి ఎవరికీ చెప్పొద్దని అంటుంది. కంగారుపడిన చక్రి...తన తండ్రికి ఏం జరిగిందోనని వెంటనే బయలుదేరి వస్తానని అంటాడు.  ఇప్పుడు ఏం వద్దని నేను డాక్టర్‌ను అడిగి చెబుతానని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్‌...అతనికి ఏ పర్వాలేదని కత్తి లోతుగా దిగలేదని చెబుతాడు. మూడు,నాలుగు కుట్లు వేశామని మెలకువ రాగానే తీసుకుని వెళ్లిపోవచ్చని చెబుతాడు. మత్తులో ఉన్న నారాయణ దగ్గరకు వెళ్లి మహా చాలా బాధపడుతుంది. నావల్లే మీకు కత్తిపోట్లు దిగాయని ఏడుస్తుంది.ఇంతలో చక్రి మళ్లీ ఫోన్ చేయగా...అంతా బాగానే ఉందని డాక్టర్‌గారు చెప్పారని..మేమే బయలుదేరి వస్తున్నామని మీరు రావొద్దని మహా చెబుతుంది.
 
ఇంతలో నారాయణకు మెలకువ రావడంతో డాక్టర్‌ చూసి ఇంటికి తీసుకెళ్లొచ్చని చెబుతారు. నారాయణను తీసుకుని మహా ఇంటికి బయలుదేరుతుంది.దారిపొడవునా నారాయణ నొప్పి తట్టుకోలేక బాధపడుతుంటాడు. డ్రైవర్‌ మందులు వేసుకోమని చెప్పినా...నాకు ఈ మెడిసిన్ పడదని ఒక క్వార్టర్‌ వేస్తే అంతా సెట్‌ అవుతుందని అంటాడు. అమ్మాయి కారులో ఉంది కాబట్టి తాగడం లేదని అంటాడు.ఇంతలో డ్రైవర్‌ ఓచోట టీ తాగడానికి కారు ఆపగా...నారాయణ బాధచూడలేక మహా వైన్స్‌ షాపుకు వెళ్తుంది. అక్కడ ఆమెను చూసిన వాళ్లంతా వింతగా చూస్తారు. అక్కడికి వెళ్లి నొప్పి తగ్గడానికి మెడిసిన్ ఇవ్వమని అడగ్గా షాపు నవ్వుతారు. ఇక్కడ  అలాంటి మెడిసిన్ దొరకదని చెప్పగా...నాకోసం కాదని కారులో పెద్దాయన ఉన్నాడని చెప్పడంతో వాళ్లు క్వార్టర్ బాటిల్‌ ఇస్తారు. అది తీసుకుని వచ్చి నారాయణకు ఇవ్వగా...అతను ఆమెపై మండిపడతాడు.నువ్వు వైన్స్‌షాపు వద్దకు ఎందుకు వెళ్లావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆమె తీసుకొచ్చిన క్వార్టర్‌ కొట్టేసి హాయిగా నిద్రపోతాడు.
 
మహా రాకకోసం చక్రితోపాటు అన్నదమ్ములంతా ఎదురుచూస్తుంటారు.ఇంటికి రాగానే నారాయణను జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెడతారు. ఇంతలో చక్రి,కేశవ్‌ మహాపై మండిపడతారు. మేం చెబుతున్నా వినకుండా  యాదగిరిగుట్ట వెళ్లావని ఇప్పుడు చూడు ఎంత పని జరిగిందోనని అంటారు. అందుకే అవతలివాళ్లు చెప్పినప్పుడు వినాలని అంటారు.నాకు ఏం కాదు ఏంకాదని వెళ్లావు కదా ఇప్పుడు మీ అన్న ఎంత రాక్షసంగా ప్రవర్తించాడో చూడమని అంటారు. నిన్ను చంపేందుకు ఏకంగా కత్తి తీసుకుని మరీ వచ్చాడని అనగా....నారాయణ కలుగజేసుకుని వారిని ఆపుతాడు. వాడేమీ కత్తితీసుకుని రాలేదని...నేను తీసుకెళ్లిన కత్తితోనే పొడిచాడని చెప్పి నచ్చజెబుతారు.
 
ఇదంతా నావల్లే జరిగిందనుకుంటూ మహా బాధపడుతూ లోపలికి వెళ్లిపోతుంది. వాళ్లను ఇలాగే వదిలేస్తే రేపు మనం లేనప్పుడు ఇంటికి వచ్చి మహాను ఎత్తుకుని వెళ్తాడని చక్రి అంటాడు.అందుకే వాడి పని చెబుదామని చక్రి అనగా....నారాయణ, మాధవ్ వారిస్తారు. ఈ విషయం తెలిస్తే...మహా బాధపడుతుందని అంటాడు. సొంత చెల్లెలే తన కూతురుని నా కొడుక్కి ఇవ్వడానికి ఇష్టపడటం లేదని...అలాంటిది కోటీశ్వరులైన వాళ్ల చెల్లెలు నిన్ను చేసుకుంటే వాళ్ల  అన్నకు కోపం రాదా అని అంటాడు. ఈ విషయం ఇక్కడితో వదిలేయమని చెబుతాడు.
 
నిహారిక మహాకు ఫోన్ చేసి ఏం జరిగిందని అడుగుతుంది. ఆమె మాటలకు మండిపడిన మహా...నీ మొగుడు చేసిన ఘనకార్యం గురించి చెప్పలేదా అని అంటుంది. నువ్వు కాలేజీకి వచ్చావని అక్కడ ఏదో గొడవ జరిగిందని మాత్రమే చెప్పాడని అంటుంది. మీ ఆయన చక్రి వాళ్ల నాన్నను కత్తితో పొడిచాడని చెబుతుంది. మరీ అంత మృగంలా బ్రతకవద్దని హెచ్చరిస్తుంది. ఆయన కేసు పెట్టి ఉంటే ఈపాటికి మీ ఆయన జైలులో ఉండేవాడని...మరోసారి ఇలా చేస్తే ఊరుకునేదిలేదని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.