Podharillu Serial Today Episode: ఉద్యోగం లేకుండా బయటకు వెళ్లి ఇబ్బందిపడతావని...నీలక్ష్యం నెరవేరే వరకు ఇది నీ సొంత ఇల్లు మాదిరిగానే ఇక్కడే ఉండిపొమ్మని మహాలక్ష్మీకి మాధవ్‌ చెబుతాడు. తను అడ్డుచెప్పబోతుండగా...నా మీద  నీకు గౌరవం ఉంటే ఇక్కడే ఉండిపొమ్మని అనడంతో...మహాలక్ష్మీచేసేది లేక సరేనంటుంది. మహాలక్ష్మీ ఇక్కడే ఉండిపోవడానికి ఒప్పుకోవడంతో ఇంట్లో అందరూ సంతోషపడతారు. కన్నా, చక్రి, కేశవ్‌ ఆనందంతో గెంతులు వేస్తారు.మహా వెళ్లిపోతుందన్న కోపంతో ఆదినారాయణ బీడులు తాగి ముక్కలన్నీ ముగ్గుపై వేస్తుంటాడు. బయటకు వచ్చిన మహా ఇదంతా ఏంటని అడిగితే రేపటి నువ్వు ఉండవు కదా ఈ ఇంటిముందు ముగ్గులు కూడా ఉండవని అంటాడు. నేను ఎక్కడికి వెళ్లడం లేదని...ఇక్కడే ఉంటున్నానని మహాలక్ష్మీ చెప్పడంతో నారాయణ కూడా ఆనందంతో డ్యాన్స్  చేస్తాడు. వాళ్లందరి ఆనందం చూసి మహాలక్ష్మీ చాలా మురిసిపోతుంది.                   

Continues below advertisement

ఉదయం అందరూ ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతూ...మాధవ్‌కు చెప్పి వెళ్తుంటారు. చక్రి కారు నడపడానికి వెళ్తూ మహాకు చెప్పడంతో అతన్ని ఉడికించడానికి వెళ్తే వెళ్లు నాకు ఎందుకు చెబుతున్నావని అంటుంది. దీంతో చక్రి ఇబ్బందిపడుతూనే బయటకు వెళ్లిపోతాడు. మాధవ్‌ కూడా వెళ్లిపోతూ...కన్నాను జాగ్రత్తగా చదువుకోమని చెబుతాడు.నేను దగ్గర ఉండివాడిని చదివిస్తానని మహాలక్ష్మీ అంటుంది. బెత్తం తీసుకుని మరీ కన్నాను కూర్చోబెట్టి మహా చదివిస్తుంది. అయితే అంతకు ముందు కేశవ్‌ తన ఫోన్ ఛార్జింగ్ పెడుతూ శైలు ఫోన్‌ కూడా అక్కడ పెడతాడు. ఆ తర్వాత మహాను చూసిన కంగారులో శైలు ఫోన్ అక్కడే వదిలేసి తన ఫోన్ మాత్రం తీసుకుని షాపుకు వెళ్లిపోతాడు. 

నెలరోజుుగా  రీల్స్‌ చేయకపోవడంతో తన ఫ్యాన్స్‌, పాలోవర్స్‌ ఏమైపోతారోనని శైలు కంగారుపడిపోతుంటుంది. ఆ ముంగిసగాడు నా ఫోన్‌ నాకు ఇవ్వడం లేదని కోప్పడుతుంది. ఎలాగైనా వాడితో అచ్చికబుచ్చికలాడి నా ఫోన్ నేను తీసుకోవాలని అనుకుంటుంది. ఇంతలో వాళ్ల నాన్న తన ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి వెళ్లిపోవడంతో ఆ ఫోన్ తీసుకుని తన ఫోన్‌కు ఫోన్ చేస్తుంది. శైలు తన ఫోన్‌లో వాళ్ల నాన్న పేరు మైలవ్‌ అని సేవ్‌ చేసుకుని ఉండటంతో....కన్నా, మహా ఇద్దరూ ఆ ఫోన్‌కాల్‌ చూస్తారు. ఈ ఫోన్ ఎక్కడిదిరా అని మహా అడిగితే...కేశవ్‌ అన్నయ్యది అని చెబుతాడు. మరి ఈ మైలవ్‌ నెంబర్‌ ఎక్కడిదని ఫోన్ లిప్ట్ చేస్తారు. అవతలి నుంచి శైలు మాట్లాడుతుంది.

Continues below advertisement

మహాలక్ష్మీ గొంతువిని అహా వీడు ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్లిపోయాడన్నమాట అనుకుంటుంది. ఈ ముగింసగాడిని ఇంట్లో ఇరికిస్తే...వాడే తెచ్చి నా ఫోన్‌ నాకు ఇస్తాడని అనుకుంటుంది.ఫోన్‌లో మహాతో చాలా స్వీట్‌గా మాట్లాడుతుంది. తను కేశవ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ను అన్నట్లు బిల్డప్‌ ఇస్తుంది. మేమిద్దరం కలిసినప్పుడు పొరపాటుగా నా ఫోన్ తన దగ్గర ఉండిపోయిందని చెబుతుంది. దీంతో మహా, కన్నా కోపంతో రగిలిపోతారు. మన దగ్గర మెలికలు తిరుగుతూ నటించే కేశవ్‌....బయట ఇంత వ్యవహారం నడుపుతున్నాడన్నమాట అని అనుకుంటారు. ఈ విషయం మనకు తెలియనట్లుగానే ఉండి వ్యవహారం బయటకు రాబడదామని అనుకుంటారు. శైలు ఫోన్‌లో కాల్‌లిస్ట్ డిలీట్ చేసి తమకు ఏం తెలియదన్నట్లు ఫోన్ అక్కడ పెట్టేస్తారు.

 సగం దూరం వెళ్లిన తర్వాత శైలు ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చానని గ్రహించిన కేశవ్‌...ఆ  ఫోన్‌ కోసం ఇంటికి వెళ్తాడు. అది అసలే తింగరి వేషాలు వేస్తూ ఫోన్ చేసి ఉంటే ఇంట్లో దొరికిపోతానని అనుకుంటాడు. చకచకా వెళ్లి ఫోన్ తీసుకుని చెక్‌చేస్తాడు. ఎలాంటి కాల్స్‌ , మెసేజ్‌లు రాలేదని తెలుసుకుని హమ్మయ్యా అనుకుంటాడు. వాళ్ల నాన్న ఫోన్‌కు ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడిస్తావ్ బుస్సు అంటాడు. అవతలి నుంచి శైలు ముంగిస అనగా...ఇంకోసారి నన్ను ముంగిస  అంటే పళ్లు రాలగొడతానని అంటాడు. అయితే తనపేరు బుస్సు, ఇతనిపేరు ముంగిస అన్నమాట అని మహా, కన్నా అనుకుంటారు.