Podharillu Serial Today Episode: శైలూ, కీర్తి స్కూటీమీద వెళ్తుండగా చెడిపోవడంతో సరిగ్గా కేశవ్ షాపు ముందు ఆగుతారు. బండి తోసుకుంటూ మెకానిక్ షాప్‌ దగ్గరకు వెళ్తారు. కానీ కేశవ్‌ను వాళ్లు గమనించారు. వీళ్ల మాటలు విన్న కేశవ్‌...వారిని గుర్తుపడతారు. అప్పుడు శైలు కీర్తితో ఇవాళ ఎలాగైనా ఆ ముంగిసగాడి దగ్గర నుంచి నా ఫోన్ కొట్టేస్తానని అంటుంది.అది ఎలాగా అని కీర్తి అడగ్గా....వాడికి ఫోన్ చేసి రెస్టారెంట్‌కు రమ్మని పిలుస్తానని అంటుంది. వాడు అసలే రౌడీలా ఉన్నాడని నువ్వు పిలిస్తే ఎందుకు వస్తాడని కీర్తి అంటుంది.

Continues below advertisement

అమ్మాయి తీయగా పిలిస్తే కరిగిపోని మగాడు అంటూ ఎవడూ ఉండడని శైలూ అంటుంది. వాడిని ఐస్‌ చేసి తెలివిగా నా ఫోన్‌ వాడి దగ్గర నుంచి లాక్కుంటానని అంటుంది. ఈ మాటలన్నీ విన్న కేశవ్‌...మీ పని చెబుతాను ఉండండి అని అనుకుంటాడు. మీబండి బాగు చేయాలంటే 10నిమిషాలు పడుతుందని చెప్పడంతో శైలూ,కీర్తి పక్కకు వెళ్లి కేశవ్‌కు ఫోన్ చేస్తారు. వీళ్ల నాటకం ముందే తెలుసుకున్న కేశవ్‌....వాళ్లతో చాలా తీయ్యగా మాట్లాడుతున్నట్లు నటిస్తాడు.మిమ్మల్ని కలవాలని ఉందని రెస్టారెంట్‌కు వస్తారా అని శైలూ అడగడంతో  కేశవ్‌ సరేనంటాడు.

కన్నా, మహా గుడికి వెళ్లగా...అక్కడికి గాయాత్రి వస్తుంది.గాయత్రిని చూడగానే కన్నాకు కోపం వస్తుంది.మళ్లీ ఎందుకు ఇక్కడికి వచ్చావని మండిపడతాడు.మమ్మల్ని మళ్లీ జైలులో పెట్టించడానికి వచ్చావా అని నిలదీస్తాడు. దీంతో గాయత్రికి కోపం వచ్చి కన్నాను తిడుతుంది.మా అమ్మానాన్న తప్పు చేస్తే....నన్ను అంటావేంటని అడుగుతుంది. మరి తమరు చేసిన ఘనకార్యం ఏంటోనని గాయత్రిపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేసి...అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 

Continues below advertisement

గాయత్రి మహాతో మాట్లాడుతుంది. మా బావను జైలులో పెట్టించాలని నేను మాత్రం ఎందుకు అనుకుంటానని అంటుంది. ఇటు బావపై ప్రేమను వదులుకోలేనని...అటు మా అమ్మానాన్నల మాట కాదనలేనని అంటుంది. నాకు నీ అంత ధైర్యం లేదని ఉంటే ఎప్పుడో వెళ్లి మా బావను పెళ్లి చేసుకునేదాన్నని అంటుంది. నాకు చిన్నప్పటి నుంచి మాదవ్‌ బావ అంటే ప్రాణమని...ఇప్పుడు వేరేవాళ్లను పెళ్లిచేసుకోమంటే ఎలా చేసుకుంటానని అంటుంది. మా అమ్మానాన్నలకు ఎంత చెప్పినా వినడం లేదని...ఇక ఈ జన్మకు నా కర్మ ఇంతేనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

శైలూ చెప్పినట్లే రెస్టారెంట్‌కు వచ్చిన కేశవ్‌తో శైలూ చాలా ప్రేమగా మాట్లాడతుంది. ఎప్పుడూ లేనిది ఇవాళ ఏంటి ప్రేమ ఒలకబోస్తున్నావని కేశవ్ అనగా....నా తప్పు తెలుసుకున్నానని...అందుకే మీకు సారీ చెబుతున్నానని అంటుంది. అవన్నీ ఎందుకులే గానీ నాడబ్బులు ఇచ్చిన ఫోన్ పట్టుకుని పొమ్మని చెబుతాడు. డబ్బులు నా దగ్గర లేవని.. అందుకే మీరు పెద్దమనసుు చేసుకుని నా ఫోన్ తిరిగి ఇస్తారేమోనని పిలిచానని అంటుంది. ఒకసారి నా ఫోన్ చూపించరా అని అడగ్గా...కేశవ్‌ తన జేబులో నుంచి ఫోన్ తీసి టేబుల్‌పై పెడతాడు. 

చాలా తెలివిగా ఆ ఫోన్ లాక్కునేందుకు శైలూ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొడతాయి.దీంతో మరో ప్లాన్ వేస్తుంది శైలూ...తనకు పొలమారినట్లు నాటకం ఆడగా....కేశవ్‌ పరుగెత్తుకెళ్లి జ్యూస్ తేవడానికి వెళ్తాడు. అప్పుడే శైలూ తన బ్యాగ్‌లో ఉన్న డమ్మీ ఫోన్ తీసి అక్కడ పెట్టి ఒరిజనల్‌ ఫోన్ బ్యాగ్‌లో వేసుకోవడం కేశవ్‌ చూస్తాడు. 

జ్యూస్ తీసుకుని వస్తూ వస్తూ శైలూ డ్రెస్‌పై పడేస్తాడు. దీంతో శైలూ కడుక్కోవడానికి వాష్‌రూమ్‌కు వెళ్లగానే....తన బ్యాగ్‌లో ఉన్న ఫోన్ తీసుకుంటాడు. తిరిగి వచ్చిన శైలూ ఫోన్ కనిపించకపోయేసరికి కేశవ్‌ కోసం వెతుకుతుంది. ఫోన్‌ పట్టుకుని బండిమీద కూర్చున్న కేశవ్‌...నా దగ్గరే నీ నాటకాలా అంటూ వడ్డీ కింద తిన్న దానికి బిల్లు కట్టేసి వెళ్లిపొమ్మని చెప్పి ఫోన్ తీసుకుని వెళ్లిపోతాడు.

పని మధ్యలోనే వదిలేసి నీరసంగా ఇంటికి వచ్చిన మాధవ్‌కు మహా టీ పెట్టి ఇస్తుంది. ఏంటి అన్నా అలా ఉన్నావని కన్నా అడిగినా ఏం చెప్పడు. దీంతో మహా మాధవ్‌ను ప్రశ్నిస్తుంది. గాయత్రిని మరిచిపోలేకపోతున్నారు కదండీ అని అడుగుతుంది. గాయత్రి పెళ్లి కుదిరినప్పటి నుంచి మీరు చాలా బాధగా ఉన్నారని నిలదీస్తుంది.