Podharillu Serial Today Episode: మాహా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో  ఊరివారంతా  నానా రకాలుగా మాట్లాడుకోవడం  చక్రి అన్నదమ్ములకు నచ్చడం లేదు. వాళ్లందరి నోర్లు మూయించాలంటే  మనం తప్పకుండా నాన్న చెప్పినట్లు  రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు పెట్టాల్సిందేనని అంటారు. ఇప్పుడు అంత ఖర్చు అవసరమా అని కేశవ్‌ అనగా....మనఇంట్లో జరుగుతున్న తొలి శుభకార్యం కాబట్టి ఖర్చు గురించి ఆలోచించవద్దని  చెబుతాడు. అందరికీ మటన్ బిర్యానీ పెట్టి మరీ ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉండటానికి  వచ్చిందని చెప్పి నోరు మూయిద్దామని అంటాడు. చక్రి సాయంత్రం అమ్మాయిని తీసుకుని వస్తానన్నాడు కాబట్టి ఈరోజే  ఆ పని చేద్దామని మాధవ్ అంటాడు. ఇంటి ముందే పెద్ద టెంట్‌ వేసి అంగరంగ వైభవంగా ఫంక్షన్ చేయాలని అన్నదమ్ములు ఏర్పాట్లు చేస్తుంటారు.               నిహారకి వాళ్ల ఇంట్లో ఉన్న మహాలక్ష్మీతో వాళ్ల అమ్మ మాట్లాడుతుంది. నువ్వు ఇక్కడ ఉండటం మాకు ఎలాంటి భారంకాదని...కాకపోతే నిన్ను ఇక్కడ చూశాడంటే మా అల్లుడు ఏమైనా గొడవ చేస్తాడేమోనని భయంగా ఉందని అంటారు. మీకు  ఆ భయం అక్కర్లేదండీ  నేను ఈరోజే మానాన్నను కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని అంటుంది. నీ పేరు చెబితేనే మీ నాన్న ఒప్పుకోవడం లేదని మీఅన్నయ్య చెప్పాడమ్మా...ఇప్పుడు నువ్వు నేరుగా  వెళితే బాగుండదని చెబుతాడు. ఇంతలోనే ఆది అక్కడికి వస్తాడు. రావడంతోనే  ఇది ఇక్కడ ఎందుకు ఉందని మండిపడతాడు. నిన్ను ఆస్పత్రికి వస్తేనే రానివ్వలేదని...మళ్లీ సిగ్గులేకండా   మా అత్తయ్యవాళ్ల ఇంటికి ఎలా వచ్చావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నేను నాన్నతో ఒకసారి మాట్లాడి వెళ్లిపోతానని చెప్పినా వినడు. నువ్వు చేసిన పనికే మా నాన్న ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని...మళ్లీ ఏం ముఖం పెట్టుకుని ఆయన్ను కలుస్తావని నిలదీస్తాడు. నీకు నాన్నపై అంత ప్రేమ ఉంటే...పోలీసుస్టేషన్‌లో  నాన్న అంత బ్రతిమాలినప్పుడు ఏం చేశావని ఆది మహాను తిడతాడు. మా పరువుతీసి ఆ డ్రైవర్‌తో తాళి కట్టించుకున్నప్పుడు ఏమైంది నీ ప్రేమ అని అంటాడు. మర్యాదగా బయటకు వెళ్లిపోతావా లేదా అంటూ చేయి పట్టుకుని బయటకు లాక్కుని వచ్చి విసిరేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రి మహాను పట్టుకుని ఆపుతాడు.             ఈ డ్రైవర్‌ వెదవ కూడా ఇక్కడే ఉన్నాడా అని ఆది మండపడతాడు. మీరిద్దరూ  ఇక్కడే కాదు ఈ ఊరిలో కనిపించినా చంపేస్తానని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మానాన్నను చూడొద్దని చెప్పడానికి నువ్వెవరివీ...నువ్వు ఏం చేసినా నేను నాన్నను చూసే ఇక్కడ నుంచి వెళ్తానని మహా అంటుంది. దీంతో ఆది వాళ్ల నాన్ను కు ఫోన్‌ చేసి స్పీకర్‌ ఆన్‌చేస్తాడు. మహా ఇక్కడికి వచ్చిందని...నిన్ను చూడాలని గొడవ చేస్తోందని అంటాడు.ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ల గురించి నేను ఆలోచించనని నా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని అంటాడు. నేను చచ్చివరకు దాని ముఖం నాకు చూపించొద్దని మండిపడతాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మీ ఎంతో బాధపడుతుంది. నాన్న చెప్పంది విన్నావు కదా...నిన్ను చూడటం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని దయచేసి ఇక్కడ గొడవ చేయకుండా బయలుదేరండని  ఆది చెప్పడంతో  చక్రి మహాను తీసుకుని బయటకు వెళ్తాడు. కోపంలో మీ నాన్న అన్న మాటలు పట్టించుకోవద్దని చక్రి మాహాను ఓదార్చుతాడు. నాకు  ఇష్టం లేని పెళ్లి చేయాలని చూసి వాళ్లు తప్పుచేసి ఇప్పుడు నిందలు నాపై వేస్తున్నారని మహా ఏడుస్తుంది. పెళ్లికి ముందు నేను చెప్పేది వినకుండా  నన్ను ఆ జుట్టుపోలిగాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారని...ఇప్పుడు అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోవడం లేదని అంటుంది. ఇప్పుడు  ఏం చేద్దామని అంటే మీ వదినకు ఒకసారి కాల్‌ చేసి మాట్లాడమని చక్రి ఫోన్ ఇస్తాడు. నిహారిక ఫోన్ చేయగా...నీమీద మీనాన్న,అమ్మ చాలా కోపంగా ఉన్నారని..నిన్ను మా ఇంట్లో ఉంచినందుకు నామీద కూడా మండిపడ్డారని చెబుతుంది. మీ నాన్నకు తగ్గి ఈ గొడవలు చల్లారే వరకు నువ్వు ఆయన్ను కలవడానికి ప్రయత్నించకపోవడమే మంచిదని చెబుతుంది. అన్ని సర్దుకున్న తర్వాత నేనే నీకు ఫోన్ చేసి చెబుతానని...అప్పటి వరకు ఫోన్ చేయడం గానీ,ఇక్కడకి రావడం గానీ చేయవద్దని అంటుంది.   అటు మాధవ్‌ వాళ్ల రిసెప్షన్‌కు అన్నీ ఏర్పాట్లు చేయడమేగాక...ఊరందరినీ పిలుస్తారు. మా ఇంట్లో సాయంత్రం రిసెప్షన్ ఉందని అందరూ తప్పకుండా రావాలని ఇంటింటికి తిరిగి వెళ్లి చెప్పి వస్తారు.

Continues below advertisement

 

Continues below advertisement