Podharillu Serial Today Episode: మహాలక్ష్మీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు చక్రి వాళ్ల అన్నదమ్ములు నానా హైరానా పడుతుంటారు. నిద్రలేచిన తర్వాత మహా స్నానం చేసి వచ్చి  బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్‌మెషిన్ లేదా అని అడగ్గా...రిపేర్‌కు ఇచ్చామని చక్రి అబద్ధం చెబుతాడు. ఇంతలో మాధవ్‌ ఆమెకు టీ పెట్టుకుని తీసుకొచ్చి ఇస్తాడు. నా కోసం మీవాళ్లు చాలా ఇబ్బందిపడుతున్నారని....నేను హాస్టల్‌కు  వెళ్లిపోతానని మహాలక్ష్మీ అంటుంది. ఇవాళ వెళ్లి అన్ని హాస్టళ్లు చూసి వద్దామని చక్రి చెబుతాడు.              తాను ఇంట్లోని వచ్చిన తర్వాత నాన్న,అమ్మ ఎలా ఉన్నారో కనుక్కుందామని  చక్రి ఫోన్‌ ద్వారా మహా వాళ్ల వదిన నిహారికకు  ఫోన్ చేస్తుంది. నువ్వు ఇలాంటి పని చేస్తావని అసలు ఊహించలేదు మహా నిహారిక కోప్పడుతుంది. అసలు ఎందుకు ఇలాంటి రాంగ్‌స్టెప్‌ వేశావని నిలదీస్తుంది. మీ నాన్న నీపై ఎంత నమ్మకం పెట్టుకుంటే నువ్వు ఇలా చేయవచ్చా అని అడుగుతుంది. నీ దారి నువ్వు చూసుకుంటే వాళ్లు ఏమైపోతారనుకున్నావని  అంటుంది. మరి నేను ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే నేనేం చేయనని అంటుంది. భూషణ్‌ విషయంలో  మీనాన్నగారు సరిగా అంచనా వేయకపోయినంత మాత్రానా  ఇలాంటి పని చేస్తావా అని అంటుంది.  అందరూ నీ గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా అని అంటుంది. ఇప్పుడు అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు వదినా....నేను తర్వాత చెబుతాను ముందు నాన్న ఎలా ఉన్నారని  అంటుంది. పరువు కోసం బ్రతికే మీ నాన్న ఏం చేస్తారో కూడా నీకు తెలియదా అని నిహారిక మండిపడుతుంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారని....ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నారని చెప్పడంతో మహా ఏడుస్తుంది. చక్రితో పాటు మాధవ్‌ కూడా వచ్చి ఏమైందని అడిగితే మానాన్న ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేశారంటా...ఆస్పత్రిలో ఉన్నారని చెబుతుంది. వెంటనే మహాను తీసుకుని వెళ్లమని మాధవ్‌ చక్రికి చెబుతాడు. ఇప్పటికే  చక్రిపై వాళ్లంతా చాలా కోపంగా ఉన్నారని ఇప్పుడు వీరు వెళ్లారంటే ఏదైనా గొడవ చేస్తారేమోనని కేశవ్ అంటాడు. అయితే మాత్రం ఇలాంటి సమయంలో  ఇక్కడే కూర్చుంటామా అని మాధవ్‌ అంటాడు. ఏం జరిగితే అది జరుగుతుందని...నువ్వు మాత్రం వెంటనే మహాను తీసుకుని వెళ్లమంటాడు. కన్నా కూడా వస్తానంటే మాధవ్‌ వద్దని చెబుతాడు. మనల్ని చూస్తే వాళ్ల కోపం రెట్టింపు అవుతుందని అంటాడు. అక్కడ ఏదైనా గొడవ జరిగితే వెంటనే ఫోన్ చేసి చెప్పమని...మేమంతా వచ్చేస్తామని కేశవ్ చెబుతాడు. మహా ఏడుస్తూ  కారులో బయలుదేరుతుంది.             ఇదంతా చూసిన చుట్టుపక్కల వాళ్లు ఆ అమ్మాయి ఇక్కడ ఉండలేక ఏడుస్తూ వెళ్లిపోతుందని ప్రచారం చేస్తారు. టీ కొట్టు వద్ద అప్పటికే వాళ్ల అన్నయ్యతో గొడవపెట్టుకుంటున్న నారాయణ వద్దకు వచ్చి చెబుతారు. మీ ఇంట్లో ఉండలేక మీ కోడలు వెళ్లిపోతోందని అంటారు. దీంతో నారాయణ వాళ్ల అన్నయ్య మరింత అవమానిస్తాడు. కారులో ఏడుస్తున్న మహాను చక్రి  ఓదారుస్తాడు. మీవల్లే ఇదంతా జరిగిందని మహా చక్రిపై కోప్పడుతుంది. 

Continues below advertisement

 

Continues below advertisement