Podharillu Serial Today Episode: మహాను స్టేషన్‌లోనే పక్కకు తీుసుకెళ్లి ప్రతాప్ ఎంతో బ్రతిమలాడతాడు. నిన్ను ఎంతో గారాబంగా పెంచితే ఇప్పుడు నువ్వు ఇలా పరువు తీయం భావ్యం కాదని అంటాడు. నువ్వుచెప్పినట్లే నీ వెంట వస్తానని కాకపోతే...ఈ పెళ్లి ఆపించాలని కోరుతుంది. దీనికి తండ్రి ససేమీరా అంటాడు. అయితే నేను కూడా నీవెంట రావడం కుదురదని అంటాడు. అయితే ఆ డ్రైవర్‌తో లేచిపోతావా అని అనడంతో మహాకు కోపం వస్తుంది. నువ్వు కూడా ఇంతేనే ఆలోచించేదంటూ అక్కడ నుంచి వచ్చేస్తుంది. తన తండ్రితో వెళ్లడం ఇష్టం లేదని మహా చెబుతుంది. మీ అమ్మాయి ఇష్టం లేనిదే మీతో పంపించడం కుదరదని ఎస్సై చెబుతాడు.అయితే మీ పైఅధికారులతో మాట్లాడి తీసుకెళ్తానంటూ ప్రతాప్ కోపంగా ఫోన్ చేస్తూ బయటకు వెళ్లిపోతాడు. ఖచ్చితంగా వీళ్లతో పంపిస్తే ఈ అమ్మాయిని ఆశాడిస్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారని...ఆ తర్వాత ఈ డ్రైవర్‌ను చంపేస్తారని పోలీసులు అనుకుంటారు. కాబట్టి మనమే ఏదో ఒకటి చేయాలని ఎస్‌ఐ కానిస్టేబుల్‌తో అంటాడు. నువ్వు వెళ్లి ఆ చక్రిని ప్రశ్నించు...నేను ఈ అమ్మాయి అభిప్రాయం తెలుసుకుంటానని ఎస్‌ఐ ఇద్దరినీ వేర్వేరుగా పిలిచి మాట్లాడతాడు. మీ నాన్న మా పై అధికారులతో చెప్పించి ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని....కాసేపట్లో ఆ పని జరిగిపోతుందని ఎస్‌ఐ మహాలక్ష్మీతో అంటాడు. ఇప్పుడు నీ ముందు ఉన్నది ఒకటే మార్గమని....నువ్వు ఆ చక్రిని పెళ్లి చేసుకుని వెళ్తే నిన్ను ఎవరూ ఆపలేరని అంటాడు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి పెళ్లి చేసుకుండా వెళ్లినా....మీ వాళ్లు మిమ్మల్ని వెంటాడి వాడిని చంపేసి నిన్ను తీసుకుని వెళ్లిపోతారని చెబుతాడు. నీకు సాయం చేయడానికి వచ్చి వాడి ప్రాణాల మీదకు తెచ్చకున్నాడని చెబుతాడు. నిజంగా మేం ఇద్దరం లవర్స్ కాదని...కేవలం అతన్ని సాయం కోరి మాత్రమే వచ్చానని మహా చెబుతుంది. ఏదీఏమైనా ఇప్పుడు నీ ముందు ఒకటేదారి ఉందని.....మీ నాన్న వెంట వెళ్లి వాడిని పెళ్లి చేసుకోవడమా లేకపోతే ఇక్కడే ఆ డ్రైవర్‌ను పెళ్లి చేసుకుని నీ భవిష్యత్ దిద్దుకోవడమా ఆలోచించుకోమని చెప్పి వెళ్లిపోతాడు. అటు చక్రిని పక్కకు తీసుకెళ్లిన కానిస్టేబుల్ కూడా చక్రిని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వుబయటకు వెళ్లావంటే ఖచ్చితంగా వాళ్లు నిన్ను చంపేస్తారని బెదిరిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కడితే అన్ని సమస్యలు తీరిపోతాయని చెబుతాడు. దీనికి నీకు అంగీకారమేనా అని అడుగుతాడు. కోరి వరమిస్తే వద్దంటానా అని చక్రి అనుకుంటాడు. ఇలా అన్నీ తనకు అనుకూలంగా మారుతున్నాయని లోపల ఆనందపడిపోతాడు. పైకి మాత్రం తనకు ఏం అయిన పర్వాలేదు కానీ....మహాకు మాత్రం ఆ శాడిస్టు భూషణ్‌గాడితో పెళ్లి తప్పిపోతే చాలని నటిస్తుంటాడు. తనను కాపాడటం కోసం పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. ఇదే విషయం మహాతో చెప్పగా...ఆమె కోప్పడుతుంది. పెళ్లి ఏంటని నిలదీస్తుంది. ఇప్పుడు ఈపెళ్లి జరగకపోతే నన్ను చంపేస్తారంటా అని చక్రి చెప్పడంతో ఆమెకు ఏమీ పాలుపోదు. అయితే చక్రి ఇక్కడ ఉత్తుత్తి పెళ్లి చేసుకుందామని....ఆ గండం నుంచి బయటపడిన తర్వాత నీ భవిష్యత్ గురించి ఆలోచిద్దామని అంటాడు. పోలీసులు వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారని తెలుసుకున్న ఆది వెంటనే వెళ్లి వాళ్ల నాన్నకు ఈ విషయం చెబుతాడు. పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ప్రతాప్ వెంటనే లోపలికి వచ్చి ఎస్‌ఐ పై మండిపడతాడు. దానికి ఎస్‌ఐ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. వాళ్లిద్దరూ మేజర్లని....పెళ్లి చేసుకోవాలా వద్దా అన్నది వాళ్లు నిర్ణయించుకుంటారని చెబుతాడు. మీరు ఎంత పై అధికారులకు ఫోన్లు చేసినా...వాళ్లు కూడా నాకు ఇదే చెబుతారని చెబుతాడు. ఇంతలో ఈ పెళ్లి చేసుకోవడం తనకు కూడా ఇష్టమేనని మహా చెబుతుంది.
Podharillu Serial Today January 14th: చక్రితో పెళ్లికి మహా అంగీకరించిందా..? మహా నిర్ణయంతో ప్రతాప్, భూషణ్ ఏం చేశారు..?
ABP Desam | 14 Jan 2026 10:31 AM (IST)
Podharillu Serial Today Episode January 14th: ఈ గండం నుంచి గట్టెక్కాలంటే మీరు ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని ఎస్‌ఐ మహా, చక్రికి సూచిస్తాడు. అప్పుడు వాళ్లిద్దరూ ఏం చేశారు..?
పొదరిల్లు సీరియల్