Podharillu Serial Today Episode: ఇంటి ముందు ఫ్లెక్సీ , రిసెప్షన్ ఏర్పాట్లు చూసి చక్రి, మహా కంగుతింటారు. ఏంటి ఇందంతా అంటూ చక్రిపై మహా గొడవ పెట్టకుంటుంది. వెంటనే ఇదంతా ఆపకపోతే నేను ఇంటికిరానని గొడవ చేస్తుంది. శాశ్వతంగా నీ పెళ్లంగా ఉండటం కన్నా బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లో ఉంటానని చెబుతుంది. నాకు కూడా ఇదంతా తెలియదని చక్రి అంటాడు. వాళ్లు మాట్లాడుతుండగానే  కేశవ్‌, కన్నా అక్కడికి వస్తారు. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన...అందరూ మీకోసమే  ఎదురుచూస్తున్నారని చెబుతారు. చక్రి కిందకు దిగే సరికి మాధవ్‌ కూడా వచ్చి త్వరగా వచ్చి రెడీ అవ్వండని చెబుతాడు. ఏంటన్నా ఇదంతా అంటే....నీకు కన్నా చెప్పలేదా అని అంటాడు. నాకు ఎవరూ ఏం చెప్పలేదని చెప్పగా....సర్‌ఫ్రైజ్‌ ఇద్దామని కన్నా చెప్పనివ్వలేదని కేశవ్‌ అంటాడు. సరేలే లోపలికి రండని చెప్పి వారిద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్తాడు మాధవ్. దీంతో నారాయణకు పట్టరాని ఆనందం వస్తుంది.నా కోడలు తిరిగి రాదని కూశారు కదరా...ఇప్పుడు చూడండని  డ్యాన్స్‌లు వేస్తాడు.                       బావ వాళ్ల ఇంట్లో ఫంక్షన్‌కు ఎలా వెళ్లాలా అని గాయత్రి మదనపడిపోతుంది. వాళ్ల అమ్మకూడా  రెడీ అవుతుండటంతో  ఆమెకు ఏం అర్థం కాదు. ఇంతలో వాళ్ల పెద్దమామయ్య వచ్చి ఎందుకు అర్జెంట్‌గా రమ్మని ఫోన్  చేశావని అడుగుతాడు. మా అన్నయ్య, మీ తమ్ముడి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే  వెళ్లకపోతే ఎలా అని అంటుంది. ఆ మాటలకు  ఆయనతోపాటు   గాయత్రి కూడా షాక్‌కు గురవుతుంది. మా అమ్మ నోటి వెంట ఇంత మంచి మాటలు ఎలా వచ్చాయని ఆశ్చర్యపోతుంది. వాళ్ల అన్నయ్య కూడా మనం ఎందుకు ఆ ఇంటికి వెళ్లడం అని అంటాడు. పెళ్లి జరిగిందని తెగ సంబరపడిపోతున్నారు కదా...ఎలాగూ ఆ పెళ్లి కూతురు తిరిగి రాదు కదా..అప్పుడు వాళ్ల ముఖాలు చూసి మనం ఆనంందపడాలి  కదా అందుకైనా మనం ఆ  ఇంటికి వెళ్లాలని అంటుంది. నేను కూడా వస్తానని గాయత్రి అంటే....కాళ్లు విరగ్గొడతానని  చెప్పి ఇంట్లో కూర్చోబెడుతుంది.                          ఇంట్లోకి వచ్చిన తర్వాత మహా చక్రిపై గట్టిగా అరుస్తుంది. నీకు ముందే చెప్పాను కదా మీ అన్నయ్యవాళ్లకు నిజం చెప్పమని....ఇప్పుడు చూడు ఏం జరిగిందోనని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వాళ్లు ఇలా చేస్తారని నేను కూడా ఊహించలేకపోయానని  అంటాడు. నాకు అవన్నీ తెలియదని...నేను మాత్రం చస్తే రానని చెబుతుంది. మీ అన్నయ్యలకు ఏం చెప్పుకోమని లోపలికి వెళ్తుంది. ఇంతలో కేశవ్‌,కన్నా అక్కడికి వస్తారు.

Continues below advertisement

ఎవరిని అడిగి ఇదంతా చేశారని చక్రి మండిపడతాడు. నువ్వు మాకు చెప్పే పెళ్లి చేసుకున్నావా అని కేశవ్ నిలదీస్తాడు. నీకోసమే కదా ఇదంతా  చేస్తే నువ్వేంటిరా  మామీద ఎగురుతున్నావు  అని కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. వాళ్ల నాన్న ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. కనీసం మమ్మల్ని చూడటానికి  కూడా  రానివ్వలేదు. రాత్రంతా తను ఏడుస్తూనే ఉంది.ఈ టైంలో మీరు ఇలా రిసెప్షన్‌ అంటే  ఎలా వస్తుందని అంటాడు. మీరు వెళ్లినప్పటి నుంచి ఊరిలో అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని....వాళ్లందరి నోళ్లు మూయించాలంటే   ఇదొక్కటే మార్గమని మాధవ్‌ అంటాడు. వాళ్లకు బుద్దిలేకపోతే నీకు కూడా లేదా అన్నయ్య అని చక్రి అనడంతో కేశవ్‌కు కోపం వచ్చి ఇద్దరూ కొట్టుకుంటారు. మహా వచ్చి చూడటంతో  వాళ్లిద్దరూ ఆగిపోతారు.

Continues below advertisement

బయట అందరూ వచ్చారని...ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదని మాధవ్  అంటాడు. వాళ్లందరి ముందు మన పరువు నిలబడాలంటే ఆ అమ్మాయి వచ్చి ఒక గంట నీ పక్కన స్టేజీపైన నిల్చుంటే చాలని చెబుతాడు. నువ్వు ఏం చెప్పి ఒప్పిస్తావో నీ ఇష్టం అని చెప్పి వెళ్లిపోతాడు. మహాను  ఒప్పించేందుకు చక్రి ఆమె ఉన్న గదిలోకి వెళ్తాడు. దీంతో మహాకు మరింత కోపం వస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ  నిజం మీ అన్నయ్యలతో పాటు అందరికీ చెప్పేయండి అని అంటుంది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ  నిజం చెప్పలేనని అంటాడు. అయితే నేనే చెబుతానని  మహాలక్ష్మీ అంటుంది.