Podharillu Serial Today Episode: పోలీసుస్టేషన్‌లో  మ్యారేజీ సర్టిఫికేట్  తీసుుకున్న తర్వాత మహా చక్రిపై చాలా కోపంగా ఉంటుంది. మనుకు ఉత్తుత్తి పెళ్లి  అని చెప్పి ఇప్పుడు ఇదంతా ఏంటని నిలదీస్తుంది. ఇప్పుడు మనం ఇది తీసుకోకపోతే...మీఇంట్లో వాళ్లకు, మా అన్నయ్యలకు ఫోన్‌చేసి పిలిపిస్తారని ఇప్పుడు ఈ గొడవ  అవసరమా అని అంటాడు. ముందు ఇది తీసుకుని ఇక్కడ నుంచి బయటకు వెళ్లిపోతే ఆ తర్వాత  దీని గురించి ఆలోచిద్దామని చెబుతాడు. దీంతో మహా సరేనడంటో  చక్రి పోలీసులు వద్ద నుంచి మ్యారేజీ  సర్టిఫికేట్‌ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతారు.                 

చక్రి, మహా రిసెప్షన్‌ ఏర్పాట్లు  ఘనంగా సాగుతుంటాయి. ఘుమఘుమలాడే  వంటకాలను మాధవ్ దగ్గర ఉండి చేపిస్తుంటాడు. ఇంతలో గాయత్రి అక్కడికి వస్తుంది. మహాలక్ష్మీ జాకెట్ తీసుకుని వస్తుంది. ఇది మా అమ్మ చూసి ఎంతో గొడవ చేసిందని.....చెబుతుంది. ఆమెకు  మాధవ్‌ థ్యాంక్స్‌చెబుతాడు. అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే  ఈ పనులన్నీ నేనే దగ్గర ఉండి చూసుకునేదాన్ని కదా బావా అని అంటుంది. నిజంగా నేనంటే  ఇష్టం లేదా అని నిలదీస్తుంది. అదేమీ లేదని మీ అమ్మ ఎట్టిపరిస్థితుల్లో  నిన్న మా ఇంటికి పంపదని చెబుతాడు.

మనకు  రాసి ఉంటే  జరుగుతుందని లేకుంటే లేదని చెబుతాడు. మా చక్రికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని దేవుడి రాసిపెట్టాడు కాబట్టే  పెళ్లి జరిగిందని చెబుతాడు. నా పిరికితనమే నాకు శాపంగా మారింది బావ అని గాయత్రి బాధపడుతుంది. మహాకు ఉన్నంత  ధైర్యం ఉన్నా.. ఎప్పుడో మన పెళ్లి జరిగేదని అంటుంది. మా అమ్మ తెచ్చిన సంబంధాలన్నీ  నేనే చెడగొడుతున్నానని తెలిస్తే నన్ను చంపేస్తుందని  అంటుంది. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఏమీ చేయకు అని మాధవ్‌ గాయత్రిని మందలిస్తాడు.                   

కారులో వస్తూ మార్గమధ్యలో కారు ఆపుతుంది మహా...కిందకు దిగిన తర్వాత చక్రిపై గట్టిగా అరుస్తుంది. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నట్లు నాకు అనుమానంగా ఉందని మండిపడుతుంది. ఉత్తుత్తి పెళ్లి అని చెప్పి నాకు తాళి కట్టడమే కాకుండా ఇప్పుడు ఏకంగా  పెళ్లి  రిజిస్ట్రేషన్  చేయించావని ఆగ్రహం వ‌్యక్తం చేస్తుంది. నీకు తెలియకుండా ఈ పెళ్లి ఎలా  రిజిస్ట్రేషన్ చేశారని అంటుంది.అసలు నేను ఎప్పుడు సంతకం పెట్టానని అంటుంది. చూడబోతే నువ్వే కావాలని నన్ను ఈ సుడిగుండలో పడేసినట్లు అనిపిస్తోందని అంటాడు. దీంతో చక్రి ఇరకాటంలో పడతాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే  మహా ఖచ్చితంగా ఇంటికి రాదని భయపడతాడు. నాకు మాత్రం ఆలోచించుకునే గ్యాప్‌ ఎక్కడ ఇచ్చారండీ అని అంటాడు.మీవాళ్లంతా నన్ను కొడుతూనే ఉన్నారు కదా అని కోప్పడతాడు. అసలు మీఇంటికి  రాకముందు నేను మీకు తెలుసా అని నిలదీస్తాడు. ఆ జుట్టుపోలిగాడు మీద అసహ్యం కలిగించేలా నేను ఏమైనా  చేశానా....మీరే కదా వాడితో పెళ్లి వద్దు అనుకున్నది.

మీరే కదా వాడితో పెళ్లి జరగకుండా  చూడాలని నన్నుకోరింది అని అంటాడు. మా అన్నదమ్ములు ప్రాణాలు లెక్కచేయకుండా వాడిని కిడ్నాప్‌ చేసి మీ పెళ్లి ఆపించామని గుర్తు చేస్తాడు. నేను మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లిపోండని సలహా మాత్రమే  ఇచ్చానని నా వెంట రమ్మని అడిగానా అంటాడు. నేను వద్దు వద్దు అంటున్నా  అర్థరాత్రి ఆ జుట్టుపోలిగాడి ఫోన్‌ చేసింది మీరే....వాడు మీ నాన్న,అన్నయ్యలను  నిద్రలేపి మన వెంటపడేలా చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసమే కదా  పోలీసుస్టేషన్‌కు వెళ్లాం అంటాడు.ఇందులో నా తప్పు ఏమైనా ఉందా అని నిలదీస్తాడు. మీరు ఫోన్ చేయకుండా ఉంటే....అసలు పోలీసుస్టేషన్‌కు వెళ్లే అవసరమే వచ్చేది కాదుకదా అని అంటాడు. తప్పులన్నీ మీరు చేసి మళ్లీ నా మీద నిందలు వేస్తున్నారని అంటాడు. స్టేషన్‌లో కూడా అందరూ నీకు పెళ్లి ఇష్టమా లేదా అని అడిగారు కానీ...నన్ను ఒక్కరైనా అడిగారా అని అంటాడు. అసలు నా ఇష్టాఇష్టాలు కనుక్కున్నారా అని అంటాడు.

నా ప్రమేయం లేకుండానే  నాతో తాళికట్టించారని చక్రి అంటాడు. నాకన్నా ముందు మా అన్నయ్య ఉన్నాడని వాడికి పెళ్లి చేయకుండానే  నేను పెళ్లి చేసుకున్నానని బాధపడతాడు. ఇప్పుడు గొప్పింటి అమ్మాయిని లేపుకుని వచ్చానని అందరూ అంటున్నారని...ఇప్పుడు మా తమ్ముళ్లకు పిల్లను ఎవరిస్తారని నిలదీస్తాడు. మిమ్మల్ని రక్షించడం కోసం నేను ఇంత చేస్తే ఇప్పుడు మీరు కూడా నన్నే అంటున్నారని అంటాడు. అసలు పోలీసుస్టేషన్‌లోనే మిమ్మల్ని వదిలేసి పోయి ఉంటే ఈపాటికి ఆ జుట్టుపోలిగాడిని  చేసుకుని కెనడా వెళ్లేవారని అంటాడు. దీంతో మహా కొంచెం తగ్గి చక్రికి సారీ చెబుతుంది. దీంతో వారు కారులో ఇంటికి చేరుకుంటారు. వీధి ముందే రిసెప్షన్‌కు  ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూసి మహా షాక్‌కు గురవుతుంది. ఇదికూడా మీపనేగా అని మళ్లీ చక్రిపై మండిపడుతుంది. వాళ్లంతా నాకు  సర్‌ఫ్రైజ్ ఇస్తామని అంటుంటే ఏంటో అనుకున్నానండీ....నిజంగా ఇలాంటి సర్‌ఫ్రైజ్‌ అని తెలియదు అని చక్రి అంటాడు.