Podharillu Serial Today Episode: ఉదయం లేవగానే ఎవరి పనులకు వాళ్లు వెళ్తుండటం చూసి మహా ఆశ్చర్యమేస్తుంది. మాధవ్‌ పెద్ద ఆర్కిటెక్చర్‌ అని చెప్పాడు కదా..ఆయన ఏంటి ఇంత సాదాసీదాగా  చెప్పులు వేసుకుని మేస్త్రీ చేసే పనిముట్లు తీసుకుని సైకిల్‌పై వెళ్తున్నాడని అనుమానం వస్తుంది. మాధవ్‌ వెళ్తుండటం అలాగే చూస్తూ ఉంటుంది. మహాను చూసి చక్రికి కూడా అనుమానం వస్తుంది.ఇక్కడే ఉంటే ఏదో ఒకటి అడుగుతుందని తప్పించుకుని వెళ్దామని ట్రై చేస్తుంటాడు.ఇంతలో మహా చక్రిని పిలిచి మీ అన్నయ్య ఆర్కిటెక్ అన్నావు కదా....మరి ఏంటి అలా వెళ్తున్నాడని అడుగుతుంది.  ఇప్పుడు సైట్‌ దగ్గరకు వెళ్తున్నాడని అందుకే అలా సింపుల్‌గా వెళ్తున్నాడని అబద్ధం చెబుతాడు. పనివాళ్లలో పనివాడిగా  కలిసిపోతేనే  పని త్వరగా అవుతుందని అన్నయ్య  ఉద్దేశమని చెబుతాడు. అయినా మా అన్నయ్యకు సింపిల్‌గా ఉండటం ఇష్టమని  నీకు తెలుసు కదా అని అంటాడు.  నేను  కూడా  పనికి  వెళ్లక చాలా రోజులు అవుతుంది కాబట్టి వెళ్లి వస్తానని చెప్పి తప్పించుకుంటాడు. ఇంట్లో వాళ్లందరూ  వెళ్లిపోయిన తర్వాత కన్నా, నారాయణ, మహా  ఉంటారు.  మహా  వెళ్లి నారాయణను నిన్న పోలీసులు  తీసుకెళ్లారు కదా వాళ్లు ఏమీ అనలేదా అని ఆరా తీస్తుంది. దీంతో నారాయణ వాళ్ల కన్నాపై మండిపడతాడు. నిన్నగాక  మొన్న వచ్చిన నా కోడలు  నాపై ఇంత ప్రేమ చూపిస్తోందని....ఇంట్లో  అడ్డగాడిదల్లా  నలుగురు  కొడుకులు ఉన్నారు ఏనాడైనా  ఇలా  పలకరించారురా  అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పోలీసులు ఏం అనలేదని  చెప్పి లోపలికి వెళ్లి ఇంట్లో చికెన్, మటన్  వండలేదని మండిపడుతూ  బయటకు వెళ్లిపోతాడు. చూశారుగా  ఆయన బిహేవియర్‌ ఎలా ఉంటుందో  అందుకే మేం అయన్ను అసలు పట్టించుకోమని కన్నా చెబుతాడు                     బారెడు పొద్దు ఎక్కినా నిద్ర లేవలేదని వరాలు కూతురుపై మండిపడుతుంది. ఇంట్లో పని మొత్తం తాను ఒక్కదాన్నే చేసుకోలేక చస్తున్నానని అంటుంది.కాలేజీకి టైం అవుతున్నా కూతరు లేవకపోవడంతో  వెళ్లి లేపడానికి ట్రైచేస్తుంది. నాకు కొత్త ఫోన్ కొనిస్తానన్నారని  అది కొంటేనే కాలేజీకి వెళ్తానని చెప్పి మళ్లీ పడుకుంటుంది. మీ నాన్న చేసే బంట్రోత్ ఉద్యోగానికి ఇల్లు గడవడమే కష్టంగా ఉందని...ఇక నీకు ఫోన్ ఎక్కడి నుంచి కొనిస్తాడని మండిపడుతుంది.మొగుడిపై అరుస్తూనే  అతనికి క్యారేజీ కడుతుంది.ఇంతలో ఆమె భర్త వచ్చి నా కూతురు ఎక్కడ అని అడిగితే ఇంతవరకు నిద్రలేవలేదని చెబుతుంది. వెళ్లి కూతురుని నిద్రలేపి నువ్వు ఎదురు వస్తేనే కదా నేను వెళ్లేదని అంటాడు. ఇవాళ ఖచ్చితంగా   ఫోన్ కొనివ్వాలని  అనగా....కొంటానని చెబుతాడు. మూడు నెలలుగా  ఇంటికి అద్దె కట్టలేదు గానీ ఫోన్ ఎక్కడి నుంచి కొనిస్తారని వరాలు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదో ఒకటి చేసి కొనిస్తానులే అంటాడు. తాను చెప్పిన 30వేల రూపాయల ఫోన్‌ మాత్రమే కొనాలని  కూతురు చెప్పడంతో....వరాలు  గుండె ఆగిపోయినంత పనవుతుంది. నేను కొంటానులేమ్మా అంటూ తండ్రి ఆమెను నిద్రలేపి ఎదురురమ్మని చెబుతాడు. ఇంతలో బయట నుంచి వచ్చిన కొడుకుని రాత్రి ఇంటికి రాలేదని నిలదీస్తుంది వరాలు. మా ప్రెండ్‌ వాళ్ల నాన్న కొత్త బైక్‌ కొనిచ్చాడని....పార్టీ ఇస్తే అక్కడే తిని నిద్రపోయామని చెబుతాడు. ఇలా వాళ్లఇంట్లో వీళ్ల ఇంట్లో పడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని వాళ్లు అరుస్తారు. మూడేళ్లుగా  డిగ్రీ పాసవ్వడం లేదని మండిపడతారు.                           ఉద్యోగం  కోసం  ఓనర్‌ దగ్గరకు వెళ్లిన చక్రిని ఓంకారేశ్వరు తిట్టి పంపిస్తాడు. నీవల్ల నా ప్రాణాలమీదకు వచ్చిందని మండిపడతాడు. డ్రైవర్‌గా పంపిస్తే ఆ ఇంటి అమ్మాయినే లేపుకుని వచ్చి పెళ్లి చేసుకుంటావా అని ఆగ్రహం వ్యక్త చేస్తాడు. వాళ్ల నాన్న, అన్న నన్ను చంపేసినంత  పనిచేశారని అంటాడు. ఇంకోసారి ఇటువైపు వచ్చావంటే  కాళ్లు విరగ్గొడతానని   అంటాడు. కొత్తగా  పెళ్లయ్యిందని,  ఇప్పుడు  ఉద్యోగం లేకపోతే కష్టమని చక్రి ఎంత  బ్రతిమలాడిని  ఓనర్‌ ఉద్యోగం ఇచ్చేది లేదని అంటాడు. నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా నిన్ను ఈచుట్టుపక్కలకు రానివ్వనని తెగేసి చెబుతాడు. దీంతో  చక్రి ఉసూరుమంటూ వెళ్లిపోతాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న  మహా, కన్నా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకలి అవుతోందని అన్నం తిందామని  రెడీ అవుతుండగా కేశవ్‌ కూడా  వస్తాడు. మహాను  చూసి పారిపోతాడు. ఎందుకు కేశవ్‌ అలా వెళ్లిపోయాడని మహా అడిగితే ఉదయం నీపై కోప్పడ్డాడు  కదా అందుకే భయపడి పారిపోయాడని కన్నా చెబుతాడు. ఎక్కడికి  వెళ్తాడు రాత్రికి ఇంటికే రావాలి కదా అంటుంది. కొన్ని రోజులకు వాడే సెట్‌ అవుతాడని కన్నా  చెబుతాడు.

Continues below advertisement

 

Continues below advertisement