Podharillu Serial Today Episode: మహా పెళ్లి ఆగిపోవడంతో చక్రి మాధవ్‌ అన్నయ్యకు  ఫోన్‌ చేసి చెబుతాడు. ముహూర్తం దాటిపోయింది కాబట్టి మహా పెళ్లి నిలిపివేశారని...ఇక ఆ పెళ్లికొడుకుతో మనకు అవసరం లేదని వాడని వదిలిపెట్టాలని చెబుతాడు.  దీంతో వాళ్లంతా  సంతోషపడతారు. ఎలాగైతే మహా పెళ్లి ఆపేసి ఆమె వద్ద మార్కులు కొట్టేశానని  ఇటు చక్రి కూడా ఎంతో ఆనందంతో ఉంటాడు. మహా తన గదిలో సంతోషంతో గంతులేస్తుండటంతో  చక్రి చిన్నగా అక్కడికి వెళ్తాడు. ఇంట్లో వాళ్లంతా బాధపడుతుంటే...మీరు మాత్రం ముఖంలో సంతోషంగా ఉంటే చాలా ‌అనుమానం వస్తుందని....కాబట్టి మీరు బాధపడుతున్నట్లే  నటించమని చెబుతాడు. ఇంతకీ ఎవరు ఈ పనిచేశారని మహా అడిగితే....మా ఇంట్లో వాళ్లంతా కలిసి చేశారని చెబుతారు. మీరుచాలా జాగ్రత్తగా  ఉండాలని....మాఇంట్లో వాళ్లు అంత మంచివాళ్లు కాదని జాగ్రత్తలు చెబుతుంది మహా....                        కిడ్నాప్ చేసిన భూషణ్‌ను ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి చక్రి వాళ్ల తమ్ముళ్లు పారిపోతారు. అతడు కళ్లకు కట్టిన గంతలు విప్పుకుని చిన్నగా ఇంటిముఖం పడతాడు. ఇంతలోఇంటిలో అతని కోసం కంగారుపడుతున్న వాళ్లంతా భూషణ్‌ను చూసి చాలా సంతోషపడతారు. ఏం జరిగిందని...వాళ్లు ఏమైనా ఇబ్బందిపెట్టారా అంటూ  ఆరా తీస్తారు. అసలు వాళ్లు ఎవరని...నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారని భూషణ్‌ అడగగా....నాకు ఎలా తెలుస్తుందని ప్రతాప్ అంటాడు. వాళ్లు నీతో ఏం మాట్లాడలేదా అని అడుగుతాడు. నన్నేమీ అడగలేదని....మర్యాదగానే చూసుకున్నారని చెబుతాడు. అయితే డబ్బులు అడగలేదు, నిన్ను ఏంచేయలేదంటే మరిఎందుకు కిడ్నాప్ చేసినట్లు అని ఇంట్లో వాళ్లకు అనుమానం వస్తుంది. మీకు కెనడాలో గానీ ఇక్కడ ఎవరైనా  శత్రువులు ఉన్నారా  అని అడిగితే...అలాంటిదేమీ లేదని భూషణ్ అంటాడు. సరిగ్గా  పెళ్లిముహూర్తం సమయానికి  తీసుకెళ్లారు...సమయం అయిపోగానే వదిలేశారంటే...వాళ్లకు మన రిజిస్టర్ మ్యారేజీ గురించి తెలిసి ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేస్తాడు. ఒకవేళ ఎవరైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారా అనిఅనుమానపడతాడు. అలా అనుకునేవాళ్లు ఎవరు ఉన్నారని ప్రతాప్‌ అంటాడు. భూషణ్‌ వాళ్ల అమ్మ ఏదో కీడు శంకిస్తోందని అని అనగా...అలాంటి మూడనమ్మకాలు వదిలేయాలని భూషణ్ అంటాడు. మళ్లీ రిజిస్ట్రర్ ఆఫీసులో టైం చూసుకోవాలని కోరగా....మళ్లీ నెలరోజులు ఆగాల్సిందేనని ఆది అంటాడు. దీనికి భూషణ్‌కు కోపం వస్తుంది.ఇలా అయితే మహాకు వీసా దొరకడం కష్టమని అంటాడు. దీంతో ప్రతాప్ కల్పించుకుని తాను  చూసుకుంటానని అంటాడు. కానీ  ఈ పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరో అర్థం కావడం లేదని అంటాడు. 

Continues below advertisement

                           రిజిస్టర్‌ మ్యారేజీ పోస్టుపోన్ చేసి పెళ్లి ముహూర్తమే  ముందుకు జరుపుదామని అంటాడు. మరో 3 రోజుల్లో మంచి మూహర్తం ఉందని...ఆ రోజు పెళ్లి జరిపించేస్తే..ఇక మీరు రిజిస్టర్ మ్యారేజీ చేయించాల్సిన అవసరం లేదని...డైరెక్ట్‌గా మ్యారేజీ సర్టిఫికేట్ తీసుకోవచ్చని చెబుతాడు. దీనికి భూషణ్ ఓకే చెబుతాడు. ఇంతలో చక్రి మహా దగ్గర కోతలు కోస్తుంటాడు. తాను డ్రైవర్‌ను కాదని...పెద్ద ట్యాక్సీ ఏజెన్సీ ఉందని చెబుతాడు. మా పెద్దన్న పెద్ద ఆర్కిటెక్ట్‌ అని అబద్ధాలు చెబుతుంటాడు. అతని భోజనం ఇచ్చి ఇంట్లోకి తిరిగి వస్తుంటే  భూషణ్ ఎదురుపడతాడు.

Continues below advertisement