Podharillu Serial Today Episode: మాదవ్‌ పద్ధతి సంస్కారం అన్నీ నచ్చి పిల్లని ఇవ్వడానికి ఆడపిల్లవారు ఒప్పుకున్నా....ఓ కండిషన్ పెడతారు. ఐదుగురు మగవాళ్లు ఉన్న ఇంటికి అమ్మాయిని పంపించాలంటే ఎవరైనా ఆలోచిస్తారు  కదా  అంటారు. కాబట్టి బయట వేరే ఇల్లు తీసుకుని ఉండి...అప్పుడప్పుడు వచ్చి మీ తమ్ముళ్లను చూసుకుంటామంటే ఎలాంటి ప్రాబ్లం లేదని చెబుతారు. మీ బదులు మీ నాన్నగారు  మీ తమ్ముళ్లను చూసుకుంటారు కదా అని అంటారు. మీ అమ్మాయిని ఇవ్వడానికి మా తమ్ముళ్లే అడ్డం అనుకుంటే నాకు ఈ సంబంధం అవసరంలేదని అంటాడు. మా అమ్మ చనిపోయే నాటికి నా చిన్న తమ్ముడు పాలుతాగే పసివాడని...అ్పటి నుంచి వారిని నేనే పెంచానని అలాంటి వాళ్లను ఎలా వదిలేసి రాగలనని అంటాడు. అమ్మలేని ఇంట్లో అన్న కూడా  లేకపోతే వాళ్లు ఏమైపోతారని అడుగుతాడు. నా తమ్ముళ్లను  వదిలి వస్తేనే నాకు మంచి జరుగుతుందంటే...అలాంటి మంచి నాకు అవసరం లేదని చెబుతాడు.

Continues below advertisement

   టిఫిన్ చేసే దగ్గర భూషణ్ చేసిన అవమానానికి మహా చాలా కోపంగా ఉంటుంది. వాళ్ల అన్నయ్యను పిలిచి చెడామడా తిడుతుంది. వాడు జీవితాంతం మాటలు అంటుంటే నేను పడుతూనే ఉండాలా అని నిలదీస్తుంది. ఇంత అవమానాలు పడటం నావల్ల కాదని అంటుంది. చస్తే ఆ భూషణ్‌ను పెళ్లి చేసుకోనని చెబుతుంది. నిన్ను మాటలు అంటుంటే నాకు కూడా బాధగానే ఉందని...నేను అతనితో మాట్లాడి నీకు నచ్చినట్లు చేస్తానని ఆది చెల్లితో అంటాడు. భార్య అంటే బానిసగా చూసే ఆ సైకో గాడు వద్దంటే వద్దని మహా చెబుతుంది. ఇప్పుడు బట్టల కోసం వెళ్లే సమయంలో ఇలాంటివి చెబితే బాగుండదని....నాన్నకు చెబితే ఎలా రియాక్ట్‌ అవుతాడో తెలియదని ఆది అంటాడు. పెళ్లి పనులు ఇంతదూరం వచ్చిన తర్వాత ఎలా ఆపగలమని సర్దిచెప్పి వెళ్లిపోతాడు.    ఈలోగా  మాధవ్‌ను పెళ్లిచూపులు చూసుకోవడానికి వచ్చిన్ ఆడపెళ్లివాళ్లు చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేస్తుంటారు. మాధవ్‌ చాలా మంచివాడని చెబుతారు. ఇంతలో మాధవ్‌ పెద్దనాన్న వాళ్లకు తారసపడతాడు. అతన్ని అడగ్గా... నారాయణ పచ్చి తాగుబోతని, అతను తన పెళ్లాన్ని చంపి జైలుకు వెళ్లి వచ్చాడని చెబుతాడు. ఆ ఇంట్లో నాకు, మా చెల్లికి కూడా వాటా ఉందని ఆడపెళ్లివారికి చెబుతాడు. ఈ సంబంధం చెడగొడుతుండటాన్ని మాధవ్‌,కేశవ్‌ చెప్పి పెళ్లి చెడగొడతాడు. ఇంతలో కేశవ్ అక్కడికి వచ్చి వాళ్ల పెదనాన్నతో గొడవపడతాడు. ఆడపెళ్లి వాళ్లు కేశవ్‌,మాదవ్‌ను తిట్టి వాళ్లు వెళ్లిపోతారు.    మహా పెళ్లి బట్టల కోసం అందరూ కలిసి షాంపింగ్‌మాల్‌కు  వెళతారు. మహాకు చీరలు చూస్తుంటారు. ఎన్ని చీరలు చూపించినా  మహా నచ్చలేదనే చెబతుంటుంది. ఇంతలో చక్రి అక్కడికి వస్తాడు. ఇంతలో హారిక ఆ చీరలను తీసుకుని అద్దం ముందుకు వెళ్లి నీ ఒంటిపై వేసుకుని ఏది బాగుంటుందో చూసుకోమని సలహా ఇస్తుంది. తాను అద్దం ముందుుక వెళ్లి చీరలు వేసుకుని చూసుకుని ఉంటుండగా...వెనక నుంచి చక్రి బాగాలేదని చెబుతూ ఉంటాడు. ఇంతలో చక్రి కూడా కొత్త చొక్కాలు వేసుకుని అవి బాగున్నాయో లేదో చూసి చెప్పాలంటూ  మహాను కోరడంతో  ఈరోజు ఏపిసోడ్‌ ముగిసిపోతుంది.

Continues below advertisement