Podharillu Serial Today Episode: పెద్ది, గాయత్రి పెళ్లిచేయాలంటే ఏం చేయాలన్న దానిపై మహాలక్ష్మీ చక్రి, కేశవ్‌,కన్నాతో మాట్లాడుతుంది. ఏం చేస్తేవాళ్ల పెళ్లి జరుగుతుందని అడుగుతుంది. ఏం చేసినా వాళ్ల పెళ్లికాదని చక్రి అంటాడు. మా అత్తను చంపేస్తే తప్ప...ఈ సమస్యకు పరిష్కారం దొరకదని అంటాడు. ఇప్పటికే మీనాన్నపై అపవాదు ఉందని...అది మీరు నెత్తిన వేసుకుంటారా అని మందలిస్తుంది. అయితే మాపెద్దనాన్నను, అత్తయ్య, మామయ్యను కిడ్నాప్‌ చేసి దాచేద్దామని కన్నా సలహా ఇస్తాడు. దీంతో మహాలక్ష్మీ వాడికి ఒక్కటిస్తుంది. మీరు చేసిన పనులతో వీడు కూడా చెడిపోయాడని చక్రిని తిడుతుంది. మరి ఏం చేద్దామో నువ్వే చెప్పమని కేశవ్‌ అడుగుతాడు. మనం మర్యాదగా తాంబూలాలు తీసుకుని గాయత్రిని పెద్దికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వెళ్దామని అంటుంది.ఆ మాటాలు విన్న ముగ్గురు అన్నదమ్ములు నీకు మా అత్త గురించి తెలియదని...పోయిపోయి ఇలాంటి సలహా ఇచ్చావేంటని హేళన చేస్తారు. గాయత్రిని ఇచ్చి పెళ్లి చేయదుగాక....మనమీదే రివర్స్ కేసుపెట్టిస్తుందని ఇది వర్కవుట్‌ అవ్వదని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
 
జీవితాంతం మీ  అన్నదమ్ముల కోసం తన సుఖాన్ని కూడా పక్కనపెట్టి కష్టపడిన మీ అన్నయ్యను అలాగే వదిలేస్తారా అని మహాలక్ష్మీ అన్న మాటలు అన్నదమ్ములను ఆలోచనలో పడేస్తాయి. కనీసం ఆయన మనసుకు నచ్చిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయలేరా అని అనడంతో కేశవ్‌,చక్రి మహా చెప్పిందే కరెక్ట్‌ అనుకుంటారు. తెల్లారి మహా  అదే పనిగా ఆలోచిస్తుంటే....చక్రి వచ్చి అడుగుతాడు. ఏం చేద్దామని అంటే నువ్వు చెప్పినట్లే చేద్దామని అంటారు. ఉదయం వీరంతా కలిసి మాట్లాడుకుంటుండగా...మాధవ్‌ వచ్చి ఏం గూడుపుటానీ చేస్తున్నారని నిలదీస్తాడు.ఏం లేదని వాళ్లు అబద్ధం చెబుతారు. 
 
నాకు తెలియకుండా ఏదైనా చేశారంటే మీ సంగతి చూస్తానని తమ్ముళ్లను హెచ్చరించి పనికి వెళ్లిపోతాడు. పెద్ది వెళ్లిపోయిన తర్వాత..మహాలక్ష్మీ చక్రితో మనం అందరం చిన్నవాళ్లం కదా..వెళ్లి మీనాన్నను తోడు రమ్మని అడగమంటుంది. ఆయన వస్తే పెళ్లి సంబంధం కుదరడం కాదని...చెడిపోతుందని అంటారు.అయినా సరే పెద్దమనిషి తరహాలో మనపక్కన ఒకరు ఉండాలని అనడంతో అంతా కలిసి నారాయణ దగ్గరకు వెళ్తారు.
 
ఏంటి అంతా కట్టకట్టుకుని ఇలా వచ్చారని అడగ్గా....గాయత్రిని పెద్దికి  ఇవ్వమని అడగడానికి వాళ్ల ఇంటికి వెళ్దామనుకుంటున్నామని మీరు రావాలని అంటుంది.దీంతో నారాయణ మహాపై కోప్పడతాడు. ఆ ఇంటిసంగతి ఈ అమ్మాయికి అయితే తెలియదు కానీ...మీకు తెలుసుకు కదరా అని కొడుకులపైనా మండిపడతాడు.అక్కడికి వెళ్లి అవమానాలు పడటం తప్ప...ఇంకేమీ ఉండదని అంటాడు.వాళ్లు పిలిచినా రానంటే రానని చెప్పి వెళ్లిపోతాడు.
    
చక్రి, కేశవ్‌,కన్నాను తీసుకుని మహాలక్ష్మీ తాంబూళాలతో  గాయత్రి ఇంటికి వెళ్తుంది.వీళ్లను చూసిన వాళ్ల పెద్దనాన్న ఇంట్లోకి పరుగుత్తుకుని వెళ్లి వాళ్ల చెల్లెలు, బావను పిలుచుకుని వస్తాడు. ఎందుకు వచ్చారని తాయరు నిలదీయగా...మా పెద్ది, మీ అమ్మాయి చిన్నప్పటి నుంంచి ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోలని కూడా అనుకున్నారని అందుకే పిల్లను అడగడానికి వచ్చామని చెబుతారు. నీకు అంటే  తెలియక బోల్తాపడ్డావని...నేను మాత్రం చస్తే నా బిడ్డను ఆ ఇంటికి పంపనని తాయరు చెబుతుంది. 
 
మాధవ్‌ గొప్పతనం గురించి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగా...తాయర్ తాంబూలం పళ్లేలను నేలకోసి కొడుతుంది. గాయత్రి తండ్రి కేశవ్‌ను కొట్టడానికి రాగా...చక్రి వెళ్లి వాళ్ల మామయ్య గొంతుపట్టుకుని అడ్డుకుంటాడు. అందరూ కలిసి విడిపించుకుని అక్కడి నుంచి తీసుకెళ్తారు.ఇదంతా చూసిన గాయత్రి ఎంతో బాధపడుతుంది.