Podharillu Serial Today Episode:గాయత్రి గురించి ఆలోచించి ఏడుస్తూ ఎప్పటికో మాధవ్ నిద్రపోతాడు.పొద్దున్నే లేచిన మహాలక్ష్మీ పెద్దిని నిద్రలేపకుండా అతనికి కాఫీ ఇవ్వడానికి వంటగదిలోకి వెళ్తుంది. కాఫీ కలపబోయి పాలన్నీ కిందపారబోయడంటో ఆ శబ్ధానికి మాధవ్ నిద్రలేస్తాడు. ఇవన్నీ నీకు ఎందుకమ్మా నేనే చూసుకుంటాను కదా అని అంటాడు.మీరు పడుకున్నారు కదా అందుకే మీకు కాఫీ కలిపి ఇద్దామని వచ్చానని అంటుంది. నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదని చెబుతాడు. నిన్న నీదగ్గర చిన్నపిల్లాడిలా ఏడ్చానని నీకు ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదని మాధవ్ అంటాడు. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెబుతాడు.అలాంటిదేమీ వద్దని మహా అంటుంది. మీరు మీ తమ్ముళ్ల దగ్గర మీబాధను బయటపెట్టలేరుకదా అందుకే నా దగ్గర బయటపడిపోయారని అంటుంది.నేనేమీ పరాయిదాన్ని కాదుకదా అని అంటుంది. ఏదీ ఏమైనా మీ గుండెల్లో బరువు మొత్తం దించుకన్నారని చెబుతుంది. పనిలోఉంటేనే పెద్ది అన్ని విషయాలు మర్చిపోతాడని భావించి అతన్ని ఖాళీగా ఉంచకుండా చూడాలనుకుంటుంది. తనకు ఉప్మా తినాలనిపిస్తుందని చేసి పెడతారా అని అడుగుతుంది. చిటికెలో చేసి పెడతానని అంటాడు. ఉప్మాపేరు చెబితే కన్నా, చక్రి పారిపోతారని అందుకే చేయడంలేదని....నీకోసం ఇప్పుడు చేస్తానని చెప్పి వెంటనే ఉప్మా చేసిపెడతాడు. కారు డ్రైవింగ్‌కోసం బయటకు వెళ్లిన చక్రికి మహా ఫోన్ చేస్తుంది.నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదని అనడంతో....నిజంగా తనపై ప్రేమపుట్టుకొచ్చిందేమోనని చక్రి ఆనందపడిపోతాడు.తనకోసం ఇన్ని చేస్తున్న తనపై ఇష్టం పెరిగిందేమోనని సంతోషపడతాడు. కానీ మహా చెప్పింది విని ఉసూరుమంటాడు. పెద్దిచాలా బాధపడుతున్నాడని...నిన్న గాయత్రి పెళ్లి ఊరేగింపు చూసి తట్టుకోలేకపోయాడని అంటుంది.మనం మాత్రం ఏం చేస్తామని....మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని అంటాడు.పాపం గాయత్రి కూడా మాధవ్ అన్నయ్య కోసం ఇల్లు విడిచి వచ్చినప్పటికీ...అన్నయ్య అతి మంచితనమే ఈ పెళ్లికి అడ్డుపడిందని అంటాడు.కానీ చిన్నప్పటి నుంచి గాయత్రిపై ప్రేమ పెంచుకున్న పెద్ది తట్టుకోలేకపోయాడని....నా దగ్గరకు వచ్చి ఎక్కిఎక్కి ఏడ్చాడని చెప్పగానే చక్రి కళ్లల్లో కూడా నీళ్లుతిరుగుతాయి. పెద్దిని ఎప్పుడూ అలా చూడలేదని.....గుండెల్లో ఎంత ప్రేమలేకపోతే..అంతలా ఏడుస్తాడని అంటుంది.ఎందుకో ఇదంతా నీకు చెప్పాలని అనిపించిందని అంటుంది. రాత్రికి ఇంటికి వచ్చేప్పుడు కేశవ్‌ను కారులో ఎక్కించుకుని వస్తాడు చక్రి..అన్నయ్య చాలా బాధపడ్డాడంటా అని చెబుతాడు. ఇకపై మనమిద్దరం అస్సలు కొట్టుకోవద్దని అనుకుంటారు.ఇంటికి వచ్చేప్పుడు చక్రి బిర్యానీ తీసుకునిరాగా....అందరూ కలిసి తింటారు. ఆతర్వాత మాధవ్‌ను నవ్వించేందుకు కన్నా ఆడవేషం వేసుకుని వచ్చి డ్యాన్స్‌చేయడంతో ఇంట్లో సందడి వాతావారణం నెలకొంటుంది. రోడ్డుమీద కష్టమర్ బైక్ చెడిపోతే కేశవ్ రిపేర్ చేస్తుండగా...అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ల పెద్దనాన్న కేశవ్‌కు కోపం వచ్చేలా మాట్లాడతాడు.మా గాయత్రి పెళ్లి అంగరంగ వైభవంగా చేశామని టీ కొట్టువాడికి చెబుతాడు. కొందరు మా అమ్మాయి పెళ్లి ఆపాలని చూశారని రెచ్చగొడతాడు. మా గాయత్రి పెళ్లికన్నా ముందే మీ అన్న పెళ్లి చేస్తామని శపథాలు చేశారు కదరా ఏం జరిగిందని హేళనగా మాట్లాడతాడు. మీఇంటికి ఏ అమ్మాయి రావడం లేదా అని రెచ్చగొడతాడు. కేశవ్ పని ఆపేసి వాళ్ల పెద్దనాన్నను పక్కకు తీసుకెళ్లి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మానాన్న కొడితే మెడలు మాత్రమేపోయానని....నేను కొడితే ఒంట్లో ఏ పార్టు పనిచేయదని అంటాడు. మా అన్నయ్య మంచితనం వల్లే గాయత్రి పెళ్లి జరిగిందని...అత్తయ్య,మామ వచ్చి మా అన్నయ్య కాళ్లుపట్టుకుని బ్రతిమలాడితేనే ఈ పెళ్లి జరిగిందని చెబుతాడు. ఒక్క ఫోన్‌కాల్ గాయత్రి మొగుడికి కొడితే వీసా రాకుండానే విడాకులు ఇచ్చిపడేస్తాడని హెచ్చరిస్తాడు.ఇంకోసారి ఇలాంటి వేషాలువేస్తే తాటతీస్తానని చెప్పి వెళ్లిపోతాడు.
