Podharillu Serial Today Episode: తెల్లారితే పెళ్లి పెట్టుకుని మాధవ్‌కోసం ఇల్లు వదిలేసి వచ్చిన గాయత్రిపై వాళ్ల మామ ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నువ్వు ఇలా వచ్చినందుకే నా కొడుకులు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చిందని మండిపడతాడు. మర్యాదగా బయటకు వెళ్లిపొమ్మని ఆదేశిస్తాడు. నా కొడుకు జీవితంతో ఆటలాడుకోవద్దని హెచ్చరిస్తాడు. నీవల్లే వాడు జీవచ్ఛవంలా బతుకుతున్నాడని మండిపడతాడు.ఆ మాటలు విన్న గాయత్రి...తనకు ఆ పెళ్లిచేసుకోవడం ఇష్టంలేదని... తెల్లారితే తాను బావకు శాశ్వతంగా దూరం అవుతానని అది నేను తట్టుకోలేకే వచ్చేశానని చెబుతుంది. ఆ మాటలు విన్న చక్రి, కేశవ్ నిన్ను ఏమాత్రం నమ్మలేమని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
నీ మాటలు నమ్మి మా అన్నయ్యను పెళ్లికి ఒప్పించి తీసుకొస్తే...గుడిలో అందరి ముందు తాళిపట్టుకుని ఎదురుచూస్తూ పిచ్చివాడిని చేశావని అంటారు.ఇంకోసారి నీమాటలు నమ్మిమోసపోలేమని చెబుతారు. నీకు అసలు ధైర్యం లేదని మండిపతారు. దీంతో గాయత్రి ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి బ్రతిమలాడుతుంది. ఈసారి మా అమ్మానాన్న వచ్చినా నేను వెనకడుకు వేయనని చెబుతుంది.ఈసారి తెగించి ఇంట్లో నుంచి వచ్చేశానని చెబుతుంది. ఆరోజు మీ ఇంటికి వస్తే మాధవ్‌ను చేసుకోవడం ఇష్టంలేదని చెప్పావుకదా అని చక్రి, మహా నిలదీస్తారు. మా అమ్మ ఇంట్లో కత్తిపీట పీకమీద పెట్టుకుని బెదిరించిందని....మీరు గుమ్మం బయట జరిగిందే చూశారని..లోపల ఏం జరిగిందో మీకు తెలియదని అంటుంది.నా సుఖం కోసం నేను గడపదాటి వచ్చేసి ఉంటే...పంతానికిపోయి మా అమ్మ పీక కోసుకుని ఉండేదని అంటుంది.అందుకే భయపడి మీకు అబద్ధం చెప్పానని అంటుంది. అంతమంది ముందు ఎదురుగా నీకు నచ్చిన నీ బావను పెట్టుకుని కూడా నువ్వు వేరే అబ్బాయి చేతికి ఉంగరం తొడిగావాంటే రేపు మళ్లీ మీ అమ్మానాన్నల కోసం మాట మార్చవని నమ్మకం ఏంటని మహాలక్ష్మీ నిలదీస్తుంది. ఇప్పుడు చీకటిలో బాగానే వచ్చావని...తెల్లారిన తర్వాత ఈ ధైర్యం ఉంటుందని ఎలా నమ్మగలమని అడుగుతుంది. నేను శాశ్వతంగా ఆ ఇల్లు వదిలేసి వచ్చేసినా అని చెబుతుంది.మా అమ్మానాన్న నిజంగా చనిపోయినా పట్టించుకోనని వేడుకుంటుంది.
మాధవ్ వద్దకు, ఆదినారాయణ వద్దకు వెళ్లి ప్రాధేయపడుతుంది. దయచేసి నన్ను తిరిగి వెనక్కి పంపించొద్దని...పెళ్లిచేసుకోవాలని కోరుతుంది. ఇంతగా ఇది వేడుకుంటుంటే మనం కాదనడం భావ్యం కాదని ఆదినారాయణ కోడలు చేతిని తీసుకుని వెళ్లి మాధవ్ చేతిలో పెడతాడు. ఈ ఇంటికి ఏ ఆడపిల్లరాదని శాపం పెట్టిన మీ అత్త కూతురిని నువ్వు ఇప్పుడే ఇక్కడే ఈఇంట్లోనే పెళ్లి చేసుకుని దాని శాపం ఫలించదని నిరూపించాలంటాడు. తెల్లారితే గాయత్రి లేదని తెలిసి మీ అత్తామామ గొడవ చేస్తారని....ఆలోగా పెళ్లి జరిగిపోవాలని అంటాడు. వెంటనే చక్రి లోపలికి వెళ్లి తాళిబొట్టు తీసుకుని వస్తాడు. కేశవ్, కన్నా వెళ్లి మాధవ్‌కు పట్టుబట్టలు కట్టించి తీసుకొస్తారు.అందిరి ముందు మాధవ్ తాళికట్టబోతుండగా తాయర్, పురుషోత్తం అక్కడికి వస్తారు.
నా కూతురుకి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లిచేసుకుంటారా అని అరుస్తారు. కూతురిని తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించగా గాయత్రి రానని తెగేసి చెబుతుంది.దీంతో షాక్ తిన్న పురుషోత్తం మాధవ్‌పై చేయిచేసుకునేందుకు వెళ్లగా...చక్రి,కేశవ్ అడ్డుకుని వాళ్ల మామను చితక్కొడతారు.మహా వాళ్లను ఆపి...ఇప్పుడు ఇక్కడ గొడవ చేయకుండా మీ పెద్దరికాన్ని కాపాడుకోమని చెబుతుంది.లేదంటే పోలీసులను పిలుస్తామని వాళ్లే వీళ్లిద్దరి పెళ్లి చేస్తారని హెచ్చరిస్తుంది.మీ ఆయన దుబాయ్ కూడా పోకుండా కేసుపెట్టిస్తామని చెబుతుంది. దీంతో చేసేదిలేక పురుషోత్తం మాధవ్‌ను పిలిచి మాట్లాడాలని గదిలోకి తీసుకెళ్తాడు.
అల్లుడి కాళ్లు పట్టుకుని బ్రతిమాలడతాడు. ఇప్పుడు దాని పెళ్లి ఆగిపోతే నలుగురిలో నేను తల ఎత్తుకుని బతకలేనని అంటాడు. తాయరు కూడా లోపలికి వచ్చి మాధవ్ కాళ్లమీద పడబోతుంది. నువ్వు చెబితే తప్ప అది రాదని...మాఇంటి పరువు కాపాడాలని వేడుకుంటుంది. లేదంటే మేమిద్దరం ఆత్మహత్య చేసుకోవడమే దిక్కని అంటుంది. గదిలో వీళ్లు మాట్లాడుతుండగా గాయత్రి బయట భయపడుతుంది. మావాళ్లు అందితే జుట్టు లేకపోతే కాళ్లుపట్టుకునే రకమని..మాధవ్ బావకు ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తారని అంటుంది.
