Podarillu Serial Today May 19th:ఇంటర్వూకు వెళ్లిన మహాను భూషణ్ ఎలా ఇబ్బందిపెట్టాడు..? మహా ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది...?
Podarillu Serial Today Episode May 19th: భూషణ్ ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వూకు వెళ్లిన మహాను అతను ఇబ్బంది పెడుతాడు. మహా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పొదరిల్లు సీరియల్ ఆసక్తికరంగా మారింది.

Podarillu Serial Today Episode: ఇంటర్వూ కోసం వచ్చిన మహాలక్ష్మీని ఫ్రెండ్ ఆఫీసులో చూసిన భూషణ్...ఆమె ఎందుకు వచ్చిందని రిసెప్షన్‌లో కనుక్కుంటాడు. ఇంటర్వూ కోసం వచ్చిందని చెప్పడంతో ఆనందపడిపోతాడు.వెంటనే లోపలికి వెళ్లి ఫ్రెండ్‌మీద మండిపడతాడు.ఈరోజు ఇంటర్వూలు ఉన్నాయన్న సంగతి నాకు చెప్పలేదని అడుగుతాడు.ఎందుకురా అంటే ఓ అమ్మాయిని అసలు ఇక్కడి వరకు రానివ్వకుండా ఉండేవాడిని కదా అని మండిపడతాడు. నువ్వు అంతగా ధ్వేషించే అమ్మాయి ఎవరురా అని అడగ్గా....మహాలక్ష్మీని చూపిస్తాడు.తనే నన్ను రిజెక్ట్ చేసి వెళ్లిందని చెబుతాడు. ఆ అమ్మాయి పెళ్లిచేసుకుని హాయిగా వేరుగా కాపురం చేసుకుంటుందని ఇప్పుడు ఈ పగలు,ప్రతీకారాలు అవసరమా అని భూషణ్‌తో అంటాడు.అయినా నిన్ను వద్దు అనుకుని వెళ్లిపోయిన దాని గురించి నీకు ఎందుకురా అని సలహా ఇస్తాడు.నేను కావాలనుకున్నది నాకు దక్కి తీరాలని భూషణ్ అంటాడు. నువ్వు రానురాను మరీ సైకోగాడిలా తయారవుతున్నావని ఫ్రెండ్ మండిపడతాడు. అయినా ఎవరి జీవితాలు వాళ్లు హాయిగా జీవిస్తున్నారు కదా ఇప్పుడు నీకు ఆ అమ్మాయితో ఎందుకురా అని అంటాడు.ఇప్పటికీ నాకు మహానే కావాలని భూషణ్ అంటాడు.ఇంటర్వూల సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పడంతో అతను వెళ్లిపోతాడు.
మహాను ఇబ్బందిపెట్టాలని అనుకున్న భూషణ్...ఆమెకన్నా ఇంటర్వూకు వెనక వచ్చిన వారందరినీ పిలిచి ఆమెను మాత్రం ఎదురుచూస్తేలా చేస్తాడు. దీంతో మహా రిసెప్షన్ దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నారని నిలదీస్తుంది.ముందు నన్ను పిలిచి నా తర్వాత వచ్చిన వారిని ఎందుకు పంపిస్తున్నారని అంటుంది.నాకు తెలియదు మేడం లోపలి నుంచి ఎవరిని పిలవమంటే వారిని పిలుస్తామని చెబుతుంది. చిరాకు వచ్చి చివరకు వెళ్లిపోదామనుకుంటుండగా ఆమెను లోపలికి రమ్మని పిలుస్తారు. లోపలికి వెళ్లిన మహాకు బిటెక్‌కు సంబంధించి ప్రశ్నలు కాకుండా ఎంటెక్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడంతో ఆమె అడుగుతుంది. జాబ్ కావాలంటే చేయాలని చెబుతారు. ఆమె వాటిని పూర్తిచేస్తుండగానే టైం అయిపోయిందని వెళ్లిపొమ్మంటారు. దీంతో మహా చాలా చిరాకుగా వెళ్లిపోతుంది.
మహా చాలా ఇబ్బందిగా ఉండటం చూసి చక్రి ఏం జరిగిందని అడుగుతాడు.ఈ ఇంటర్వూ మొత్తం ఏదో తేడాతేడా చేస్తున్నారని చెప్పి మహా బాధపడుతుంది.దీంతో చక్రి ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు.ఇంట్లో కూడా మహా చాలా బాధగా ఉండటం చూసి అందరూ ఫీలవుతారు. నువ్వు ఏం బాధపడొద్దని ఇది కాకపోతే ఇంకో మంచి ఉద్యోగం వస్తుందని మాధవ్ సర్దిచెబుతాడు. బీటెక్ క్వాలిఫికేషన్ అడిగి ఎంటెక్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగారని చెప్పి మహా బాధపడుతుంది. ఇంతలో కేశవ్‌కు సారీ చెప్పడానికి శైలూ ఫోన్ చేస్తుంటుంది.అసలే కోపంలో ఉన్న కేశవ్...శైలూను చెడామడా తిట్టేసి ఫోన్ పెట్టేస్తాడు.
తెల్లారిన తర్వాత మహాకు ఇంటర్వూకు వెళ్లిన కంపెనీ నుంచి మళ్లీ కాల్ వస్తుంది. మొదటిరౌండ్ పూర్తయ్యిందని రెండోరౌండ్ ఇంటర్వూకు రమ్మని పిలుపురావడంతో ఆమె ఎంతో సంతోషిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లు కూడా ఎంతో సంతోషిస్తారు. చక్రిని తోడుగా ఇచ్చి ఇంటర్వూకు పంపిస్తారు. కానీ ఈసారి భూషణ్ నేరుగా మహాను ఇంటర్వూ చేస్తాడు.కాకపోతే ముఖానికి మాస్క్ పెట్టుకుని వస్తాడు. 3 గంటల్లో చేయాల్సిన ప్రాజెక్ట్ ఇచ్చి అరగంటలో చేయమని చెబుతాడు. దీంతో మహా అలా ఎలా చేస్తామని నిలదీస్తుంది.అలాంటప్పుడు ఇంట్లో కూర్చుని వంట చేసుకోకుండా ఇలా జాబ్‌లు ఎందుకు మీకు అని హేళనగా మాట్లాడతాడు. ఇంతకు ముందు ఇలాగే మాట్లాడే పిచ్చోడిని చూశానని,.....మీరు సగం పిచ్చోడిలా ఉన్నారని చెప్పి చెడామడా తిట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















