అన్వేషించండి

Podarillu Serial Today June 4th:చక్రిని కిడ్నాప్‌ చేయించింది తండ్రి,అన్న అని తెలుసుకున్న మహా...ప్రతాప్‌కు మాధవ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌

Podarillu Serial Today Episode June 4th: తనను కిడ్నాప్‌ చేయించింది మహావాళ్ల నాన్న,అన్న అని నిరూపించిన చక్రి...ప్రతాప్‌కు మాధవ్‌ గట్టి వార్నింగ్‌

Podarillu Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఏపీసోడ్ చాలా ఆసక్తిగా సాగింది. తనను కిడ్నాప్‌ చేయించింది మహావాళ్ల  నాన్న,అన్న అని ఆధారాలతో సహా చక్రి నిరూపించడంతో వాళ్లను ఛీకొట్టి మహా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఇంకోసారి మా ఇంటిజోలికి వస్తే మీ అందరికీ సమాధులు కట్టేస్తానని మాధవ్‌ వార్నింగ్‌తో ఇవాల్టి పొదరిల్లు ఏపిసోడ్ అదరహా అనిపిస్తుంది.

నిజం బయటపెట్టిన చక్రి

కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చిన చక్రిని చూసి మహాలక్ష్మీ చాలా కంగారుపడుతుంది. ఒంటిపై  ఉన్న దెబ్బలు చూసి ఎలా జరిగిందని అడుగుతుంది.అసలు ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని అంటుంది. చక్రి కోసం మహా కంగారుపడుతుంటే...ఆది మాత్రం డబ్బులు,నగలు ఎక్కడరా అంటూ నిలదీస్తాడు. అసలు మీకు మానవత్వం ఉందా మనిషికి ఇన్ని దెబ్బలు తగిలితే మీరు  డబ్బు గురించిఅడుగుతున్నారేంటని మహా అంటుంది. డబ్బు,నగలు కోసం వీడే ఏదో ఎత్తులు వేస్తున్నాడని ఆది అంటాడు. అలాంటి అవసరం వాళ్లకు లేదని మహా గట్టిగా బదులిస్తుంది.అసలు ఏం జరిగిందని మహా అడగ్గా...డబ్బు,నగలతో తాను వెళ్తుంటే ఓ అమ్మాయి కారుకిందపడి నన్ను ఆపి కిడ్నాప్ చేయించిందని చెబుతాడు.ఆ తర్వాత కొట్టారని  అంటాడు. 

మహాలక్ష్మీ ఇంట్లోకి మాధవ్‌

డబ్బులు మొత్తం కాజేసి సినిమా కథ చెబుతున్నావా అని ఆది అనగా...మీకు ఆధారాలు లేకపోతే నమ్మరని నాకు తెలుసు బామ్మార్ది అని చక్రి అంటాడు.చక్రి పిలవగానే మాధవ్‌, కన్నా కూడా లోపలికి వస్తారు. ఇలాళ మా అన్నాదమ్ములు రాకపోతే నా శవం కూడా దొరికేదికాదని చక్రి అంటాడు. వీళ్లే రౌడీల నుంచి నన్ను కాపాడారని చెబుతాడు.అన్నదమ్ములంతా కలిసి కాకమ్మ కబుర్లు చెబుతున్నారా అని ఆది అనగా....ఏ మనిషి గురించి ఏం మాట్లాడుతున్నావురా అని మహాలక్ష్మీ వాళ్ల అన్నయ్యను తిడుతుంది.అసలు వీళ్లు చెప్పింది ఎలా నమ్ముతామని అనగా...నాకు తెలుసురా మీరు ఇలా అడుగుతారని చక్రి అంటాడు. అందుకే రుజువులతో సహా వచ్చానని చెప్పి కేశవ్‌ను పిలవగానే...రౌడీని తీసుకుని లోపలికి వస్తాడు. వాళ్లను చూడగానే ప్రతాప్‌,ఆది ముఖం మాడిపోతుంది. ఇప్పుడు చెప్పండ్రా అని చక్రి అంటాడు.

మరింత మంది సీరియల్ నటులు గురించి ఇక్కడ తెలుసుకోండి

1 నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా..
2 గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇంటి పెద్ద సత్యం అసలు పేరు
3 బుల్లితెరపై రాణిస్తున్న అన్షురెడ్డి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
4 గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్ గ్రౌండ్ తెలుసా!
5 ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి.. కలవారి కోడలు 'కనకమహాలక్ష్మి' రియల్ లైఫ్ విషయాలు

బయటపడిపోయిన నిజం

ప్రతాప్‌ కలుగజేసుకుని వీళ్లేనా అల్లుడుగారు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది.నేను వీళ్ల సంగతి చూసుకుంటానని అంటాడు. ఇక మీ ఉత్తమనటన ఆపితే నిజాలు మాట్లాడుకుందాం మామయ్యగారు అని అంటాడు. వీళ్లను పంపించింది మీరేనని తెలుసు,నన్ను కిడ్నాప్ చేయించి కొట్టించింది కూడా మీరేనని ఆల్రెడీ వాళ్లు చెప్పేశారని చెబుతాడు.ఆ మాటలు విన్న మహాలక్ష్మీ షాక్‌ తింటుంది.మానాన్న కిడ్నాప్ చేయించడమేంటని అంటుంది. కూతురు కోసం నాలుగు మెట్లు దిగివస్తే నిజంగా ప్రేమ ఉందేమో అనుకున్నామని..కానీ మరీ మీరు పంతం కోసం ఇంతలా దిగజారుతారని అనుకోలేదని మాధవ్ ప్రతాప్‌తో అంటాడు. ఇంతలో లలిత రెచ్చిపోయి ఎవరి ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారని మండిపడుతుంది.మర్యాదగా బయటకు పొమ్మని అంటుంది. చక్రి కల్పించుకుని మీ నటనకు జాతీయ అవార్డు వస్తుంది కానీ...కాస్త తగ్గండని అంటాడు. ఈ కుట్రలో మీకు కూడా పాత్ర ఉందని మాకు తెలుసని అంటాడు. మహావాళ్ల అన్నయ్యను కొట్టి మీరు ఇంత నీచుల్లా మారతారని అనుకోలేదని ఏడుస్తుంది. అప్పటికీ చక్రి వెళ్లనంటే నేనే పంపించానని అంటుంది. ఇదంతా వీళ్లు ఆడుతున్న నాటకమని ప్రతాప్‌ అంటాడు. నిన్ను మా నుంచి దూరం చేయడానికి వేస్తున్న ఎత్తులని చెబుతాడు..

ఆధారాలు చూపించిన చక్రి

అప్పుడు చక్రి నిజం చెప్పేస్తాడు.అసలు మీ నాన్న మన ఇంటికి వచ్చిందే నాపై ఛాలెంజ్‌ చేసి అని అంటాడు.లేకుంటే మన ఇంటి గడప కూడా తొక్కేవాడు కాదని అంటాడు. కావాలంటే ఆ రోజు నేను రికార్డుచేసిన ఆడియో వినమని వినిపిస్తాడు. నాపై ఛాలెంజ్‌ చేసి నిన్ను ఈఇంటికి తీసుకొచ్చి మనఇద్దిరినీ విడీదీసి ఆ జుట్టుపోలిగాడికి  ఇచ్చి పెళ్లిచేయడమే వీళ్ల ప్లాన్‌  అని చెబుతాడు. అందుకే నాకు డబ్బులు ఇచ్చి పంపించి కిడ్నాప్ చేయించారని వివరిస్తాడు. నన్ను చంపేస్తే నువ్వు జీవితాంతం ఆ డబ్బులు నేనే కొట్టేశానని అనుకోవాలని అంటాడు. దీంతో మహాలక్ష్మీ వాళ్లను ఛీకొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది.జీవితంలో మళ్లీ మీ గుమ్మం తొక్కనని అంటుంది. ఇంకోసారి మా అన్నదమ్ముల జోలికి వస్తే మీ తండ్రీకొడుకులకు సమాధి కడతానని మాధవ్‌ ప్రతాప్‌కు వార్నింగ్ ఇస్తాడు...

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gundenininda Gudigantalu Serial Today June 18: ప్రభావతికి బాలు వార్నింగ్, చింతామణి ప్లాన్ ఫ్లాప్, రవికి షాక్ ఇచ్చిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
ప్రభావతికి బాలు వార్నింగ్, చింతామణి ప్లాన్ ఫ్లాప్, రవికి షాక్ ఇచ్చిన శ్రుతి - గుండెనిండా గుడిగంటలు జూన్ 18 ఎపిసోడ్
Nindu Manasulu Serial Today June 18th: నిండు మనసులు: గాడిద పంచాయితీలో.. పరువు పోగొట్టుకున్న గణ! ఏమాటకి ఆ మాట అదిరిపోయిన ఆర్ట్!
నిండు మనసులు: గాడిద పంచాయితీలో.. పరువు పోగొట్టుకున్న గణ! ఏమాటకి ఆ మాట అదిరిపోయిన ఆర్ట్!
Nuvvu leka Neanu Lenu Serial Today June 18th:నిజం తెలుసుకుని విక్కీని మరింత ప్రేమించిన రాద...నేషనల్ హస్పెండ్‌ డేకు రాధ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటి..?
నువ్వులేక నేను లేను: నిజం తెలుసుకుని విక్కీని మరింత ప్రేమించిన రాద...నేషనల్ హస్పెండ్‌ డేకు రాధ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటి..?
Podarillu Serial Today June 18th:మహా ఆఫీసుకు వెళ్లడానికి స్కూటీ కొనిచ్చిన చక్రి..ఆమెకు బండి నేర్పిస్తూ కిందపడేసిన చక్రి
పొదరిల్లు: మహా ఆఫీసుకు వెళ్లడానికి స్కూటీ కొనిచ్చిన చక్రి..ఆమెకు బండి నేర్పిస్తూ కిందపడేసిన చక్రి
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
Deewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
Kavya Sri Natraj: గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
Embed widget