Podarillu Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఏపీసోడ్ చాలా ఆసక్తిగా మారుతుంది. కిడ్నాపర్ల గ్యాంగ్‌లోఉన్న అమ్మాయిని మాటలతో బురిడీ కొట్టించి ఫోన్ సంపాధించిన చక్రి...మాధవ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వాళ్లు అక్కడికి వెళ్లి చక్రిని  విడిపిస్తారు. కిడ్నాపర్ల చెరలో ఉండాల్సిన చక్రి నట్టింట్లో ఉండటంతో ప్రతాప్‌ షాక్‌ తింటాడు. ఇంకోసారి నా తమ్ముడికి ఏమైనా జరిగిందంటే  ప్రాణాలు తీస్తానని మాధవ్‌ ప్రతాప్‌కు వార్నింగ్‌ ఇవ్వడంతో ఈరోజు ఏపిసోడ్‌ రసవత్తరంగా మారుతుంది.

Continues below advertisement

జిత్తులమారి చక్రి ఎత్తులు  చక్రి ప్రమాదంలో  ఉన్నాడని తెలుసుకున్న అన్నదమ్ములతోపాటు తండ్రి ఎంతో కంగారుపడతారు.ఇదంతా వాడి మామ ప్రతాప్‌ పనేనని ఆదినారాయణ మండిపడతాడు.ఇంకా ఆలోచించడ దేనికి వెళ్లి వాడిని నిలదీస్తే  చక్రి ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుందని అంటాడు. నిజాలు తెలియకుండా మనం తొందరపడితే మహాలక్ష్మీ నొచ్చుకుంటుందని మాధవ్‌ ఆపుతాడు.అసలు చక్రికి వా‌ళ్లే అపాయం తలపెట్టారని  మనం ఎలా రుజువు  చేయగలమని అంటాడు.అందుకే మేం వెళ్లి చక్రిని వెతికి పట్టుకొస్తామని బయలుదేరతారు. 

  కిడ్నాపర్ల గ్యాంగ్‌లో ఉన్న అమ్మాయిపై చక్రి కన్నేస్తాడు. దీన్ని లైన్‌లో పెడితే మనకు వర్కవుట్ అవుతుందని అనుకుంటాడు.ఆ అమ్మాయిని పిలిచి మాటలతో బురిడీ కొట్టిస్తాడు.ఎంతో అందంగా ఉండి ఈ గ్యాంగ్‌లోపనిచేయడం ఏంటని అంటాడు.అసలు నువ్వు కాస్త జుట్టు వదులు చేసుకుని మంచిగా రెడీ అయితే నీ ముందు ఎవరైనా దిగదుడుపేనని అంటాడు.దీంతో మెలికలు తిరిగిపోయిన అమ్మాయి.....అద్దంలోచూసుకోవడానికి వెళ్లిపోతుంది. వెంటనే ఆమె ఫోన్ తీసుకుని చక్రి మాధవ్‌కు కాల్‌చేసి చెబుతాడు.తనను ఓ గదిలో బంధించారని....లొకేషన్ ఎక్కడో తెలియడం లేదని చెబుతాడు. ఇంతలో  రౌడీలు రావడంతో ఫోన్ విసిరేస్తాడు. వీడు ఎవరికో ఫోన్ చేశాడని తెలుసుకున్న రౌడీలు విషయం ఆదికి చెబుతారు. వెంటనే వాడిని మా గెస్ట్‌హౌస్‌కు షిప్ట్‌ చేయమని చెబుతాడు. దీంతో రౌడీలు చక్రిని గెస్ట్‌హౌస్‌కు షిప్టు చేసేందుకు తీసుకుని వెళ్తారు.

Continues below advertisement

Also Read: Anumita Dutta: గోదావరి సీరియల్ హీరోయిన్ జాను.. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలుసా!

మహాకు ప్రతాప్ మాయమాటలు  చక్రిని వెతికి పట్టుకుని వస్తామని వెళ్లిన ప్రతాప్‌, ఆది ఉత్త చేతులతో తిరిగిరావడం చూసి మహా కంగారుపడుతుంది. ఏం జరిగిందని అడుగుతుంది. ఆది చెప్పిందే నిజమైందని ఆ కేటుగాడు డబ్బులు తీసుకుని పరారయ్యాడని ప్రతాప్‌ దీనంగా చెబుతాడు. మీరు అలా ఎలా చెప్పగలరని మహా అడిగితే...మరి ఇంతవరకు ఫోన్ చేయలేదు. చెప్పిన చోటుకి వెళ్లలేదంటే అర్థమేంటని ప్రతాప్ అంటాడు. అలా ఎలా అనుకుంటారు మామయ్య...చక్రికి ఏదైనా అపాయం కూడా జరిగి ఉండొచ్చు కదా అని నిహారిక అంటుంది.

వంటింట్లో కూర్చుని మీరు పెద్ద సీఐడీల్లా మాట్లాడకండని ఆది ఆమెపై మండిపడతాడు. జరిగిందేదో జరిగిపోయిందని....ఇక ఆ దొంగతో నీకు శాశ్వతంగా విడాకులు ఇప్పించి మళ్లీ ఘనంగా పెళ్లి చేస్తానని ప్రతాప్‌ అంటాడు. ఆ మాటలతో మహాకు చిరాకు వేస్తుంది. భూషణ్‌ కూడా ఇండియాలోనే ఉన్నాడని ఆది చెప్పడంతో మీరు ఏం మాట్లాడుతున్నారండీ అని నిహారిక వారిస్తుంది.ఇప్పుడు వాడి గురించి ఎందుకులేరా ముందు మహాకు ఆ దొంగతో తెగదెంపులు చేస్తే చాలని ప్రతాప్ అంటాడు.దీంతో మహా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Also Read:నిండు మనసులు ప్రేరణ నటనకు తెలుగువాళ్లు ఫిదా.. పవిత్ర నాయక్ కెరీర్, రెమ్యూనిరేషన్ విషయాలివే!

చక్రిని కాపాడిన అన్నదమ్ములు  చక్రిని కారులో తీసుకెళ్తుండగా చూసిన మాధవ్‌, కేశవ్‌, కన్నా వెంటపడి ఆ కారును అడ్డగిస్తారు. అందులో ఉన్న రౌడీలను తుక్కుతుక్కుగా కొట్టిపడేస్తారు. వాళ్లందరినీ చితికబాది చక్రిని వారి నుంచి కాపాడి తీసుకొస్తారు.ఉదయం నట్టింట్లో పేపర్‌ చదువుతున్న చక్రిని చూసి ఇంట్లో వాళ్లంతా షాక్‌ తింటారు.ఆ దెబ్బలు ఏంటని మహా చక్రిని అడుగుతుంది. మా డబ్బు, నగలు ఏమయ్యాయని ఆది ప్రశ్నిస్తాడు. ఇంతలో మాధవ్‌ అక్కడికి వచ్చి ప్రతాప్‌కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.