Podarillu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఏపీసోడ్ ఆసక్తిగా సాగుతుంది. కారులో ఇంటికొస్తున్న చక్రి మధ్యలో బైక్‌ను ఢీకొట్టడంతో స్టేషన్‌కు తీసుకెళ్తారు. మాధవ్‌, కేశవ్‌, మహా  అక్కడికి వెళ్లి 50వేలు కట్టి చక్రిని విడిపిస్తారు.స్టేషన్‌లో పొగరుగా మాట్లాడుతున్న చక్రిపై ఎస్‌ఐ చేయిచేసుకుంటాడు. లైసెన్స్‌ లాక్కుని నెలరోజుల తర్వాత ఇస్తానంటాడు. కోపంతో ఇంటికి వచ్చిన చక్రి తన డబ్బులతో ఎవరు విడిపించమన్నారని ఇంట్లో గొడవ పెట్టుకోవడంతో ఇవాల్టి ఏపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.

Continues below advertisement

పోలీసుస్టేషన్‌కు వెళ్లిన చక్రి                       మహాలక్ష్మీ తిట్టడంతో ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయిన చక్రి...రాత్రంతా రోడ్డుపైనే కారులో నిద్రపోతాడు. ఉదయమే అలకవీడి ఇంటికి చేరండని మహా గట్టిగా క్లాస్‌పీకడంతో చక్రి కారులో ఇంటికి బయలుదేరతాడు.మార్గమధ్యలో ఓ బైక్‌ వాడిని ఢీకొడతాడు. దీంతో కారు దిగి ఇద్దరూ గొడవపడతారు. చుట్టుపక్కల వారు వచ్చి సారీ చెప్పమంటే నేను చెప్పనంటే చెప్పనని....అతనే రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొట్టాడని దబాయిస్తాడు. బైక్‌పై వెళ్తున్న వాడినికి గుద్దిందే కాకుండా దబాయిస్తావా అంటూ అందరూ చక్రిపై మండిపడతారు. దీంతో బైక్‌పై వెళ్తున్నవాడు  పోలీసులకు ఫోన్ చేయగా....వాళ్లు వచ్చి చక్రిని స్టేషన్‌కు తీసుకెళ్తారు.

తన కోపమే తనకు శత్రువు                       చక్రి ఇంకా ఇంటికి రాలేదేంటని ఇంట్లో వాళ్లంతా ఎదురుచూస్తుండగా...అప్పుడే చక్రి మాధవ్‌కు ఫోన్ చేస్తాడు.తాను స్టేషన్‌లో ఉన్నానని వెంటనే రమ్మని కబురు చేస్తాడు. ఏమైందని అడగ్గా....చిన్న యాక్సిడెంట్  జరిగిందని చెబుతాడు. దీంతో మాధవ్‌ సహా ఇంట్లో వాళ్లంతా కంగారుపడతారు. కేశవ్‌ చక్రి పర్సులో ఉన్న డబ్బులు, తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని బయలుదేరతాడు. మహాలక్ష్మీ, కన్నాను ఇంట్లోనే  ఉండమన్నా....మహా నేను కూడా వస్తానంటూ బయలుదేరుతుంది. అందరూ కలిసి స్టేషన్‌కు వెళ్తారు. మీవాడు బైక్‌పై వెళ్తున్న ఇతన్ని గుద్దేశాడని చెప్పగా...వాడే రాంగ్‌రూట్‌లో వచ్చాడని చక్రిగా గట్టిగా మాట్లాడతాడు.దీంతో ఎస్‌ఐకి కోపం వచ్చి వీడిని తీసుకెళ్లి సెల్‌లో పడేయమని కానిస్టేబుల్‌కు చెబుతాడు. కేసు పెడుతున్నామని....ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోమని చెబుతాడు.

Continues below advertisement

ఇంతలో కారు ఓనర్‌ ఓంకారేశ్వర్‌ వచ్చి  ఎస్‌ఐని బ్రతిమలాడతాడు. దీంతో సెటిల్‌మెంట్ చేసుకోమని ఎస్‌ఐ  చెబుతాడు. 50వేలు ఇస్తేగానీ కేసు వాపస్‌ తీసుకోనని చెప్పడంతో దీనికి మాధవ్‌ సరేనంటాడు. ఇప్పుడు కేసులనీ కోర్టుల చుట్టూ తిరిగితే చక్రి జీవితం పాడైపోతుందని...కావాలంటే డబ్బులు కట్టేద్దామని చెబుతాడు.దీనికి ఓంకారేశ్వర్‌ సెటిల్‌మెంట్‌కు సరేనంటాడు. ఇంతలో చక్రిని సెల్‌ నుంచి బయటకు తీసుకురాగా...చొక్కా గుండీలు విప్పుకుని రౌడీలా ఎస్‌ఐ వైపు కోపంగా చూస్తుంటాడు.ఇకనైనా బుద్దిగా  చూసి డ్రైవింగ్ చేసుకోమని ఎస్‌ఐ చక్రిని హెచ్చరిస్తాడు.ఈ రాస్కెల్‌ తప్పు చేస్తే మీరు నన్ను ఎందుకు ఇబ్బందిపెడుతున్నారని చక్రి గట్టిగా వాదిస్తాడు. దీంతో ఎస్‌ఐకి కోపం వచ్చి అందరి ముందు చక్రిపై చేయిచేసుకుంటాడు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుని నెలరోజుల తర్వాత వచ్చి కనపడమని చెబుతాడు. అప్పటి వరకు నువ్వు కారు తోలడానికి వీళ్లేదని అంటాడు. అప్పుడు గానీ నీ పొగరు అనగదని చెప్పడంతో డబ్బులు కట్టి చక్రిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు.

కేశవ్‌పై గొడవ పెట్టుకున్న చక్రి   ఇంటికి వచ్చిన తర్వాత అందరిపై చక్రి అరుస్తాడు. నా తప్పు లేకపోయినా డబ్బులు ఎందుకు కట్టారని మండిపడతాడు. చక్రి కోపంగా ఉన్నాడని మాధవ్‌ ఎవరూ వాడిని ఏం అనొద్దని చెప్పి బయటకు వెళ్తాడు.ఇంతలో ఇంట్లోకి వెళ్లి పర్సులో డబ్బులు లేకపోవడం చూసి వచ్చి కేశవ్‌ను నిలదీస్తాడు. ఆ డబ్బులతోనే నిన్ను బయటకు తీసుకొచ్చామని చెప్పడంతో చక్రి  కేశవ్‌ను కొడతాడు. అసలు నా డబ్బులు ఎందుకు తీసుకున్నారని నిలదీస్తాడు. దీంతో డబ్బుల కోసం ఇద్దరూ మళ్లీ గొడవపడుతుంటారు. ఇద్దరూ కొట్టుకోవడంతో మహాలక్ష్మీ వచ్చి గట్టిగా అరిచి ఆపుతుంది.