Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథున పక్కనే కూర్చొని మిథునకు దుప్పటి కప్పి వెళ్తుంటే మిథున లేచి దేవా చేయి పట్టుకుంటుంది. మనసులో ఎవరికీ చెప్పుకోలేని అంత బాధ ఉంటేనే కన్నీరు వస్తాయి. నీ మనసులో కూడా అలాంటి బాధ ఉందని నాకు అర్థమైంది చెప్పు దేవా ఆ బాధ ఏంటి.. ఏం జరగకపోతే ఏదో పెద్ద విషయం జరగకపోతే నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా ఉండవు.. ఏం జరిగిందో నాకు తెలియకపోతే ఎలా అని ఏం జరిగిందో అడుగుతుంది. 

దేవా ఏం జరగలేదు అని తలూపుతాడు. అలా తలూపడం కాదు నా కళ్లలోకి చూసి ఏం జరిగిందో చెప్పు.. హాస్పిటల్‌ నుంచి వచ్చినప్పటి నుంచి నరకం చూస్తున్నా నీ మౌనానికి కారణం ఏంటో చెప్పు అని చాలా ప్రాధేయపడుతుంది. దేవా ఏం చెప్పకుండా మిథున చేయి విడిపించుకొని వెళ్లిపోతాడు.  మిథున చాలా ఏడుస్తుంది. దేవా కూడా ఏడుస్తాడు. ఉదయం మిథున అత్తాతోటికోడళ్లతో గుడికి వస్తుంది. దేవా ఏదో పెద్ద బాధని బాధ పడుతున్నాడని దేవాకి ఏం జరిగిందో తెలియాలని మా బంధం బాగుండాలని కోరుకుంటుంది. 

శారద, ప్రమోదిని, కాంతం పంతులుతో మిథునకు అడుగడుగునా ప్రమాదాలు జరుగుతున్నాయని ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే పెళ్లి, నల్లపూసల తంతు మంచిగా జరిగాయి కానీ మెట్టెల తంతు జరగలేదని అందుకే ఇవన్నీ వస్తున్నాయని ముందు ఆ తంతు జరిపించమని పంతులు చెప్తారు. మిథున అత్తతో నా పెళ్లికి సంబంధించిన ఒక్క తంతు కూడా మన రెండు ఫ్యామిలీల సమక్షంలో జరగలేదు ఈ మెట్టెల తంతు జరగబోతుందని  చెప్తుంది. 

దేవా కొంతమంది రౌడీల దగ్గరకు వెళ్తాడు. గురుదీప్ ఎక్కడున్నాడు..మీరే వాడికి బులెట్స్ అమ్మారని తెలిసింది వాడు ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతాడు. వాడు అడ్రస్ పర్మినెంట్‌గా ఒక చోట ఉండదు అని వాడు ఫోన్ చేస్తే చెప్తామని అంటారు.  ఫొటో డిటైల్స్ దేవాకి ఇస్తారు. శారద వియ్యపురాలు లలితకి కాల్ చేసి మెట్ల తంతు గురించి చెప్తుంది. రేపే తంతు కదా ఒక సారి జడ్జిగారికి చెప్పమని అంటుంది. 

మిథున అత్తతో నాకు ఏం జరుగుతుందని మీరు బాధ పడకండి నాకు ఆయన రక్షణ కోట. నా గురించి మీరు అస్సలు భయపడకండి అని చెప్తుంది. ఇక దేవా గురుదీప్ ఫొటోతో అతన్ని వెతుకుతూ ఉంటాడు. ఓ చోట వాడు టీ తాగుతుంటే చూస్తాడు. వాడిని పట్టుకుంటే పారిపోతాడు. దేవా వెనకాలే పరుగులు పెడతాడు. ఆదిత్యకి కాల్ చేసి దేవా వెంటపడుతున్న విషయం చెప్తాడు. దేవాకి దొరికిపోయాను వచ్చి కాపాడు అని అంటాడు. 

ఆదిత్య చాలా భయపడతాడు. దేవాకి నేను దొరికిపోయాను అని అనుకుంటాడు.  మిథునని దేవా అవాయిడ్ చేయడం వెనక ఏదో జరిగింది అని కాంతం భర్తతో చెప్తే త్రిపుర రాహుల్‌కి చెప్తుంది. త్రిపురకు అడగాలి అని కాంతం కాల్ చేస్తే కాంతానికి అడగాలి అని త్రిపుర కాల్ చేస్తుంది. ఇద్దరూ ఒకరికి ఒకరు ఫోన్ చేసుకోవడంతో కాల్ బిజీ వస్తూనే ఉంటుంది. కాంతం త్రిపురతో దేవా మిథునతో మాట్లాడటం లేదని దూరం దూరంగా ఉంటున్నాడని చెప్తుంది. త్రిపుర మిథునని చూడటానికి కూడా దేవా రాలేదు అందుకే నీకు కాల్ చేశానని త్రిపుర అంటే ఇద్దరికీ విషయం తెలీదన్నమాట. ఇక నుంచి ఇద్దరం తెలుసుకుందామని అంటుంది కాంతం. దేవా షూటర్‌ని పట్టుకొని చితక్కొట్టి ఎందుకు నన్ను చంపాలి అనుకున్నావో చెప్పరా అని చితక్కొడతాడు. నిన్ను చంపాలని ఎవరు పంపిచారో చెప్పరా అని దేవా అడుగుతాడు. ఎవరు చంపారో చెప్పేలోపు ఆదిత్య వచ్చి చంపేస్తాడు. దేవా ఆదిత్యతో వాడు వాడి వెనక ఉన్న వాడి పేరు చెప్పే సరికి కాల్చేశావ్ అంతా పెంట పెంట చేసేశావ్ అని అంటాడు. మిథునని కాల్చింది వీడు అని తెలిశాక తట్టుకోలేక పోయా. అందుకే చంపేశా అని ఆదిత్య అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.