Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున ఆదిత్యను కలిసి దేవాని నువ్వే బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా అని నిలదీస్తుంది. ఆదిత్య మిథున నుంచి తప్పించుకోవడానికి హరివర్ధన్ గురించి చెప్పేస్తాడు. దేవా నిన్ను వదిలేసి దూరంగా ఉండటానికి మీ నాన్న కారణం అని చెప్పి హాస్పిటల్‌లో జరిగిందంతా చెప్పేస్తాడు. మిథున షాక్ అయిపోతుంది. 

దేవాని నా నుంచి దూరం చేయాలి అనుకున్నది మా నాన్నా అని మిథున అనుకొని తండ్రి దగ్గరకు బయల్దేరుతుంది. దేవా మిథునని తలచుకొని ఓ చోట కూర్చొని ఏడుస్తాడు. నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నరకం అనుభవిస్తున్నా.. మీ నాన్న నా దగ్గర మాట తీసుకోవడం తప్పు కాదు.. నువ్వు నా కోసం రెండు సార్లు చావు వరకు వెళ్లి వచ్చావ్.. నిన్ను నేను దేవతలా ఆరాధిస్తా కానీ ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు నరకం అనుభవిస్తున్నా.. నిజానికి నేను లేకుండా నువ్వు కాదు నువ్వు లేకుండా నేను ఉండలేను అని నీకు ఎలా చెప్పాలి మిథున అని ఏడుస్తాడు. మిథున పుట్టింటికి వెళ్లి తండ్రిని పిలుస్తుంది. 

మిథున: మా నాన్న ఏది ఉన్నా ముఖం మీదే చూపించేస్తారు అనుకున్నా.. మా నాన్నకి అబద్ధం చెప్పడం మోసం చేయడం తెలీదు అనుకున్నా కానీ మీరు కన్న కూతురికి కూడా అబద్ధం చెప్తారా.. నన్ను నమ్మిస్తూనే కుట్ర చేస్తారా.. కపటప్రేమ చూపిస్తూ మోసం చేస్తారా. లలిత: మిథున ఏమైందే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్.మిథున: అమ్మా ఇది నేను నాన్న తేల్చుకోవాల్సిన విషయం ఎవరూ జోక్యం చేసుకోవద్దు. చెప్పండి నాన్న ఎందుకు నన్ను దేవాని విడదీయడం కోసం కుట్ర చేశారు. హరివర్ధన్: నేనేం కుట్ర చేయలేదు.మిథున: మీరేం కుట్ర చేయలేదా.. నా కూతురి జీవితం నుంచి వెళ్లిపో అని ఎవరికీ తెలీకుండా దేవా దగ్గర మాట తీసుకోవడం కుట్ర కాదా. నువ్వు నా కూతురి జీవితంలో ఉంటే చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేయడం కుట్ర కాదా.. చెప్పండి నాన్న.. కుట్ర కాదా..హరివర్ధన్: కాదు.. నా కూతురి మీద ఉన్న ప్రేమ అది.. నువ్వు ప్రాణాలతో ఉండాలని కోరుకున్న ఓ సగటు తండ్రి ఆరాటం అది. నీ ప్రాణాల మీదకు రావడానికి కారణం ఎవరు దేవానే కదా.. అతను నీ జీవితంలో ఉంటే నీ ప్రాణాలు పోతాయి. అలాంటి వాడిని నీ జీవితం నుంచి వెళ్లిపోమని చెప్పడం కుట్ర ఎలా అవుతుంది. మిథున నా మాట విను నువ్వు ఇక్కడికి వచ్చేయ్ నీకు మేం సంతోషంగా చూసుకుంటా.. ఏ ప్రాబ్లమ్ రాదు..మిథున: నా మెడలో ఈ మూడు ముళ్లు పడ్డప్పుడే నిర్ణయించుకున్నా దేవా నా జీవితం అని మరి దేవాని నా నుంచి దూరం చేస్తే నేను ఎలా బతుకుతాను..హరివర్ధన్: నీకు ఎంత చెప్పినా అర్థంకాదా.. నీకు ఏమైనా అయితే మేం బతకగలమా..మిథున: ఈ మూడు ముళ్ల నన్ను కాపాడుతుంది. దేవాకి నా మీద ఉన్న ప్రేమ నన్ను బతికిస్తుంది. మరోసారి నన్ను దేవాని విడదీసే ప్రయత్నాలు చేయకండి ప్లీజ్.. నీకు నీ పుట్టిల్లా లేక దేవా కట్టిన తాళి బంధమా అని అడిగితే దేవా కట్టిన తాళి బంధమే అని చెప్తా. మీరు ఇంకా నన్ను దేవాని విడదీయాలని చూస్తే పుట్టింటితో పూర్తిగా బంధం తెంచేసుకుంటా.. అని వెళ్లిపోతుంది. 

హరివర్ధన్ కుప్పకూలిపోతాడు. శారద సత్యమూర్తికి కాఫీ ఇస్తుంటే శ్రీరంగం తీసుకుంటాడు. ఇప్పుడే తాగావు కదరా అంటే కాఫీ చూస్తే ఆగలేను అని రంగం అంటాడు. మీరు ఇచ్చిన రెండు వందలు మీ కాఫీకే సరిపోవు అని సత్యమూర్తి అంటాడు. ఇక ఆనంద్ త్రిపుర వాళ్లు శ్రీరంగం ద్వారా ఇచ్చిన ఉద్యోగంలో చేరడానికి వెళ్తాడు. ఈ ఉద్యోగం అయినా సక్రమంగా చేయరా.. అని సత్యమూర్తి అంటాడు. ప్రమోదిని రంగం, కాంతంలో మీరు ఈ ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. రంగం, కాంతం పక్కకి వెళ్లి ఈ ఉద్యోగం ఏంటో త్రిపుర వాళ్లు ఏం ప్లాన్ చేశారో అని టెన్షన్ పడతారు.

దేవా గదిలో మిథునతో ఉన్న ఫొటోలు చూస్తూ మిథున నా మనసులో మాట నీకు చెప్పుకోలేను.. అటు మీ నాన్నకి ఇచ్చిన మాటకి ఇటు నీ మీద ప్రేమ చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నాను అని గోడ మీద ఫొటోలు తీసి వాటిని కాల్చాలని చూసి కాల్చలేక ఏడుస్తాడు. నా వల్ల కావడం లేదు మిథున నేను ఇక్కడే ఉంటే నువ్వు చూపించే ప్రేమకు లొంగిపోతాను.. అలా జరగకూడదు అంటే ఒక్కటే మార్గం అని బయటకు వెళ్లిపోవాలని  బ్యాగ్ సర్దుకుంటాడు. బయటకు వెళ్తుంటే మిథున పరుగున వచ్చి దేవాని హగ్ చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.