Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవాకి కాల్ చేస్తుంది. దేవా మామకి ఇచ్చిన మాట గుర్తొచ్చి కాల్ చూసి కన్నీరు పెట్టుకుంటాడు కానీ లిఫ్ట్ చేయడు. దేవా ఏంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదని మిథున కంగారు పడుతుంది. హరివర్ధన్ కూతురికి రెస్ట్ తీసుకో అని చెప్తారు. దానికి మిథున మీరు ఉండండి నాన్న దేవా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని టెన్షన్‌గా ఉందని మళ్లీ కాల్ చేస్తుంది.
మిథున ఏడుస్తూ ఏంటి దేవా నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఏమైంది అని అనుకుంటుంది. దేవా బిజీగా ఉండుంటాడు అని లలిత అంటే మిథున లేదమ్మా ఏదో జరిగింది అని కంగారు పడుతుంది. తండ్రి దగ్గరకు వెళ్లి నాన్న ఏమైంది దేవా ఎందుకు వెళ్లిపోయాడు. ఏం జరిగింది నాన్న.. నాన్న మీ మౌనం నాకు భయపెడుతుంది అని అంటుంది. లలిత, అలంకృతలు మిథునతో దేవా నువ్వు కోలుకున్న వరకు నీ పక్కనే ఉన్నాడు.. నీ కోసం నిప్పుల గుండం తొక్కాడు. నీ కోసం పరుగున వచ్చాడు.. అని చెప్తారు. మిథున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కానీ అంత లోనే ఏడుస్తూ నా కోసం నిప్పుల గుండం తొక్కిన వాడు.. నేను కోలుకున్న తర్వాత ఎందుకు నా పక్కన లేడు.. ఏదో జరగకపోతే నేను కోలుకుంటే ఎందుకు నా పక్కన ఉండడు. నాన్న ఏం జరిగింది చెప్పండి అని హరివర్ధన్‌ని అడుగుతుంది. కంగారు పడకు ఏం కాలేదు అని లలిత చెప్తుంది. మిథునని తండ్రి హక్కున చేర్చుకుంటాడు. టెన్షన్ పడకమ్మా నీ కోసం మేం నరకం చూశాం మాకు మరోసారి ఆ పరిస్థితి తీసుకురాకమ్మా అని ఏడుస్తారు. మిథున బాధ చూసి హరివర్ధన్ చాలా బాధపడతాడు.
దేవా మామయ్య మాటలు గుర్తు చేసుకొని చాలా బాధ పడతాడు. దేవా బాధగా ఉండటం చూసి అతని ఫ్రెండ్స్ వెళ్తారు. వదిన అన్ని సార్లు కాల్ చేసినా ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు వదిన్ని బాధ పెడుతున్నావ్ అని అడుగుతారు. దేవా కన్నీళ్లు పెట్టుకుంటారు. అందరూ దేవాతో నువ్వు ఇలా కన్నీరు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు ఏమైంది చెప్పు అని అడుగుతారు. నేనేం బాధ పడటం లేదురా నన్ను ప్రశ్నలతో చంపకండిరా అని వాళ్లని గదిమేస్తాడు దేవా. ఇక మనసులో ఎవడు నన్ను చంపాలి అనుకున్నది ఎవడు.. మిథునని చావుబతుకుల మధ్యకు పంపింది ఎవడు వాడి చావు చూడాలి అనుకుంటాడు.
ఆదిత్య బొకేతో మిథున ఇంటికి ఎంట్రీ ఇస్తాడు. మిథున ఇప్పుడు మీ ఇంట్లో అడుగుపెడుతున్నా.. త్వరలో నీ జీవితంలోకి శాశ్వతంగా అడుగుపెడతా అని అనుకుంటాడు. మిథున దేవా గురించి ఆరాటపడటం గురించి హరివర్ధన్ ఆలోచిస్తాడు. దేవాని మిథున జీవితం నుంచి పంపేశాను కానీ మితున దేవా గురించి ఆలోచించకుండా ఏం చేయాలో మిథున దేవాని పూర్తిగా మర్చిపోయేలా చేయడానికి ఎవరి సాయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అనుకుంటాడు. ఇంతలో ఆదిత్య వచ్చి మిథునతో మాట్లాడాలి అని హరివర్ధన్ పర్మిషన్ తీసుకొని మిథున దగ్గరకు వెళ్తాడు. మిథున దేవాకి కాల్ చేస్తూనే ఉంటుంది. దేవా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా బాధ పడుతుంది.
ఆదిత్య మిథున దగ్గరకు వెళ్లి గెట్ వెల్ సూన్ చెప్పి నువ్వు బతకడం నా అదృష్టం. నీకు బులెట్ తగిలితే నాకు తగిలినట్లు అయింది నీకు ఏమైనా అయితే నేను బతకగలనా మిథున అంటాడు. మిథున షాక్ అయి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావ్ నాకు ఏమైనా అయితే నువ్వు బతకలేకపోవడం ఏంటి అర్థం లేకుండా అని అడుగుతుంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని ఆదిత్య కవర్ చేస్తాడు. నువ్వు కోలుకోవాలని చాలా దేవుళ్లని మొక్కుకున్నా.. నువ్వు కోలుకోవడం చాలా సంతోషంగా ఉంది.. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున.. నువ్వు ఇంకా ప్రమాదంలోనే ఉన్నావని.. దేవా రూపంలో ప్రమాదం నిన్ను ఇంకా వెంటాడుతూనే ఉందని అంటాడు. దేవా నాకోసం ప్రాణం ఇస్తాడు. అలాంటి దేవా వల్ల నాకు ప్రమాదం ఏంటి బుద్ధి లేకుండా అని అడుగుతుంది. దానికి ఆదిత్య అందరూ అనుకుంటున్నారని దేవా శత్రువుల వల్లే నీకు ఇదంతా అయిందని అంటాడు. మిథున ఆదిత్యతో దేవా నా పక్కన ఉంటే నాకు ఏం కాదు ఇలాంటి వంద ప్రమాదాలు అయినా క్షేమంగా ఎదుర్కొని తిరిగి వస్తానని అంటుంది. నువ్వు క్షేమంగా ఉండటమే నాకు కావాలి అని ఆదిత్య అంటాడు.
ఆదిత్య వెళ్లిపోతుంటే త్రిపుర ఆపుతుంది. ఆదిత్య అక్కతో అక్క మిథునతో నా పెళ్లికి పావులు కదుపు అని చెప్తుంది. మామయ్య దేవాని అల్లుడిగా అంగీకరించేశారు ఇంకా నీకు బుద్ధి రాలేదా అని త్రిపుర అంటే ఆదిత్య అక్కతో మిథున జీవితంలో దేవా లేడు.. ఇంక రాడు.. మిథున ఈ ఆదిత్య గాడి భార్య. మామయ్యతో మా పెళ్లి గురించి మాట్లాడు అని అంటాడు.
దేవా మిథునని తలచుకొని బాధ పడతాడు. మిథున నీకు ఎలా ఉంది అని అడగాలి అని ఉంది. నీతో మాట్లాడాలి అని ఉంది.. గుర్తొస్తున్నావ్ మిథున అని బాధ పడతాడు. సత్యమూర్తి వచ్చి దేవాని తినమని అంటాడు. దేవా వద్దని అనేస్తాడు. దేవా పక్కనే కూర్చొని నిన్నటి నుంచి చూస్తున్నా ఎవరితో మాట్లాడటం లేదు.. ఏకాంతంగా ఉన్నావ్.. మిథున పుట్టినరోజున నీ కళ్లలో ఎంతో సంతోషం చూశా.. ఇప్పుడు అదే కళ్లలో పట్టరాని బాధ చూస్తున్నా.. మిథున ఇంటికి క్షేమంగా వచ్చినా బాధ పడుతున్నావ్ అంటే ఏదో జరిగింది ఏమైంది చెప్పు.. మనసులో బాధ పడేలా ఏడ్వరా.. ఆ బాధకి కారణం ఈ నాన్నకి చెప్పురా అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.