Nuvvunte Naa Jathaga Serial Today Episode  మిథునని దేవా ఇష్టపడుతున్నాడని పురుషోత్తానికి తెలిసిపోతుంది. దేవాని చంపేయమంటావా అన్న అని పురుషోత్తంతో అతని మనిషి అడిగితే వద్దని దేవా నా బలం వాడిని ఏం చేయకూడదు ఆ మిథునని చంపేయాలి అని బయట వాళ్లని పిలిచి మిథునని చంపించమని పురుషోత్తం చెప్తాడు.

మిథున ఫ్రెండ్స్‌గా వచ్చిన కావ్య, ఆనంది, సింధూరలు మిథున, దేవాలని కలపాలి అని అనుకుంటారు. భాను అందరితో పిలిచి కోలాటం ఆడేవారు ముందుకు రండి అని అంటుంది. మిథున ఫ్రెండ్స్ అందరూ వస్తారు. కాంతం కూడా రంగంలోకి దిగుతుంది. దేవాని రౌండ్‌ అప్ చేసి మిథున, సింధూర, కావ్య, ఆనంది దాండియా ఆడుతారు. తర్వాత దేవాని కూడా మిథునతో ఆడమని అంటారు. మిథున కూడా ఆడమని అంటుంది. దేవా ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. శారద దేవా దగ్గరకు వెళ్లి వాళ్లు అంత ముచ్చట పడుతున్నారు ఆడొచ్చు కదా అంటుంది. ఇంతలో పంతులు వచ్చి దాండియా ఎక్కువ సేపు ఆడినవాళ్లకి అమ్మవారి చీర వస్తుందని అంటారు. 

మిథున ఆ చీర నేను దక్కించుకుంటా అని అంటుంది. భాను అంత ఈజీ కాదు అంటే నాకు అవుతుందని మిథున అంటుంది. కాంతం భానుతో ఆ చీరని గెలిచి అత్తయ్యకి ఇచ్చి మార్కులు కొట్టేయమని అంటుంది. కావ్య, సింధూర వాళ్లు మిథునని గెలిపించాలి అనుకుంటారు. అందరూ దాండియా ఆడుతారు. ఆనంది, సింధూర, కావ్య ఒక్కొక్కరు కావాలనే ఓడిపోతూ బయటకు వస్తారు. చివరకు మిథున, భాను మిగులుతారు. ఇద్దరూ ఆడుతారు. చివరకు భాను కూడా ఓడిపోతుంది. మిథున గెలిచిందని అందరూ అరుస్తారు. మిథునకు పంతులు చీర ఇస్తారు. మిథున అది తీసుకొని శారద దగ్గరకు వెళ్లి చీర ఇస్తుంది. అందరూ చెప్పడంతో శారద చీర తీసుకుంటుంది. చాలా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. శారద చాలా హ్యాపీగా దేవాతో నువ్వు కొన్న చీరని మీ నాన్న కట్టనివ్వలేదు నా కోడలు ఇచ్చిన ఈ చీరని ఎవరూ కాదనలేరు అని అంటుంది. పరిస్థితులు మారిపోతాయని అనిపిస్తుందని అంటుంది. 

దేవా మాట మార్చుతూ నిమజ్జనం చేయాలి అందరూ ఒక్కసారి వస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఒక్కొక్కరూ రండి అని చెప్పి వెళ్లిపోతాడు. పురుషోత్తం కొంత మంది రౌడీలతో మిథునని చంపేయమని అంటాడు. మిథున నిన్ను చంపేస్తా నా తమ్ముడు దేవా నా గుప్పిట్లో ఉంటాడు. నీ చావుని నేను రాజకీయంగా వాడుకుంటా అని అనుకుంటాడు. మిథున వాళ్లు బతుకమ్మ నిమజ్జనం చేసి వెళ్తుంటే ఓ రౌడీ వచ్చి మిథునని పొడవబోతాడు. దేవా చాకుని తన చేతితో పట్టుకుంటాడు. నా భార్యనే చంపడానికి వస్తావారా అని రౌడీలను చితక్కొడతాడు. ఎవరు ఇదంతా చేయించారని అడుగుతాడు. దాంతో రౌడీలు పారిపోతారు. నా భార్యకి నేను ప్రతీ క్షణం సైన్యంలా ఉంటాను.. నా భార్య జోలికి వస్తే మీ శవాలు కూడా దొరకవు అని అంటాడు. 

మిథునతో నా రక్తం చిందించి అయినా నిన్ను కాపాడుకుంటా అని చెప్తాడు. మిథునకు ఇలాంటి పరిస్థితి రావడానికి ఆ దేవా కారణం అని దేవాని వదిలేసి  వచ్చేయమని త్రిపుర అంటుంది. మిథున ఫ్రెండ్స్ త్రిపురతో మిథునని దేవా కాపాడుకుంటాడు.. అని చెప్తారు. మీ దగ్గర ప్రమాదం జరిగితే ఎలా మీరు కాపాడుతారా అని త్రిపురని అడిగితే మిథునని ఫారెన్ పంపేస్తాం అని అంటుంది. దేవా మిథునని ప్రేమిస్తున్నాడు.. దేవా రౌడీగా మారడం మీ బంధానికి పెద్ద ప్రమాదం దేవాని రౌడీయిజం మాన్పించు అంతా మంచి జరుగుతుందని మిథునతో తన ఫ్రెండ్స్ చెప్తారు.  గుడిలో జరిగిన విషయం గురించి సత్యమూర్తి ఇంట్లో మీటింగ్ పెడతారు. దేవా ఉండగా నాకు ఏం కాదు అని మిథున అంటుంది. మిథున నమ్మకానికి శారద, సత్యమూర్తి సంతోషపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.