Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున కాలు నొప్పి అని దేవాకి ఆయిల్ రాయమని అంటుంది. దేవా రాయను అని చెప్పడంతో మిథున దేవాని దెప్పిపొడుస్తుంది. మిథున మాటలకు విసిగిపోయిన దేవా కాలు బెనికేకంటే పళ్లురాలిపోయి ఉంటే బాగుండేదని సెటైర్లు వేస్తాడు.

Continues below advertisement


మిథున బుంగమూతి పెట్టి అప్పుడైనా సరే నేను చెప్పాలి అనుకున్నది చెప్పేస్తా అని అంటుంది. భార్య కాలికి దెబ్బ తగిలింది అయ్యో పాపం ఆయిల్ రాయాలి అనిలేదు  అని అంటుంది. నీకు సేవలు చేయడానికి నేను పనోడిని అనుకుంటున్నావా అని దేవా అంటే నేను చేసిన వంట దొంగతనంగా తినేయడం తెలుసు కానీ హెల్ప్ చేయడం తెలీదా.. భార్యకి సేవ చేస్తే పనోడు అయిపోతాడంట పనోడు.. పురుషోత్తం దగ్గర చేతులు కట్టుకునేదాన్ని అంటారు పనోడు అని అని అంటుంది. పురుషోత్తం అన్న గురించి అంటే బాగోదు అని దేవా అంటే నేను మాట్లాడుతా అని మిథున అంటుంది.


దేవా ఇరిటేట్ అయి నిన్ను నువ్వు చేసిన వంట తినడం నేను చేసిన తప్పు.. ఇప్పుడు నీ బాధ ఏంటి నేను నీ కాలికి ఆయిల్ రాయాలి కదా ఇలా కాలు పెట్టు అని కాలికి మర్దనా చేస్తాడు. మిథున మనసులో శ్రీకృష్ణుడు కూడా సత్యభామ కాలు పట్టుకున్నావాడే నువ్వే నా దారిలోకి వస్తావ్ దేవా అని అనుకుంటుంది.


శారద మిథునకు మర్దన చేయాలి అని వచ్చే టైంకి దేవా మిథునకు మర్దన చేయడం చూసి భార్య మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా బంగారం లాంటి పిల్లని దూరం చేసుకుంటావ్ అని అనుకుంటుంది. ఇద్దరూ కలిసిపోయే రోజు కోసం ఎదురు చూస్తున్నాంరా అని అనుకొని శారద వెళ్లిపోతుంది. మిథున దేవా కాలు పట్టుకోవడంతో దీవించినట్లు చేయి పెట్టడంతో ఈ ఓవరాక్షన్‌ చేస్తే ఇంకో కాలు నేను విరిచేస్తా అని అంటాడు.


ఆనంద్‌ పది లక్షలు పట్టుకొని కారులో వెళ్తూ పది లక్షలు క్యాష్, కారు అన్నీ ఇచ్చారు ఈ ఉద్యోగం చాలా మంచిది అని వదులుకోకూడదు అని అనుకుంటాడు. ఆనంద్ బ్యాంక్‌కి వెళ్లగానే రౌడీలు ఢీకొట్టినట్లు కొట్టి డబ్బు స్థానంలో పేపర్లు పెట్టేస్తారు. నా డబ్బు నా డబ్బు అని ఆనంద్ చాలా కంగారు పడతాడు. ఆనంద్‌ కంగారు చూసి చాలా బాధేస్తుంది.


మిథున కాలు నొప్పితో ఉంటే కాంతం తుడవడానికి వెళ్తుంది. రొమాన్స్ చేసుకుంటే ఇలాగే కాలు విరిగిపోతుంది అంటుంది కాంతం. మిథున సిగ్గు పడుతూ మేం చాలా దాగుడు మూతలు ఆడాం.. నీకు అవన్నీ చెప్పనా అని అంటుంది. నాకు ఎందుకు అని కాంతం మూతి విరిచేస్తుంది. ఈ ఇంటి నుంచి నువ్వు వెళ్లిపోతావ్ అని కాంతం అంటే వెళ్లిపోతే నువ్వు వెళ్లిపోతావ్ అని నేను మాత్రం వెళ్లను అని అంటుంది.


ఆనంద్‌ మేనేజర్‌ దగ్గరకు వెళ్లి డబ్బు మారిపోయిందని తెల్ల కాగితాలు ఉన్నాయని అంటాడు. ఆఫీస్ నుంచి వెళ్లినప్పుడు ఉన్న డబ్బు పోతే మాకేం తెలీదు.. డబ్బు తీసుకెళ్లిన నీదే బాధ్యత అని ఆనంద్‌ని ఇరికించేస్తాడు మ్యానేజర్. పోలీస్‌ స్టేషన్‌కి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అంటే నువ్వే తీసేశావ్ అని రాహుల్, త్రిపురల మనిషి అయిన మేనేజర్ ఆనంద్ మీద నింద వేసి పోలీసులకు ఫోన్ చేయమని అంటాడు. ఆనంద్ ఎంత బతిమాలినా ఒప్పుకోడు.


రాహుల్, త్రిపురల మేనేజర్‌కి కాల్ చేసి ఆనంద్‌ని వదిలేయమని అంటాడు. ఆనంద్‌ చాలా సంతోషపడతాడు. త్రిపుర రాహుల్‌లో ఎలా వదిలేశావ్ అంటే  పది లక్షలు అంటే దేవా తీసుకొచ్చి కట్టేస్తాడు. వాడిని ఇంకా పెద్ద దానిలో ఇరికించాలని అంటాడు.


మిథున వాకిట్లో ముగ్గు పెడుతుంటుంది. సత్యమూర్తి చూసి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. శారద వచ్చి మిథునలాగే ముగ్గు కూడా చాలా బాగుందని అంటుంది. సత్యమూర్తి మిథునని చూసి కోడలు అంటే కోరి తెచ్చుకున్న అదృష్టం కానీ మిథున తనంటతానే మన కోసం వచ్చిందని అంటాడు. కాంతం ఉడికి పోయి రంగానికి చిక్కేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.