Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవా నిశ్చితార్థం ఆపాలి అనుకుంటే శారద నిశ్చితార్థం ఆపాలి అనుకుంటే నా మీద ఒట్టు అని మిథునని ఆపేస్తుంది. ప్రమోదిని చూసి అత్తయ్య ఒక్కరే వచ్చారు మిథున ఎక్కడ అని అనుకుంటుంది. మిథున రాలేదు ఏంటా అని ప్రమోదిని అనుకుంటుంది.
దేవా ఉన్నట్టుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది ఏంటి.. అలజడిగా ఉంది.. మిథున ఇక్కడే ఎక్కడో ఉంది అని అనిపిస్తుంది అని మొత్తం చూసి ఎదురుగా నిల్చొన్న మిథునని చూస్తాడు. మిథున దేవాని చూస్తూ ఏడుస్తుంటుంది. దేవా కూడా కన్నీరు పెట్టుకుంటాడు. కాంతం మిథునని చూసి షాక్ అయి భాను దగ్గరకు వెళ్లి నీకో షాకింగ్ విషయం చెప్తా అని మిథున వచ్చిందని మిథునని చూపిస్తుంది. భాను షాక్ అయిపోతుంది. తన మెడలో తాళి ఉంది.. కాబట్టి తను ఈ నిశ్చితార్థం ఆపించేస్తుంది. అందుకే త్వరగా నిశ్చితార్థం జరిపించమని మీ అమ్మకి చెప్పు అని అంటుంది.
భాను వెంటనే తన తల్లికి సైగ చేస్తుంది. భాను తల్లి పంతులుతో త్వరగా నిశ్చితార్థం చేయమని అంటుంది. పంతులు దేవా, భాను ఇద్దరికీ దండలు మార్చుకోమని చెప్తారు. మిథున చూస్తుండగానే భాను దేవా మెడలో దండ వేస్తుంది. దేవాని కూడా భాను మెడలో దండ వేయమని అంటే దేవా మిథునని చూస్తూ ఉంటాడు. సత్యమూర్తి కూడా దండ వేయమని చెప్పడంతో దేవా భాను మెడలో దండ వేస్తాడు. మిథున చాలా ఏడుస్తుంది. తర్వాత పంతులు రింగులు ఇచ్చి మార్చుకోమని అంటారు.
దేవా మిథునని చూసి బాధ పడతాడు. మిథున వద్దూ అన్నట్లు తలూపుతుంది. కానీ దేవా భాను చేతికి రింగు తొడుగుతాడు. మిథున చాలా చాలా బాధ పడుతుంది. భాను కూడా దేవాని రింగ్ పెట్టేసిన తర్వాత పంతులు లగ్నపత్రిక చదువుతారు. గురువారం పెళ్లి అని నిర్ణయిస్తారు. అది విని మిథున తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ప్రమోదిని మిథున దగ్గరకు వెళ్లి నీ కళ్లెదుటే నిశ్చితార్థం జరుగుతుంటే ఎందుకు ఆగిపోయావ్ అని అడుగుతుంది. దానికి మిథున ఇద్దరు కలిసి ఉండాలి అంటే ఒక మనసులో ఒకరి మీద ప్రేమ ఉండాలి.. కానీ దేవా మనసులో నా మీద ప్రేమ లేదు,, కేవలం ద్వేషం మాత్రమే ఉంది.. నేను తన జీవితంలో నుంచి ఎప్పుడెప్పుడు వెళ్లిపోతానా అని అనుకుంటున్నాడు అని అంటుంది. దేవా మనసులో నీ మీద చాలా ప్రేమ ఉంది అని ప్రమోదిని అంటుంది. నిజంగాదేవాకి నేను ఇష్టం ఉంటే నా ముందే ఇంకో అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుంటాడా.. ఇన్నాళ్లు దేవాకి నేను అంటే ఇష్టం అనుకున్నా కానీ అదంతా బ్రమ అని తేలిపోయింది అని మిథున ఏడుస్తుంది. మా బంధం ముగిసిపోయింది అని అంటుంది.
ఇంతలో ఓ సాధువు వచ్చి మీ బంధం ముగిసిపోలేదు.. ఆ పార్వతి పరమేశ్వరులు వేసిన బంధానికి ముగింపు ఉండదు.. అది ఎప్పటికీ బతికే ఉంటుంది.. కొత్త మలుపు తీసుకుంటుంది అని అంటుంది. ప్రమోదిని చాలా సంతోషపడుతుంది. ఫారెన్‌లో ఓ హీరో ఎంట్రీ ఇస్తాడు. తనకు త్వరలో పెళ్లి చూపులు అని పీఏతో చెప్తాడు. అందుకే ఇండియా వెళ్తున్నాఅని చెప్తాడు. తనకు కాబోయే అమ్మాయి కనిపించగానే పూలవాన పడాలి.. తను నా కోసమే పుట్టింది అనిపించాలి.. అంటూ తనకు కాబోయే భార్య గురించి.. పెళ్లి గురించి గొప్పగా చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.