Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథున తలలో పూలు పెట్టడం భానుమతి చూస్తుంది. రేయ్ ఏం చేస్తున్నావ్‌రా అని అడుగుతుంది. భానుని చూసి దేవా షాక్ అయిపోతాడు. ఏంట్రా ఇది దీని తలలో నువ్వు పూలు పెట్టడం ఏంట్రా అంటుంది. ఇక మిథున పువ్వులు పట్టుకొని మెలికలు తిరుగుతూ భానుని ఏడిపిస్తుంది. నీకు అసలు విషయం తెలీదు అని నువ్వు వెళ్ల అని దేవా అంటాడు. దానికి భాను నువ్వు మారిపోయావ్రా అని తిడుతుంది. దేవా తల బాదుకొని వెళ్లిపోతాడు. 

దేవా తల కొట్టుకొని ఇటు నువ్వు అటు ఆవిడ ఇద్దరూ నన్ను ఆడుకుంటున్నారని వెళ్లిపోతాడు. ఇక మిథున భానుతో నా మొగుడు నాకు పూలు పెడితే నీకు ఏంటి నా కొంగు పట్టుకొని తిరిగితే నీకు ఏంటి వెళ్లి హాస్పిటల్లో చూపించుకో అంటుంది. దానికి భాను దేవాకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే నీకు చూపిస్తా అని చెప్పి దేవాని తీసుకొని గాజుల షాప్‌కి వెళ్లి గాజులు తన చేతికి వేయమని అంటుంది. దేవా తిడతాడు. మర్యాదగా నా చేతికి గాజులు వేయ్ అని అంటుంది. ఆ మిథునని నువ్వు నిజంగా ఇష్టం లేకపోతే నా చేతికి గాజులు వేయ్ అని  అంటుంది. దేవా భానుకి గాజులు వేసి హ్యాపీనా అని అడుగుతాడు. మిథున ఉడికిపోతుంది. దేవా నన్ను ఉడికించడానికి నీకు గాజులు వేశాడు నీకు వేయడం ఇష్టం లేదు అని కూడా చెప్పాడు కదా నీకు నిజంగానే మైండ్ లేదు అని అంటుంది. 

మిథున తనని ఉడికించడంతో భాను మిథున కాళ్లలో కాళ్లు పెట్టి మిథునని పడేస్తుంది. మిథున అది చూసి నడవలేను అని యాక్టింగ్ చేస్తుంది. పూలు ఇచ్చిన బామ్మ మిథునని ఎత్తుకొని తీసుకెళ్లమని చెప్తుంది. దాంతో దేవా మిథునని ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఇంతలో పురుషోత్తం, లాయర్ అటుగా వెళ్తూ దేవా మిథునని ఎత్తుకొని తీసుకెళ్లడం చూస్తారు. లాయర్ పురుషోత్తంతో దేవా అమ్మాయిని పంపేయాలి దేవా ప్రయత్నిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ల మధ్య ప్రేమ బంధం ఎలా ముడిపడిందో చూడండి అని అంటాడు. ఆ అమ్మాయి మీద అంత ప్రేమ ఉన్న మిథునని పంపించడు అని అంటారు. దేవా ఈ అమ్మాయిని వదలడు ఆ జడ్జి మిమల్ని వదలడు మీరు ఇక ఎమ్మెల్యే పదవి మీద ఆశలు వదులుకోండి అని చెప్తాడు. ఇక సూర్యకాంతం తనతో బామ్మ తనతో అన్నీ పనులు చేయించి తన నడుం విరగ్గొట్టి ఒళ్లు హూనం చేసేసిందని ఏడుస్తుంది. 

మిథున సంతోషంగా ఇంటిలో అందరి కోసం వంట చేస్తుంది. చాలా సంతోషపడుతుంది. ఎవరికీ నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు కదా నా వంట తింటారా లేదా అని ఆలోచిస్తూ దేవున్ని దండం పెట్టుకుంటుంది. అది చూసి ప్రమోదిని మిథున దగ్గరకు వెళ్తుంది. అందరి కోసం ప్రేమగా వండాను అక్క అందరూ తినకపోతే నాకు బాధగా ఉంటుంది కదా అంటుంది. అందరూ తింటారు అని ప్రమోదిని చెప్తుంది. త్వరలోనే దేవా నిన్ను భార్యగా మామయ్య గారు కోడలిగా ఒప్పుకుంటారని అంటుంది. మిథున సంతోషంతో అక్కని హగ్ చేసుకుంటుంది. అందరూ భోజనాలకు కూర్చొంటారు. మిథున వడ్డిస్తుంది. సత్యమూర్తి కోపంగా ఉంటాడు. కానీ బేబీ గ్రానీ ఉండటంతో వడ్డించమని తలూపుతాడు. మిథున సంతోషంతో వడ్డిస్తుంది. సత్యమూర్తి భార్యతో శారద టైం చూశావా ఒకప్పుడు ఆ అమ్మాయికి ఒక్క ముద్దు కూడా మనం పెట్టలేదు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చేతి వంట మనం తినాల్సి వస్తుందని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!