Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథునని దేవా ప్రేమిస్తున్నాడని నిరూపిస్తానని చెప్పిన బామ్మ మిథునని కోనేటిలో తోసేస్తుంది. తర్వాత దేవాకి విషయం చెప్పడంతో దేవా కోనేటిలో దూకి మిథునని బయటకు తీసుకొస్తాడు. చాలా కంగారు పడతాడు. ఆ టైంలో దేవాకి మిథున అంటే ఎంత ఇష్టమో బయట పడుతుంది. మిథున అది చూస్తుంది.
దేవా మిథునతో నీకు పిచ్చా నిన్ను ఇష్టపడే వాళ్లు ఎంత మంది ఉన్నారో తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి అని తిట్టి వెళ్లిపోతాడు. బామ్మ మిథున దగ్గరకు వచ్చి ఇప్పుడేమంటావ్. నీ మీద ఎంత ప్రేమ ఉందో చూశావా.. ఫీల్ ది లవ్ బేబీ అని మిథునని అంటుంది. దాంతో మిథున దేవా తనని పెళ్లి చేసుకోవడం కాపాడటం అన్నీ గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక ఇంట్లో కాంతం మేడ మీద అమ్మోరు తల్లిలా జుట్టు విరబోసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని పెద్ద కత్తి నూరుతూ ఉంటుంది. ఇలా ఉన్నావ్ ఏంటి అని ప్రమోదిని అడిగితే ఈ రోజు మన ఇంట్లో రక్తం పాతం ఉంది ఆ బేబీ బామ్మని చంపేస్తా అంటుంది. ప్రమోదిని కాంతంతో అంత ఆవేశం జాగ్ర్తత చెప్పినట్లే కాంతాన్ని బామ్మ పేరు చెప్పి బయపెడుతుంది.
మిథున స్నానం చేసి వచ్చి అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ దేవా మీద నాకు ప్రేమ ఉందా నా మనసుని తాకిన ఈ ఫీలింగ్ ప్రేమేనా.. ఎస్ ఇది ప్రేమే ఐయామ్ ఇన్ లవ్ విత్ దేవా అని అనుకుంటుంది. దేవాకి కూడా నేను అంటే ఇష్టం ఉంటుందా తెలుసుకోవాలి అనుకుంటుంది. దేవా దగ్గరకు వెళ్లి నేను నీకు ఏం అవుతాను అని నన్ను కాపాడావు అంటుంది. నీకు నాకు ఏంటి సంబంధం.. నీ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది. నేను నీ భార్యని కాబట్టే నన్ను కాపాడావ్ అని అంటుంది. అంత లేదు అని దేవా అంటాడు. నేను ఏమైపోయినా పట్టించుకోను అన్నావ్ మరి నన్ను ఎందుకు కాపాడావ్.. నేను నీళ్లలో పడిపోగానే దరిద్రం వదిలిపోయింది అనుకోకుండా ఎందుకు కాపాడావ్ అని అడుగుతుంది. దేవా ఏం చెప్పలేకపోతాడు. ప్రాణాలు పోయే టైంలో ఎవరు అని చూడం కదా అంటే నువ్వు నన్ను కాపాడింది మానవత్వంతో కాదు ప్రేమతో అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని దేవా అడిగితే ఇది నిజం అని మిథున అంటుంది. నీ భార్య నీటిలో పడిపోయింది అని అమ్మమ్మ చెప్పగానే నీటిలో దూకేశావ్ అంటే నా మీద నీకు ప్రేమ ఉన్నట్లే కదా.. నీ మనసులో నా మీద ప్రేమ ఉంది అని చెప్తుంది.
నేను కళ్లు తెరిచే వరకు నాకు ఏం అవుతుందా అని విలవిల్లాడిపోయావ్. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ఫీల్ వస్తుంది అంటుంది. ప్రేమ లేదు తొక్క లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపో అంటాడు. నీ మనసుతో మాట్లాడు నా మీద నీకు ప్రేమ ఉందో లేదో నీకే తెలుస్తుందని మిథున అంటుంది. దేవా మనసులో మేడం మ్యాజిక్‌నే కాదు నన్ను కన్ప్యూజ్ చేసేసింది ఏంటి అనుకుంటాడు. మిథున అద్దం మీద మిథున, దేవా లవ్ బిగన్స్ అని రాస్తుంది. చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!