Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా, మిథునల బంధం గురించి నిజం తెలుసుకున్న బేబీ బామ్మ ఇద్దరినీ కలపాలి అనుకుంటుంది. అందుకే ఇద్దరినీ గుడికి తీసుకొస్తుంది. బద్ధశత్రువులు అయినా కొన్నాళ్లు కలిసి ఉంటే ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడుతుందని మీ ఇద్దరికీ ఒకరు అంటే ఒకరు ఇష్టం ఉంది కానీ ఆ విషయం గుర్తించడం లేదని మిథున దూరం అయితే దేవా బతకలేడు కానీ ఆ విషయం నీకు తెలీడం లేదురా అనుకుంటుంది.
దేవా మిథునతో గుడికి ఎందుకు వస్తారు అని అంటే దానికి మిథున తాళి కట్టడానికి అంటుంది. ఏంటి అని బామ్మ అంటే దేవా ఏం లేదులే అని కవర్ చేస్తాడు. వ్రతాలు పూజలు చేయడానికి గుడి వస్తారు అదీ తెలీదా పూజారి దగ్గరకు వెళ్తే నీకే తెలుస్తుంది అంటుంది. పూజారి దేవా వాళ్లతో ఇద్దరితో దాంపత్య వ్రతం చేయించమని బామ్మ చెప్పారని ఈ వ్రతం చేస్తే మీ మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతాయని చెప్తారు. దేవా మిథున ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. దేవా పూజారిని తిట్టబోతే ఏంటి నాన్న మంత్రాలు చదువుతున్నావ్ అని బేబీ కౌంటర్ వేస్తుంది.
దేవా, మిథునల్ని ఎందుకు గుడికి బామ్మ తీసుకొచ్చిందో తెలుసుకోవడానికి కాంతం భర్తని తీసుకొని డిటెక్టివ్ గెటప్‌లో గుడికి వస్తుంది. బైనాక్యులర్‌తో తెగ వెతికేస్తుంది. మిథున బామ్మతో ఆయనకు ఇష్టం లేకపోతే వద్దు అంటుంది. దానికి బామ్మ అసలు మీరు నిజంగానే పెళ్లి చేసుకున్నారా మీ పెళ్లి మీద డౌట్ ఉంది అని గుండె పట్టుకొని యాక్టింగ్ చేస్తుంది. దాంతో దేవా అలాంటిదేమీ లేదని వ్రతానికి ఒప్పుకుంటాడు. పంతుల్ని పిలిచి ఇంకేమైనా తంతులు ఉంటే చేయించండి అని చెప్తుంది.
బేబీ, పంతులు దేవా, మిథునల్ని కొలను దగ్గరకు తీసుకెళ్లి దేవా మిథునల్ని ఇద్దరినీ కొలనులో మునికి హగ్ చేసుకొని 15 సార్లు మునగ మని చెప్తుంది. ఇద్దరూ షాక్ అయిపోతారు. దేవా వద్దు అంటాడు. దేవాకి ఇష్టం లేకుండా ఇదంతా వద్దని మిథున అంటే బేబీ మళ్లీ గుండె పట్టుకొని నాటకం ఆడుతుంది. మరోవైపు డిటెక్టివ్ తింగరి కాంతం మిథున వాళ్ల కోసం తెగ వెతికేస్తుంది. దేవా మిథునని పట్టుకుంటాడు. దేవా మిథున నడుం పట్టుకోగానే మిథున షాక్ అయిపోతుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు హగ్ చేసుకొని కోనేటిలో మునుగుతారు. మిథున, దేవాల్ని చూసి కాంతం షాక్అయిపోతుంది. ఇద్దరినీ ముసల్ది కోనేటిలో ఎందుకు అలా ముంచుతుందో అని అంటుంది.
బేబీ ఇద్దరినీ చూసి మీరు ఒకర్ని ఒకరు హగ్ చేసుకున్న విధానం చూసి మీకు ఒకరు అంటే ఒకరు ఎంత ఇష్టమో అర్థమవుతుంది అని అనుకుంటుంది. తర్వాత దేవా బామ్మతో అయిపోయింది కదా వెళ్లిపోదాం అంటే ఇంకా చాలా సీన్లు ఉన్నాయ్ అంటుంది. ఇద్దరినీ చూసుకొని మీ ఇద్దరూ దాంపత్యం వ్రతం చేసిన లోపు ఒకరు అంటే ఒకరికి ఎంత ఇష్టమో బయట పెడతా అనుకుంటుంది. ఇద్దరూ ప్రదక్షిణలు చేసుకుంటారు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీని అడ్డు పెట్టుకొని రుక్మిణి తల్లిదండ్రుల పెళ్లిరోజు జరిపిస్తుందా!