Nuvvunte Naa Jathaga Serial Today March 26th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా ఇంట్లో దెయ్యం.. రౌడీకి చెమటలు పట్టించేసిన అందాల రాక్షసి పగ తీర్చుకుంటుందా!

Nuvvunte Naa Jathaga Today Episode సత్యమూర్తి కరెంట్ బిల్లు కట్టమని ఆనంద్‌కి డబ్బు ఇవ్వడం ఆనంద్ ఫ్రెండ్ ఆనంద్ బాకీ కింద వాటిని జమ చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా కోసం మిధున, భాను ఇద్దరూ క్యారేజ్‌లు తీసుకొని  గ్యారేజీకి వెళ్తారు. నా మొగుడు అంటే నా మొగుడు అని ఇద్దరూ తన్నుకుంటారు. చివరకు దేవా ఇద్దరి ఫుడ్ తిని భాను చేసిన వంట బాగుందని పొగిడేస్తాడు. ఇంటికి వస్తే నీ పని చెప్తా అని మిధున అనుకొని వెళ్లిపోతుంది. ఇక దేవాతో అతని ఫ్రెండ్స్ పార్ట్‌ 2 ఇంట్లో ఉంది మచ్చ అని అంటాడు. 

Continues below advertisement

ఇంటి దగ్గర సత్యమూర్తి కరెంట్ బిల్ కట్టమని ఆనంద్‌కి చెప్తే తిని పడుకొని లేచి వెళ్తాను అంటాడు. దాంతో సత్య మూర్తి తినడం పడుకోవడం తప్ప ఇంకేం చేత కాదా ఇంత బద్ధకం ఏంట్రా అని తిట్టడంతో ఆనంద్ డబ్బు తీసుకొని కరెంట్ బిల్ కట్టడానికి వెళ్తాడు. ఇక ఆనంద్ వెళ్తుండగా ఆనంద్ ఫ్రెండ్ ప్రసాద్ కనిపిస్తాడు. ఆనంద్ ప్రసాద్‌కి రెండు వేలు అప్పు తీసుకొని ఇంకా ఇవ్వడు. జాబ్ రాగానే ఇస్తాను అనగానే ఇంకో 50 ఏళ్ల తర్వాత జాబ్ వస్తుందిలే అని సెటైర్లు వేసి ఆనంద్‌ కరెంట్ బిల్లు కట్టడానికి తన తండ్రి ఇచ్చిన 1500 రూపాయలు తీసుకుంటాడు. 

రాత్రి శారద భర్త, కొడుకు కోడళ్లకు భోజనం వడ్డిస్తుంటుంది. దూరంగా కూర్చొన్న మిధునని చూసి మనసులో నువ్వు ఈ కుటుంబంతో కూర్చొని కలిసి సంతోషంగా తినే రోజు దగ్గర్లోనే ఉందని అనుకుంటుంది. ఇక సత్యమూర్తి 2016లో ఇంటర్ బ్యాచ్ వచ్చి తన ఆశీర్వాదం తీసుకున్నారని చెప్తాడు. అది దేవా బ్యాచ్ అని చిన్న కొడుకు అనగానే వాడి పేరు కూడా పెట్టొద్దని సత్యమూర్తి తిడతాడు. తన స్టూడెంట్స్ అందరూ మామూలు ర్యాంక్ స్టూడెంట్స్ అయినా మంచి మంచి ఉద్యోగాల్లో దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారని గొప్పగా చెప్తాడు. ఫస్ట్ ర్యాంకర్ అయిన మీ కొడుకు ఏం చేస్తున్నాడని అందరూ అడిగితే తల తీసేసినట్లుందని అనుకుంటాడు. ఇంతలో దేవా వస్తాడు. తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతాడు. ఎయిర్‌పోర్ట్‌కి రాలేను అని వాళ్లకి చెప్తాడు. ఇక ఆకలి వేస్తుందని అన్నం పెట్టమని దేవా కూర్చొంటే సత్యమూర్తి శారదతో వాడు ఇక్కడ కూర్చొంటే నేను వెళ్లిపోతా అని అంటాడు. కుటుంబం అందరికీ పెట్టి వాడికి పెట్టకపోవడం ఏంటి అండీ అని అంటుంది. ఇక దేవా అయితే అమ్మ అందరూ తిన్న తర్వాతే నేను తింటాను ఏం కాదులే అని లేచి వెళ్లిపోతాడు. ఇంతలో కరెంట్ పోతుంది. ప్రమోదినికి క్యాండిల్స్ తీసుకురమ్మని శారద చెప్తే భోజనం చేస్తూ లేవొద్దని మిధున తాను వెలిగిస్తానని వెళ్లి క్యాండిల్స్ వెలిగిస్తుంది. ఇళ్లంతా మిధున క్యాండిల్స్ వెలిగిస్తుంది. తర్వాత దేవా దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చూస్తుంది. 

దేవా: ఈవిడేంటి నా వైపు చూసి కళ్లల్లో కత్తులు కారాలు నూరుతుంది. ఓహో మధ్యాహ్నం భోజనం ఎఫెక్ట్ అన్నమాట.
శారద: అవును మన ఇంట్లోనే కరెంట్ పోయిందా మన ఇంట్లోనే పోయిందా. బయటకు వెలుతురు కనిపిస్తుంది అందుకే అడిగాను.
దేవా: అమ్మ నేను చూస్తాను ఆగు. అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే మన ఇంట్లోనే కరెంట్ పోయింది. ఏరియా మొత్తం కరెంట్ ఉంది.
సత్యమూర్తి: ఓరేయ్ ఆనంద్ ఉదయం కరెంట్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా కట్టావా లేదా.
ఆనంద్: కట్టేశాను నాన్న..
సత్యమూర్తి: కడితే మన ఇంట్లోనే ఎందుకు కరెంట్ తీస్తారు. ఈ రోజే లాస్ట్ డేట్ అని చెప్పా కదా కట్టావా లేదా నిజం చెప్పు.
దేవా: కరెంట్ వాళ్లకి కాల్ చేసి బిల్ కట్టామని చెప్తాడు. దాంతో ఉదయం వచ్చి చూస్తామని వాళ్లు చెప్తారు. 
సత్యమూర్తి: మన ఇంటి సంగతి నేను చూసుకోగలను అయ్యగారికి తన పని చూసుకోమను శారద.

ప్రమోదిని భర్తని అనుమానంగా చూస్తుంది. కరెంట్‌కి ఇబ్బంది పడుతున్న ఆనంద్ ఈ ఒక్క రాత్రి గడిచిపోతే రేపే ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకొని కరెంట్ బిల్ కట్టేస్తా అనుకుంటాడు. ఇంతలో ప్రమోదిని అక్కడికి వస్తుంది. కరెంట్ బిల్ కట్టారా అని అడుగుతుంది. కట్టేశాను అంటాడు. ఉద్యోగానికి వెళ్లాల్సిన నా భర్త చిన్న చిన్న అవసరాల కోసం కూడా మామయ్య గారి పింఛన్ మీదే ఆధారపడుతున్నారు అని అయినా బాధ పడలేదు అని కానీ ఈ రోజు మీ మీద అనుమానంగా ఉందని చెప్తుంది. మీరు కరెంట్ బిల్ కట్టలేదని రేపు తెలిస్తే అందరూ మిమిల్ని దొంగ అంటారు నేను భరించ లేను దయచేసి నాకు ఆ పరిస్థితి తీసుకురావొద్దని బాధపడుతుంది. కరెంట్ లేక ఉక్క పోస్తుంది అనగానే మీరే కష్టపడుతున్నారు.. ఇంటి పని వంట పని చేసి కష్టపడుతున్న నాకే దిక్కు లేదు మీకు విసరాలా అని కసిరేస్తుంది. 

ఇక దేవా మేడ మీద పడుకొని ఉంటే మిధున దెయ్యంలా రెడీ అయి రౌడీ గారికి చుక్కలు చూపిస్తుంది. ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని దేవా అరిచి గోల పెడతాడు. మిధున దగ్గరకు రాగానే దెయ్యం దెయ్యం అని వణికిపోతాడు. మిధున దేవా అంటూ చాకుతో పట్టుకొని నిన్ను చంపేస్తా అని హడావుడి చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర అఖండ జ్యోతి దీక్ష నెరవేరిందా...? ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏంటి..?

Continues below advertisement