Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా తనని ప్రేమిస్తున్నాడని కానీ దాన్ని ఎలా బయట పెట్టాలో తెలీడం లేదని వారం రోజుల్లో తండ్రి దగ్గర దేవా ప్రేమ ఎలా నిరూపించుకోవాలని మిథున అనుకుంటూ వీటన్నింటికీ నువ్వే దారి చూపాలి అని అమ్మవారికి కోరుకుంటుంది.
మిథున అమ్మవారి గుడిలో ఓ వస్త్రంలో దేవా, మిథున అని పసుపు కుంకుమతో పేర్లు రాస్తుంది. దేవా అటుగా వచ్చి బండి ఆగిపోవడంతో గుడి బయట ఉంటాడు. దాన్ని ముడుపు కట్టాలని మా బంధం మీరు శాశ్వతం చేస్తారు అని నమ్ముతున్నా అని ముడుపు కట్టడానికి వెళ్తుంది. మీరు నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది కానీ భయం వేస్తుంది.. దేవా నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా.. నాకు నమ్మకం కావాలి ఆ నమ్మకం నాకు ఇస్తావా.. నిజంగా నా ప్రేమ గెలుస్తుందా అని మిథున కోరుకుంటుంది. దాంతో మిథున చేతిలో ఉన్న ఆ ముడుపు బట్ట ఎగిరి బయట ఉన్న దేవా మీద పడుతుంది.
మిథున చూసి చాలా సంతోషపడుతుంది. దేవా ఆ పేర్లు చూసి షాక్ అయి మొత్తం చూస్తే అక్కడ మిథున కనిపిస్తుంది. మిథునని చూసి పిచ్చి బాగా ముదిరింది అని ఆ వస్త్రం నలిపేస్తే మిథున తీసుకుంటుంది. దేవా వెళ్లిపోయిన తర్వాత మిథున మాది జన్మ జన్మల బంధం అని అర్థమైంది. ఈ వారంలో దేవాకి నా మీద ప్రేమ ఉందని నిరూపిస్తాను అనుకుంటుంది. ఇంటి దగ్గర కాంతం బయట కూర్చొని టపాసులు పెట్టుకొని మిథున ఏడుస్తూ వస్తే టపాసులు కాల్చుతా అని గెంతులేస్తుంది. మిథున నవ్వుతూ ఎగురుతూ రావడం చూసి కాంతం కంగుతింటుంది. కాంతం మిథునతో నువ్వు వెళ్లిపోతావ్ కదా బట్టలు సర్దేయనా అంటే అక్కాయ్ కామెడీ చేస్తున్నావా అని అంటుంది.
కాంతంతో మా వాళ్లు ఆయన జోలికి రాకుండా ఉండేలా.. కొత్త జర్నీ చేయనున్నా..అదే ప్రేమ ప్రయాణం ఇప్పటి నుంచి దేవా మిథునల లవ్ స్టోరీ మొదలవుతుందని అంటుంది. తొక్కేం కాదు అని కాంతం అంటే మిథున దేవాని ప్రేమించినట్లే దేవా కూడా మిథునని ప్రేమిస్తున్నాడు అని వారంలో నిరూపిస్తా అని అంటుంది. కాంతం షాక్ అయిపోతుంది. ఇక నేత్ర తన వాళ్లతో దేవా వచ్చే దారిలో కాపలా కాసి దేవా రాగానే రౌడీలు తనని తరిమేలా చేసి దేవా కాపాడేలా చేస్తుంది. థ్యాంక్స్ చెప్పడానికి దేవాకి హగ్ చేసుకుంటుంది. ఈ రోజు మీరు కాపాడారు ఇంకెప్పుడు ఏమైనా అయితే చెప్పుకోవడానికి ఎవరూ లేరని మీరే తెలుసు అని దేవా నెంబరు అడుగుతుంది. దేవా విజిటింగ్ కార్డు ఇస్తుంది.
సత్యమూర్తికి బేబీ కాల్ చేస్తుంది. ఒంటరిగా ఉన్నాను బాధగా దిగులుగా ఉందని అంటుంది. సత్యమూర్తి తల్లిని ఇంటికి వచ్చేయమని అంటే దానికి బేబీ నేను అక్కడికి రావడం కాదు నా చిన్న మనవడు చిన్న మనవరాలు నా దగ్గరకు రావాలి అంటుంది. వాళ్లు రారు అని సత్యమూర్తి అంటే నేను టెన్షన్‌తో బకెట్ తన్నేస్తా అంటుంది. నా చిన్ని మనవడిని పంపిస్తే పంపు లేదంటే వదిలేయ్ నేను పోతా అని అంటుంది. సత్యమూర్తి ఇంట్లో అందరికీ విషయం చెప్తాడు. వెంటనే అత్తయ్య ఆరోగ్యం కోసం అయినా వీళ్లని పంపమని శారద అంటే దేవా అస్సలు వెళ్లను అంటాడు. సత్యమూర్తి దేవాని తిడుతూ వెంటనే వెళ్లమని అంటారు.
మిథున సంతోషపడినా పైకి మాత్రం నేను వెళ్లను అంటుంది. ఇక్కడే దేవా నాకు ఇబ్బంది పెడతాడు అక్కడికి వెళ్తే ఇంక అంతే అంటుంది. సత్యమూర్తి శారదతో తప్పు అయినా తప్పడం లేదు నువ్వే ఇద్దర్ని ఒప్పించి పంపించు అంటారు. మిథునకి శారద ఒప్పిస్తుంది. ఉదయమే ప్రయాణం బట్టలు సర్దుకోండి అని పంపిస్తుంది. మిథున గంతులేస్తూ బట్టలు సర్దుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: కోర్టులో ఉత్కంఠ.. లక్ష్మీకి శిక్ష గ్యారెంటీ.. విహారి ఏం చేయనున్నాడు!