Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున సత్యమూర్తికి మంచి నీరు ఇస్తే తీసుకోడు. నువ్వు ఈ ఇంటి కోడలు కాదు. వాడు నిన్ను భార్యగా అనుకోవడం లేదు నేను కోడలిగా అనుకోవడం లేదు మరి నువ్వు ఇక్కడ ఎందుకు అని అడుగుతారు. దాంతో మిథున ఇదంతా దైవ సంకల్పం. ఈయన్ను నాకు భర్తగా చూపించిన పార్వతీ పరమేశ్వరులే తనని మార్చుతారు నా భర్తగా ఒప్పుకునేలా చేస్తారని మిథున అంటుంది.

సత్యమూర్తి మిథునతో కూతురిలాంటి ఓ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంటే జాలి పడి చెప్తున్నా అయినా నువ్వు వినకపోతే నీ ఖర్మ అనుకోవడమే అని వెళ్లిపోతాడు. శారద మిథునతో మీ మామయ్య గారు ఏం అన్నా నేను నిన్ను నువ్వు ఈ ఇంటి కోడలివే అని అంటుంది. దేవా మిథునతో నువ్వు ఏ క్షణం ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి నాకు టార్చర్ మొదలైంది మా నాన్నతో ఇంకా ఇంకా మాటలు పడుతున్నా ఏం ఖర్మరా బాబు అనుకుంటాడు. 

మరోవైపు కాంతం, రంగం పదిలక్షల చీటీ అయిపోతుందని పది లక్షలు మనకు రాబోతుందని ఇద్దరూ లెక్కలేసుకుంటారు. ఇంతలో ప్రమోదిని వచ్చి పిలవడంతో ఇద్దరూ చాలా కంగారు పడతారు. లెక్కల పుస్తకాలు, డబ్బు దాచేసి తెగ కంగారు పడతారు. ప్రమోదిని వెళ్లిపో వెళ్లిపో అని అంటారు. నన్ను వెళ్లిపోమని అంటున్నారు ఏదో దాస్తున్నారు అని అంటుంది. ప్రమోదిని తేలు తేలు అనడంతో కాంతం డబ్బు బయట పడేస్తుంది. అది చూసిన ప్రమోదిని మీ దగ్గర ఇంత డబ్బు ఉంటే ఎందుకు మామయ్య మీద ఆధారపడి ఆయన కష్టపడుతుంటే చూస్తున్నారు కానీ సాయం చేయరా అని అంటే అది తన పిన్ని చిట్టీ డబ్బు అని చెప్తుంది. ప్రమోదినిని తిట్టేసి పంపేస్తుంది కాంతం. 

మిథున రాత్రి తాళితో సెల్ఫీలు తీసుకుంటుంది. ఇంతలో దేవా వస్తే డోర్ తీసి నీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా రా భోజనం చేద్దాం అని మిథున వడ్డించడానికి వెళ్తుంది. దేవా కోపంగా చూస్తే ఎంత అందంగా ఉంటే మాత్రం అలా చూసేస్తావా భోజనం చేస్తూ కూడా చూడొచ్చు వెళ్లు అని అంటుంది. ఏంటి ఓవర్ చేస్తున్నావ్ అని దేవా అంటే ఈ తాళి నాకు ఎలా ఉంది మొగుడ్స్ అని దేవాని సతాయిస్తుంది. గాలిలో ఎగిరి మెడలో పడితే నా మొగుడు కట్టాడు నా మొగుడు కట్టాడు అని మురిసిపోవద్దని దేవా అంటాడు. దానికి మిథున కొన్ని బంధాలు దేవుడు ముందే ముడి వేస్తాడు మొగుడ్స్ అక్కడ అంత మంది ఉంటే నా మెడలోనే ఈ నల్లపూసలు ఎందుకు పడ్డాయి. అర్థం చేసుకో రాజా అని అంటుంది. నువ్వు భ్రమల్లో బతికే బుర్రలేని దానివి అని అర్థం అయిందని దేవా చిరాకు పడతాడు.

దేవా తినకుండా పడుకోవడానికి వెళ్తే మిథున చాప దిండు తీసుకొని ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా అని పాడుతుంది. ఏంట్రా ఈ టార్చర్ అని దేవా అనుకుంటాడు. తినకుండా పడుకున్నావ్ కాబట్టి కడుపులో సౌండ్ వస్తుంది అని అంటుంది. దేవాకి ఆకలికి కడుపులో సౌండ్ వస్తుంది. చెప్పానా మ్యూజిక్ స్టార్ట్ అవుతుందని అంటుంది. దేవాని కావాలనే భయపెడుతుంది. మిథున నవ్వుకుంటుంది. నీరు తాగాలి అని పిస్తుంది. నిద్ర పట్టడు అని దేవాని భయపెడుతుంది. స్టార్ట్ అయిందా అని ఏడిపిస్తుంది. దేవా కోప్పడితే ఇంత కోప్పడటం చాలా డేంజర్ అని అంటుంది. 

మిథున ఫుడ్ బాగుందని ఊరిస్తుంది. నేను తినకుండా ఉంటే నువ్వు ఇలా ఊరించడం శాడిజమే అని దేవా అంటాడు. దానికి మిథున ఒకసారి నేను తినకుండా ఉంటే నువ్వు నన్ను కావాలనే ఉడికించావ్ దాన్ని ఏమంటారు అని అంటుంది. నాకే తెలుసే నువ్వు అన్నీ కడుపులో పెట్టుకొని ప్రతీకారం చేస్తావని అంటాడు. సరసాలు చాలు శ్రీవారు అని మిథున పాటలు పాడుతుంది. దేవా చెంబు తీసుకొని కొట్టబోతే ఆకలి వేస్తే నన్ను పిలు మొగుడ్స్ నేను వడ్డిస్తాను అని అంటుంది. మిథున వెళ్లిపోగానే దేవా ఆకలికి అటూ ఇటూ తిరుగుతాడు. ఉదయం మిథున తులసి కోటకి పూజ చేస్తుంది. తాళికి కుంకుమ పెట్టి హ్యాపీగా ఫీలవుతుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ కోసం చేయి విరుచుకున్న విహారి.. యమున నగలు సిద్దార్థ్‌కి ఇచ్చేసిన అంబిక!