Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఇంట్లో వాళ్లతో మిథున అన్న తనని చంపాలని ప్రయత్నించాడని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. మిథున, శారద కంగారు పడి దేవా దగ్గరకు వెళ్లి ఏమైందిరా అని అడుగుతారు. శారద ఏడుస్తుంది. మా అన్నయ్యా అని మిథున అలా ఉండిపోతుంది. నల్లపూసల ఫంక్షన్ జరగడం నాకు ఇష్టం లేదమ్మా కానీ నేను ఇంటికి రాకపోవడానికి అసలు కారణం అర్థమైందా అని చెప్తాడు. 

దేవా మిథునతో ఏం కుటుంబం మీది ఒకరేమో తీర్పులు చెప్తారు. ఇంకొరు ఇలా ప్రాణాలు తీయాలి అని చూస్తున్నారు... అలాంటి కుటుంబం  కోసమా నువ్వు గొప్పలు చెప్పేది. లక్కీగా నేను మెల్లగా వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే ఆ వైరు నా గొంతుకి తగిలి అక్కడికక్కడే చచ్చే వాడిని అంటాడు. అందరూ నోరెళ్ల బెడతారు. మిథున ఏంటమ్మా ఇది పగ ప్రతీకారం అంటూ ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి అని రేపు నా కొడుకు ప్రాణాలు తీసేస్తే ఏంటి పరిస్థితి అని శారద మిథునని అడుగుతుంది. అలాంటి పరిస్థితి రాదు నేను రానివ్వను మా వాళ్లు మరోసారి ఆయన జోలికి రాకుండా ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అత్తయ్యా అని మిథున అంటుంది. 

కాంతం వచ్చి నీ నటన సూపర్ అమ్మా అని అంటుంది. దేవాకి ప్రమోదిని జాగ్రత్తగా ఉండమని అంటే ఇంకోసారి ఈ దేవా జోలికి రాకుండా ఏం చేయాలో నాకు తెలుసు అని దేవా వెళ్తాడు. మిథున కోపంగా బయటకు వెళ్లి అన్నకి ఫోన్ చేస్తుంది. త్రిపురకు రాహుల్ మిథున కాల్ చేస్తుంది అని చెప్తే ఇన్ని రోజులు చేయని మిథున ఇప్పుడు కాల్ చేస్తుంది అంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది మాట్లాడండి అని అంటుంది. అన్నయ్యా చాలా బాధ పడుతుంటావు కదా అని అంటుంది. ఎందుకు బాధ అని రాహుల్ అంటే మా ఆయన్ని చంపించాలి అనుకున్న నీ ప్లాన్ ఫలించలేదు కదా అంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది అని రాహుల్ అంటే అన్నయ్యా నటించకు ఇలా నటించి నీ మీద నాకు అసహ్యం కలిగేలా చేసుకోకు. ఏ అన్నయ్యా అయినా చెల్లి కాపురం బాగుండాలి అనుకుంటాడు. కానీ నువ్వు చెల్లి పసుపుకుంకుమలు తీయాలి అనుకుంటున్నావు నువ్వు అన్నయ్యవేనా అని అడుగుతుంది.

రాహుల్ కోపంగా అవును అన్నయ్యనే చెల్లి అంటే పంచప్రాణాలు అనుకున్న అన్నయ్యని. యువరాణిగా పెరిగిన నా చెల్లి జీవితాంతం అలాగే ఉండాలని నా చెల్లి జీవితాంతం అలాగే బతకాలి అని కోరుకున్న అన్నయ్యని. నా చెల్లికి రౌడీ దగ్గర నుంచి తీసుకొచ్చి మంచి జీవితం ఇవ్వాలి అనుకున్న అన్నయ్యని అని అంటాడు. దేవా నా భర్త దేవాతోనే నా జీవితం అని ఆ పరమేశ్వరుడే నిర్ణయించాడని అంటుంది. నేను నా జీవితాన్ని సంతోషంగా మలచుకోవాలని అనుకుంటే నా అన్నయ్య నా మాంగల్యం తెంచేసి నన్ను విధవని చేయాలి అని చూస్తున్నాడు అని అంటుంది. ఇక నిన్ను ఈ జన్మలో నిన్ను క్షమించను. మా ఆయన్ని చంపేస్తే మన ఇంటికి వచ్చేస్తా అనుకుంటున్నావ్ కానీ నా ప్రాణం పోయేవరకు ఇదే ఇంట్లోనే దేవా భార్యగా బతుకుతాను ప్రాణం పోయినా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోను గుర్తు పెట్టుకో.. మరోసారి నా భర్త జోలికి వస్తే నువ్వు నా అన్నయ్య అని కూడా చూడను అని వార్నింగ్ ఇస్తుంది. 

మిథునకు విషయం ఎలా తెలిసిందని త్రిపుర రాహుల్‌ని అడుగుతుంది. అదే తెలీడం లేదని ఈ విషయం ఆ దేవా గాడికి తెలిస్తే పరిస్థితి ఏంటా అని భయంగా ఉందని రాహుల్ అంటాడు. శ్రీరంగం కాంతం కోసం బిర్యానీ తీసుకొస్తే కాంతం విసిరి కొట్టి నేను మిథున చేతిలో ఓడిపోయాను అని కుయ్యోమొర్రో అని ఏడుస్తుంది. అందరూ ఆ మిథునని కోడలిగా ఒప్పుకునేశారని అంటుంది. రంగం కాంతంతో తనకు ఎంత మంది సపోర్ట్ ఉన్నా దేవా మిథునని చచ్చినా భార్యగా అంగీకరించడు అని అంటాడు. కాంతం పొంగిపోతుంది. 

దేవా రాహుల్‌ కారుకి అడ్డంగా నిల్చొని రాహుల్‌ని కారు దిగమని అంటాడు. రాహుల్ దిగకపోవడం పెద్ద రాయి తీసుకొచ్చి కారు మీద విసిరేస్తా అనడంతో రాహుల్ కిందకి దిగుతాడు. రాహుల్‌ని దేవా కొట్టి ఇలా చాటు మాటుగా చంపించాలి అనుకోవడం ఏంట్రా నా ముందుకొచ్చి చూడరా చూసుకుందాం. నేను రౌడీని నన్ను చంపాలి అనుకుంటే కన్ఫర్మ్ చేసుకోని వెళ్లాలిరా అని అంటాడు. నాకు ప్రాణం విలువ తెలుసురా నిన్ను చంపితే నీ భార్య విడో అయిపోతుందన్న ఒకే కారణంతో నిన్ను వదిలేస్తున్నా అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. 

సత్యమూర్తి ఇంటికి వస్తాడు. మిథున మంచి నీరు ఇస్తే సత్యమూర్తి తీసుకోడు. నేను ఈ ఇంటి కోడల్ని మామయ్య మీరు ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు అని అంటే నీ మంచి కోసం నీ భవిష్యత్‌ కోసం అని అంటారు. నీ భర్త ఏం చేస్తున్నాడు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తావ్ అని అడుగుతారు. ఇంతలో దేవా అక్కడికి వస్తాడు. నీ ఫ్రెండ్స్ అందరూ తమ భర్తలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అని గొప్పగా చెప్తారు నువ్వు నీ భర్త ఓ రౌడీ అని గొప్పగా చెప్పుకోగలవా అని అడుగుతారు. మిథున తల దించుకుంటుంది. నీ భర్త గురించి నువ్వేం చెప్పుకోలేవ్ మరి నీ భవిష్యత్ ఎలా బాగుంటుందమ్మా నువ్వు నా కూతురివని చెప్తున్నా మూడు ముళ్లు ఎంత పవిత్రమో అది కట్టిన వాడు కూడా అంతే మంచోడై ఉండాలి. వాడి మీద ఆశలు పెట్టుకున్న కన్న తండ్రినే వాడు ఏడిపిస్తున్నాడు మరి నీ జీవితం ఏం బాగుంటుందని అంటారు. వాడు నిన్ను భార్యగా అంగీకరించడం లేదు నేను కోడలిగా అంగీకరించడం లేదు మరి నువ్వు ఇక్కడ ఉండి ఏం సాధిస్తావ్ నీ మంచి కోసం చెప్తున్నా నువ్వు వెళ్లిపో అని అంటారు. ఆ రోజు గుడిలో అంత మంది ఉంటే దేవా నా మెడలోనే ఎందుకు తాళి కట్టాడు. ఇదంతా దైవ సంకల్పం మామయ్య  ఆ పరమేశ్వరుడే నా భర్తని మార్చుతాడని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!