Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున తనకు జరిగిన నల్లపూసల వేడుక గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దేవా తాను ఒక్కటైపోయినట్లే ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నట్లు కల కంటుంది. ఇంతలో మిథున చెల్లి అలంకృత వచ్చి ఏంటి అక్క ఏ లోకంలో ఉన్నావ్ ఓన్లీ డ్రీమ్స్ ఏనా హనీమూన్ కూడా అయిపోతుందా అని అక్కతో సెటైర్లు వేస్తుంది.
మిథున అమ్మా బామ్మ గురించి అడిగితే నువ్వు డ్రీమ్‌లో విహరిస్తున్నప్పుడే వెళ్లి కారులో కూర్చొన్నారని చెప్తుంది. ఏ విధంగా అయినా నీ మెడలో దేవా బావ నల్లపూసలు వేశారు ఇక నువ్వు పర్మినెంట్‌గా ఈ ఇంటికి కోడలు అయిపోయావ్ అంటుంది. ఇంతలో దేవాని చూసి ఓయ్ బావ ఆగు వస్తున్నా అని దేవా దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. దేవా కోపంగా బావ ఏంటి మీ అక్కకే అనుకున్నా మీ ఫ్యామిలీ అందరికీ స్క్రూ లూజా అంటే నీ కాంప్లిమెంట్‌కి థ్యాంక్స్ బావ అని అలంకృత అంటుంది. ఇక తన పేరు చెప్పి బీటెక్ ఫైనల్ ఇయర్ అంటుంది. నీ డిటైల్స్ నాకు ఎందుకు అని దేవా అంటే రేపు ఎప్పుడైనా రోడ్డ మీద కనిపిస్తే హలో నా పెళ్లాం చెల్లెలా అని పిలుస్తావా అలా పిలిస్తే అంత బాగోదు అందుకే పేరుతో పిలుస్తావని పేరు చెప్పా అని దేవా మీద సెటైర్లు వేస్తుంది.
అలంకృత దేవాతో నువ్వు మా ఫ్యామిలీ అయిపోయావ్ బావ మనల్ని మనం స్క్రూలూజ్ అనుకోకూడదు అని అంటుంది. ఇక దేవాని మిథున దగ్గరకు తీసుకెళ్లి మీ ఇద్దరినీ ఆ దేవుడు ఒకరి కోసం ఒకర్ని పుట్టించాడు మా అక్క చాలా మంచిది బాగా చూసుకో అని అలంకృత అక్కాబావల చేతులు కలుపుతుంది. దేవా విసురుగా మిథున చేయి వదిలేస్తాడు. అక్క బావ అలానే మాట్లాడుతాడు కానీ నువ్వు వీలైనంత త్వరగా బావ మనసు మార్చేసి నువ్వే నా ప్రాణం మిథున అనేలా చేసేయ్అని అంటుంది. లలిత వాళ్లు ఇంటికి వెళ్లి నల్లపూసలు తంతు గురించి సంతోషంగా మాట్లాడుకుంటారు.
త్రిపుర చప్పట్లు కొడుతూ వచ్చి ఏ తల్లి అయినా కూతురి జీవితం బాగుండాలి అనుకుంటారు మీరు మాత్రం మీ కూతురి జీవితం నిప్పుల్లో తోసేసి వచ్చారని అత్తతో గొడవ పడుతుంది. కూటికి గతిలేని ఇళ్లు అత్తారిళ్లు.. వాళ్లని వీళ్లని కొట్టి డబ్బులు సంపాదించే వాడు మిథునకు భర్త.. కోటలో మహారాణిలా ఉన్న మిథున జీవితం నాశనం చేశారని త్రిపుర అంటుంది. అలంకృత దేవాని బావ అనడంతో రాహుల్ అలంకృతకు కొట్టడానికి వెళ్తాడు. లలిత, బామ్మ మిథునకు సపోర్ట్ చేస్తారు. త్రిపుర లలితతో మామయ్య గారు లేని టైంలో ఈ తంతు చేశారు. ఇప్పుడు మామయ్యగారికి విషయం తెలిస్తే ఏమవుతుందో ఎలాంటి భయంకర పరిస్థితి తీసుకొస్తుందో తెలుసుకోండి ఏం జరిగినా అన్నింటికీ మీరే బాధ్యులు అని తెలుసుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది.
లలిత కంగారు పడితే అత్త ధైర్యం చెప్తుంది. దేవా ఓ చోట తంతు గురించి ఆలోచిస్తూ ఉంటే హాయ్ మొగుడ్స్ అంటూ మిథున వస్తుంది. అక్షింతలు వేసి ఆశీర్వదించమని అంటుంది. ఏంటే ఆశీర్వదించేది నోరు మూసుకొని వెళ్లు అని తిడతాడు. దేవా చేతులు పట్టేసి అక్షింతలు పట్టించి బలవంతంగా అక్షింతలు వేయించుకుంటుంది. దేవా షాక్‌లో ఉండగానే దేవా ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇలా భార్య చెప్పినట్లు వినడమే గుడ్ హజ్బెండ్ లక్షణం అని అంటుంది. ఇంకొక్క క్షణం నువ్వు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని దేవా అంటాడు. ఈ లుక్‌లో ముద్దొస్తున్నావ్ అని మిథున చెప్పి వెళ్తుంది. మిథున తెగ సిగ్గు పడిపోయి చాలా సంతోషంగా చిందులు వేస్తుంది.
ప్రమోదిని ఆనంద్ షర్ట్ చూసి ఏంటి అండీ మీ షర్ట్ ఇంత చిరిగిపోయింది అని అడుగుతుంది. కూలీ పని చేస్తున్నా అని అందుకే ఇలా అని ఆనంద్ మనసులో అనుకుంటాడు. ఏదో కూలి పని చేసినట్లు బట్టలు ఉన్నాయి.. నిజం చెప్పండి మీరు లెక్కలు రాసే పనికే వెళ్తున్నారా అని భర్తని ప్రమోదిని అడుగుతుంది. అబద్దం చెప్పడం లేదు అని ఆనంద్ కవర్ చేస్తాడు. ఇక మిథున ఫంక్షన్ ఫొటోలు చాలా బాగా వచ్చాయి అత్తయ్యా అని మురిసిపోతుంది. చూపించు అని శారద అడుగుతుంది. దేవా కోపంగా చూస్తే చూపులతో చంపేస్తున్నారు ఏంటి అండీ మీరు అని అంటుంది.
దేవా శారదతో అమ్మ నా కోసం అంత బాధ పడతావు కదా రాత్రి నుంచి ఇంటికి రాలేదు ఎందుకు అడగలేదు అని అడుగుతాడు. మిథున మెడలో నల్లపూసలు వేయడం ఇష్టం లేక రాలేదు అంటుంది. మిథున ఏమైందని అడిగితే నిన్నటి నుంచి నేను మతి లేకుండా హాస్పిటల్ బెడ్ మీద పడున్నా నాకు ఆ పరిస్థితి రావడానికి జడ్జి గారి కొడుకు కారణం అంటాడు. మా అన్నయ్యా అని మిథున షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!