Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున సంతోషం కోసం ఏమైనా చేస్తానని దేవా మామ హరివర్ధన్‌తో చెప్తాడు. దేవా చెప్పిన మాటలు విన్న మిథున చాలా సంతోషపడుతుంది. దేవా కోసం బెడ్ సర్దుతుంది. దేవా వచ్చి చాప అడుగుతాడు. బయట పడుకుంటా అని చెప్తాడు. నువ్వు నా భర్తవి దేవా ఎవరో పరాయి వ్యక్తిలా అలా బయట పడుకుంటా అంటా వేంటి.. నువ్వు ఇక్కడ పడుకో నేను అలంకృత గదిలో పడుకుంటా అని చెప్పి నీరు ఇచ్చి ఏసీ పెట్టి అన్నీ ఏర్పాట్లు చేసి వెళ్లిపోతుంది.

దేవా బడ్ మీద పడుకుంటాడు. మిథున మెడలో బలవంతంగా తాళి కట్టడం, తన ఇంట్లో వాళ్లు మిథునని లోపలికి రానివ్వకపోవడం.. మిథున గుడిలో ప్రసాదం తింటూ కడుపు నింపుకోవడం, నేల మీద పడుకోవడం గుర్తు చేసుకొని బాధతో కిందకి దిగి కింద నేల మీద పడుకుంటాడు. మిథున అలంకృత గదిలోకి వెళ్తుంది. అలంకృత అక్కతో నువ్వు ఇక్కడ సెటిల్ అయితే మీ ఆయన ఫీలవుతాడు పోమ్మా పో అంటుంది. దానికి మిథున నేను ఆ గదిలో పడుకుంటే మా ఆయన చాప మీద పడుకుంటాడు.. అందుకే నేను ఇక్కడ పడుకున్నాననుకో ఆయన బెడ్ మీద హాయిగా ప్రశాంతంగా పడుకుంటాడని అంటుంది. 

అలంకృత అక్కతో నాకు పిచ్చ షాకింగ్‌గా ఉంది అక్క మీకు పెళ్లి అయింది కదా ఒకరు బెడ్ ఒకరు చాప ఏంటి అక్క మీ మధ్య కెమెస్ట్రీ ఏం జరగలేదా అని అడుగుతుంది. నీ వయసుకి తగ్గట్టు మాట్లాడవే అని మిథున అంటుంది. హే చెప్పక్కా ముద్దూ ముచ్చట కూడా జరగలేదా.. ముద్దు ముచ్చట కాదు కదా దేవా నన్ను ముట్టుకోలేదు కూడా.. అసలు ఆ దృష్టిలో నన్ను దేవా చూడలేదు.. దేవా రౌడీ అనే పేరు తప్ప బూతద్దం వేసినా చిన్న తప్పు కూడా దొరకదు. అమ్మాయిల విషయంలో చాలా మంచోడు నేను గదిలో సారీ మార్చుకున్నా సరే అటు చూడడు అని దేవా సాక్ష్యాత్తు శ్రీరామ చంద్రుడే అని అంటుంది. మిథున దేవా  గురించి ఆలోచిస్తే దేవా మిథున కోసం ఆలోచిస్తాడు. 

మిథున అద్దం ముందుకు వెళ్లి తాళి పట్టుకొని చూస్తూ దేవా కొన్ని బంధాలు అనుకోకుండా ముడి పడతాయి. ఎంత తెంచుకోవాలని ప్రయత్నిస్తే అంత ముడిపడతాయి. మన బంధం కూడా అలాంటిదే దేవా.. నీకు మన బంధం ఇష్టం లేదు కానీ నాకు మాత్రం ఎప్పటికీ గుండెల మీద మోయాలనిపిస్తుంది. నువ్వు నన్ను ఎంత అసహ్యించుకున్నా ఇప్పటికి ఈ బంధం నాకు భారంగా ఉన్నా ఎప్పటికైనా నిన్ను మార్చుకొని జన్మ జన్మల బంధంగా మార్చుకుంటా దేవా అనుకుంటుంది.

దేవా మిథున గురించి ఆలోచిస్తూ మిథున నేను నిన్ను చాలా అసహ్యంగా చూశా అసహ్యంగా మాట్లాడానా.. భరించావ్..  నీ స్థానంలో వేరే అమ్మాయి ఉంటే నా ముఖం కూడా చూడరు. కానీ నువ్వు మాత్రం నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఇంతలా ఆరాటపడుతున్నావ్. నీ విలువ నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు మిథున ఇప్పుడు అర్థం అయింది. నిన్ను నేను కోల్పోతే నన్ను కోల్పోయినట్లే.. నీ చేయి విడిచిపెడితే నేను నా ప్రాణం వదిలేసినట్లే.. మిథున నీకోసం నీ ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం అని దేవా అనుకుంటాడు. 

సూర్యకాంతం మండిపోతూ ఉంటుంది. రంగం వెళ్లి ఏమైందని అడిగితే దేవా మిథున కలిసిపోయేలా ఉన్నారు వాళ్లని విడదీయడం కష్టం అని అనిపిస్తుంది.ఇక ఏం చేయలేమని అర్థమైపోయింది ఇక  ఈ ఇంటిని అమ్మేసి మన వాటా మనం అమ్మేసి దూరంగా వెళ్లిపోదాం అని చెప్పి ఇళ్లు అమ్మడానికి మంచి బేరం తీసుకొని రమ్మని చెప్తుంది. రంగం తలూపి వెళ్తాడు. ఉదయం దేవా నిద్ర లేచేసరికి మిథున అద్దం మీద పేపర్‌తో దేవా కోసం మెసేజ్ రాసి ఉంచుతుంది. అందులో నేను గుడికి వెళ్తున్నాను.. నీ నిద్ర డిస్ట్రబ్ చేయడం ఎందుకని నిన్ను నిద్ర లేపలేదు. నీకు కాఫీ, టిఫెన్ అన్నీ ఏర్పాటు చేసి పెట్టాను.. పనమ్మాయిని అడుగు సర్వ్ చేస్తుంది అని రాసి ఉంటుంది. అది చదివిన దేవా బయటకు వెళ్తాడు. 

దేవా ఇళ్లంతా తిరుగుతాడు. ఇదేంట్రా బాబు ఒకేసారి కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు ఉంది.. ఈ ప్లేస్‌ ఈ ఇళ్లు ఈ అలవాట్లు అన్నీ మనకు వింతగా అనిపిస్తున్నాయి అనుకుంటాడు. బ్రష్, పేస్ట్‌ అడుగుదామని పనమ్మాయి కోసం వెతుకుతాడు. బయట హరివర్ధన్ యోగా చేస్తుంటే చూసి కంగారులో అక్కడున్న డెకరేషన్ బిందె పడేస్తాడు. సారీ చెప్పి గార్డెన్‌కి వెళ్లి వేప చెట్టు చూసి ప్రకృతి బ్రష్ ఉందిగా అని వెళ్లబోతూ మొక్కలకు నీరు పోసే పైపు తన్నేస్తాడు. అక్కడే కసరత్తులు చేస్తున్న త్రిపుర, రాహుల్ మీద నీరు పడతారు. త్రిపుర దేవాని తిడుతుంది. మర్యాద అని దేవా అంటాడు. దేవా సారీ చెప్తూ రాహుల్ టీ షర్ట్‌కి మట్టి అంటేస్తుంది. హరివర్ధన్‌కి తగిలిస్తారు. చెప్పులు బయటే ఉండాలి అని తిడుతుంది. కావాలని చేయలేడు పొరపాటు అయిందని దేవా అంటే రాహుల్ తిడతాడు. దాంతో దేవా మట్టిలో చేతులు ముంచి కావాలని చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా అని మట్టి పూసేస్తాడు. త్రిపుర దేవాని చాలా తిడుతుంది. 

హరివర్ధన్‌ కోసం ఎస్ఐ వచ్చి సంతకాలు కావాలని అడుగుతాడు. ఎస్‌ఐ దేవాని చూసి రేయ్ దేవా నువ్రేంట్రా ఇక్కడ వాడు ఏమైనా చేస్తే చెప్పండి సార్‌ కాలు విరగ్గొడతా అంటాడు. లలిత వచ్చి దేవా మా అల్లుడు అని చెప్తుంది. రౌడీ మీకు అల్లుడేంటి అని ఎస్‌ఐ అంటాడు. వెళ్లొస్తారా దేవా అని ఎస్ఐ అంటాడు. లలితతో హరివర్ధన్ విన్నావా ఆ ఎస్‌ఐ ఎలా అన్నాడో.. నా కుటుంబ స్థాయిని నేను ఎత్తి అంత ఎత్తులో పెంచాను దయచేసి అలాగే ఉంచండి అంటాడు. దేవా ఓ చోట కూర్చొని మిథున నువ్వు నిజంగా కోటలో యువరాణివే నేను మీనాన్న చెప్పినట్లు నిజంగా నీ కాలి గోటికి కూడా సరిపోను మిథున అయినా నువ్వు నా కోసం ఇంతలా ఎందుకు తాపత్రయపడుతున్నావ్ అనుకుంటాడు. ఇంతలో మిథున గుడి నుంచి పరుగున వస్తుంది. మిథునని చూసి దేవా సంతోషంతో ఎదురెళ్తాడు. మిథున దేవా దగ్గరకు వచ్చి బొట్టు మా నాన్న నిన్ను ఒప్పుకోవాలి మన లైఫ్ కావాలని పూజచేయించా నీ కోసం నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నా అనుకుంటున్నావా ఈ తాళి కోసం అంటుంది. దేవా షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.