Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథునల్ని బేబీ గుమ్మం దగ్గర నిలబెట్టి దిష్టి తీయమని శాంతకి చెప్తుంది. దేవా బాబేని చూసి నువ్వు మంచం మీద ఉన్నావ్ నీ పని అయిపోయింది అని చెప్పారు. నువ్వు చూస్తే చాలా హ్యాపీగా ఉన్నావ్. నిజంగానే నీకు బాలేదా అని అడుగుతాడు. బామ్మ దేవాతో మనసులో దిగులు ఉందిరా అది పైకి కనిపించదు కదా అని కవర్ చేస్తుంది. ఇక ఇద్దరికీ హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్లాలి అంటే భార్యాభర్తలు ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకోవాలని బేబీ కండీషన్ పెడుతుంది.
దేవా నోరెళ్ల పెడతాడు. మిథున సిగ్గు పడుతుంది. దేవా మిథునకు ముద్దు పెట్టడానికి దగ్గరగా వెళ్తే మిథున పరవశించిపోతుంది. దేవా మిథునకు ముద్దు పెట్టినట్లే దగ్గరకు వెళ్లి ఆ సీన్ చూసి సిగ్గు పడుతున్న బేబీకి ముద్దు పెట్టి లోపలికి పారిపోతాడు. బేబీ దేవాని చూసి వీడికన్నీ వాళ్ల తాత పోలికలే కానీ అన్ రొమాంటిక్ ఫెలో నువ్వేం ఫీలవ్వకు అమ్మా అని మిథునకు చెప్తుంది. మరోవైపు మిథునని తలచుకుంటూ ఆదిత్య దేవదాసులా మారిపోతాడు. చీకటి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. మిథునకు ప్రపోజ్ చేయడం దేవా తాళి కట్టాడని తెలిసి కూడా అదంతా మర్చిపోయి తనని పెళ్లి చేసుకోమని చెప్పడం అన్నీ గుర్తు చేసుకుంటాడు. నీ నోటితో ఐలవ్‌యూ ఆదిత్య అని చెప్తావు అనుకున్నా అది చెప్పకుండానే దూరం అయిపోయావ్ ప్రాణం పోయినంత బాధగా ఉంది మిథున అని ఏడుస్తుంటాడు.
ఇంతలో అక్కడికి త్రిపుర వస్తుంది. ఆదిత్య చేతిలో ఫోన్ లాగి అందులో మిథునని చూసి ఫోన్ విసిరికొడుతుంది. కళ్ల ముందు నిజం చూసి కూడా ఎందుకురా ఇలా పిచ్చోడిలా అయిపోతున్నావ్ అని తిడుతుంది. మిథున మీద నాకు ఉన్న ప్రేమ ఎప్పటికైనా నా జీవితంలోకి వస్తుంది అని అంటాడు. దాంతో త్రిపుర మిథున ఎప్పటికైనా నువ్వు వస్తుందని అనుకుంటున్నావ్ కానీ మిథున ఎప్పటికీ దేవాతో విడిపోని బంధం వేసుకోవడానికి సిద్ధమైందని మిథున ఎలా అయినా సాధిస్తుంది మా మామయ్య రెడ్ కార్పెట్ వేసి మరీ కూతురు అల్లుడిని తీసుకొస్తాడని అంటుంది. తండ్రీ కూతుళ్ల మధ్య ఒప్పందం గురించి చెప్తుంది.
ఆదిత్య సంతోషంతో నమ్మకం వచ్చేసింది అక్కా దేవాకి మిథున మీద ప్రేమ లేదు కాబట్టి మిథున వచ్చేస్తుందని అంటాడు. త్రిపుర తమ్ముడితో వారంలో ప్రేమ నిరూపిస్తా అని మిథున అంత కాన్ఫిడెంట్‌గా చెప్పింది అంటేనమ్మకం లేకుండానే చెప్తుంది. ఛాలెంజ్‌లో గెలవడానికి ప్రయత్నంగా దేవాని తీసుకొని బామ్మ ఇంటికి వెళ్లింది. ఇప్పుడు చెప్పురా మిథున ఎలా వస్తుంది నీ జీవితంలోకి అని అడుగుతుంది. ఆదిత్య ఏడుస్తూ మిథున నా జీవితంలోకి రాకపోతే చనిపోతా అంటాడు. త్రిపుర తమ్ముడితో మిథున నీకు దక్కాలని నువ్వు ఏం చేస్తున్నావ్రా మిథున నీకు నిజంగా దక్కాలి అంటే ఎదురించి అయినా యుద్ధం చేసి అయినా ఆఖరికి మోసం చేసి అయినా మిథునని నీ జీవితంలోకి తెచ్చుకుంటావ్ అని తమ్ముడికి చెప్తుంది. నీకు నాలుగు రోజులు టైం ఉంది ఏం చేస్తావో చేసుకో అంటుంది.
మిథున బేబీ ఒడిలో పడుకొని ఉంటుంది. బేబీ మిథునతో సడెన్‌గా ఫోన్ చేశావ్ నిన్ను మీ ఆయన్ను ఇక్కడికి పంపమని మీ మామయ్యకి చెప్పమని అన్నావ్ ఏం జరిగింది అని అడుగుతుంది. మిథున బేబీతో తనకు తన తండ్రికి జరిగిన ఒప్పందం చెప్తుంది. ఈ గడువులో నేను దేవాకి నా మీద ప్రేమ నిరూపించుకోకపోతే మా బంధం ఏమైపోతుందా అని భయంగా ఉందని మిథున కన్నీరు పెట్టుకుంటుంది. బేబీ మిథునకు ధైర్యం చెప్తుంది.
ప్రమోదిని, ఆనంద్ మాట్లాడుకుంటారు. రంగం కాంతానికి మీరు డిపోలో పని చేస్తున్నట్లు మాట్లాడొద్దు వాళ్లది వంకర బుద్ధి అని అంటే కాంతం, రంగం వినేసి మాది వంకర బుద్ధా ఇస్త్రీ డ్రస్ వేసుకొని వెళ్లేది దీనికా అని అంటారు. రంగం, కాంతం ఇద్దరూ ఆనంద్‌ని అవమానిస్తారు. ప్రమోదిని ఇద్దరినీ ఇక్కడి నుంచి వెళ్లండి అని అంటుంది. నీకు జాబ్ సూట్ అవ్వదురా అని శ్రీరంగం అంటే ప్రమోదిని ఇద్దరినీ తిట్టి అరిచి పంపేస్తుంది. ఎస్‌ఐ కానిస్టేబుల్ చెప్పిన రూట్‌లో వస్తాడు. రూట్ ఎండ్ అయిపోవడంతో నిన్ను షూట్ చేస్తా అని గన్ తీసి నా మిథున వెళ్లిన రూట్ ఇది కాకపోతే నన్ను కాల్చేయ్ అని అన్నావ్ కదా అందుకే కాల్చేస్తా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!