Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున మిస్సింగ్ డ్రామా ఇంకా కొనసాగుతుంటుంది. మిథున కోసం దేవా వెతుకుతూ ఉంటాడు. ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటారు. బేబీ ఇంటికి పోలీసులు వస్తారు. అపర్ణ దాస్‌ని చూసి హరివర్దన్ పరుగులు తీసి నా కూతురి గురించి తెలిసిందా అని అడుగుతారు. దానికి అపర్ణ అది తేల్చడానికే ఇచ్చాను సార్ అని దేవాని పిలిపించమని సత్యమూర్తితో చెప్తుంది.
మిథునని వెతకడానికి వెళ్లిన దేవా ఇంటికి వస్తాడు. అపర్ణ దాస్ దేవా కాలర్ పట్టుకొని పదరా స్టేషన్‌కి అని అంటుంది. నా మనవడు ఏం తప్పు చేశాడమ్మా అని బేబీ అడిగితే మిథున మిస్సింగ్‌కి ఇతనే కారణం అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. బామ్మ, శారద అందరూ పోలీస్‌ని బతిమాలుతారు. బేబీ అపర్ణతో మిథునతో కలిసి సంతోషంగా వచ్చాడమ్మా తను ఎందుకు అలా చేస్తాడు అంటే దానికి అపర్ణ వీళ్లు సంతోషంగా వచ్చారా వాళ్ల పెళ్లి నుంచి ఇక్కడికి వరకు అంతా నాకు తెలుసు.. ఇక్కడైతే ఎవరికీ తెలీకుండా మిథునని వదిలించుకోవాలని ఈ దేవా వచ్చాడు అని అపర్ణ అంటుంది. పక్కా ఎవిడెన్స్‌తో ఉన్నాను ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడని జీవితాంతం జైలే గతి అని తీసుకెళ్తుంది.
త్రిపుర మనసులో ఓరేయ్ దేవా ఇక నీ చాప్టర్ క్లోజ్‌రా ఇక మిథున ఎక్కడున్నా తీసుకెళ్లి నా తమ్ముడితో పెళ్లి చేయడమే అని అనుకుంటుంది. మిథునని లాయర్ ఆదిత్య తీసుకెళ్లుంటాడు. మిథున మత్తులో పడుకొని ఉంటే ఎదురుగా కూర్చొని ప్రేమ.. ఈ మాట చాలా కూల్‌గా ఉంటుంది కానీ ఇందులో ఉన్నంత వైలన్స్ ఇంకెందులోనూ లేదు.. అందుకే ఈ లోకంలో ప్రేమ కోసం భయంకరమైన యుద్దాలు జరిగాయి. కొన్ని సార్లు ప్రేమించిన వాళ్లని దగ్గరకు తీసుకోవడానికి మనలోని రాక్షసుల్ని బయటకు తీస్తుంది. నువ్వు నాకు దూరం అవుతావని భయం నాతో ఇలా చేయించింది. నువ్వు ఛాలెంజ్‌లో గెలిస్తే నాకు శాశ్వతంగా దూరం అయిపోతావు. నువ్వు నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం.. నువ్వు ఇక్కడున్న విషయం కనిపెట్టడం ఆ దేవా వల్ల కాదు కదా ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఇక నువ్వు నా భార్య అవకుండా ఆపడం ఆ దేవా వల్ల కాదు ఆ దేవుడి వల్ల కూడా కాదు మిథున ఆదిత్య గాడి భార్య అని అరుస్తాడు.
అపర్ణ దేవాని పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తుంది. దేవా మిథునని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచోడో చెప్పిన వరకు మన ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తుంది. దేవాని పోలీసులు చితక్కొడతారు. త్రిపుర అత్తామామలతో ఇప్పుడు మీకు అర్థమైందా ఆ దేవా బాగోతం తెలిసిందా అని అడుగుతుంది. ఇక లలితతో అయితే మీరు వాడిని అల్లుడిగా ఒప్పుకొని నల్లపూసలు వేయించారు.. వాడు అసలే కరుడు కట్టిన రౌడీ మిథునని చంపేసుంటాడేమో అంటుంది. శారద వచ్చి నా కొడుకు మీద అలాంటి నింద వేయొద్దని అంటుంది. దానికి త్రిపుర నీ కొడుకు రౌడీనే వాడికి మర్డర్‌లు చేయడం కొత్తా అని అడుగుతుంది. వాడు తప్పులు చేయొచ్చు కానీ తప్పుడు మనిషి కాదు అని అంటుంది. మిథున ఎక్కడున్నా దేవానే కాపాడుకొని తీసుకొస్తాడు దేవా మీద మీరు వేసిన నింద తప్పు అని తెలుసుకుంటారు కాస్త ఓపికపట్టండి చాలు అని అంటుంది.
అపర్ణ దేవాని కొడుతూ ఏం క్రిమినల్ మైండ్‌రా నీది.. ఏం ప్లాన్ చేశావురా.. డబ్బు కోసమేనా ఇలా ప్లాన్ చేసింది చెప్పురా అని కొడుతుంది. నిజం చెప్పే వరకు ఇక్కడ నుంచి బయటకు వెళ్లలేవు అని అంటుంది. నిన్ను చంపి అయినా సరే నీ శవంతో నిజం చెప్పిస్తా ఏం చేశావ్ చెప్పురా చంపేశావా అని అంటే దానికి దేవా తను నా భార్య.. నా భార్య మేడం అని అరుస్తాడు. దేవా మాటలకు ఎక్కడో ఉన్న మిథున లేస్తుంది. మిథున నేను తాళి కట్టిన నా భార్య అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: షాకింగ్.. విహారి కిడ్నాప్.. నడి రోడ్డు మీద కారు.. అర్థరాత్రి ఏం జరిగింది?