Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిధునతో తన మనసు మారదని కరుడు కట్టిన హృదయం అని బంగారం లాంటి జీవితం వదులు కొని తన కోసం ఇలా ఎదురు చూడటం వేస్టని చెప్తాడు. నిజంగా నీ గుండె మొద్దుబాయిపోయి ఏంటే నీ కుటుంబం మీద ఇంత ప్రేమ చూపించవని అంటుంది. దానికి దేవా వాళ్లు వేరు నువ్వు వేరని అంటాడు.
మిధున: కానీ నా అనుకునే వాళ్ల మీద చూపించే ప్రేమ ఒకటే. నువ్వు పైకి నీ గుండె బండరాయిలా మారిపోయినట్లు కనిపిస్తావ్ కానీ నీ మనసులో జాలి ఈ ఇంట్లో ఎవరికీ తెలీదు. చూస్తూ ఉంటూ నీ మనసులో నాకు త్వరలోనే భార్య స్థానం లభిస్తుంది. నా అనుకొనే నీ వాళ్ల దృష్టిలో నేను మొదటి వరసలో ఉంటాను.దేవా: అది జరగని పని. ఈ పెళ్లాం అనే పదం నా లైఫ్‌లోకి రానివ్వకూడదని ఎప్పుడో నేను డిసైడ్ అయిపోయా.మిధున: జరుగుతుంది. నువ్వు కట్టిన ఈ తాళే నిన్ను ఆ బంధంలోకి అడుగు పెట్టేలా చేస్తుంది. దేవా: అది అసాధ్యం అందుకే నీ మంచి కోరి నీకు మళ్లీ మళ్లీ చెప్తున్నా విను. ఏదో నీ మెడలో ఈ తాళి కట్టానని వచ్చావ్ కానీ నా మీద నీకు ఎలాంటి ఇష్టం లేదు. పోనీ మన మధ్య ఏమైనా ప్రేమ ఉందా అంటే అదీ లేదు. మరి ఇదంతా ఎందుకు చెప్పు. నువ్వు పస్తులున్నా.. నేల మీద పడుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే నా మాట విని నీ కోసం ఎదురు చూస్తున్న బంగారం లాంటి లైఫ్‌లోకి వెళ్లిపో. ఆ లాయర్ ఆదిత్య అతను నీ కోసం ఇప్పటికీ పడి చస్తున్నాడు. వెళ్లు ఆయన్ను పెళ్లి చేసుకో. నువ్వు బాగుంటావ్ మేం కూడా ప్రశాంతంగా ఉంటాం. దయచేసి నువ్వు వెళ్లిపోతావ్ అనుకుంటా. మిధున వెళ్లను అని తలూపుతుంది.
ఉదయం మిధున అన్నయ్య, వదినలు రాహుల్, త్రిపురలు దేవాకి కాల్ చేసి ఓ చోటకి రమ్మని పిలుస్తాడు. దేవా రాను అని చెప్తే పెద్ద సెటిల్ మెంట్ త్వరగా రా అని అంటాడు. త్వరగా వస్తే నీకు ఇక నాతో, నా చెల్లితో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే దేవా వస్తాను అంటాడు. మరోవైపు మిధున పంపు దగ్గర నీరు తీసుకు రావడానికి వెళ్తుంది. భాను అక్కడికి వస్తుంది. మిధున బిందెను తన్నేస్తుంది. ఏయ్ అని మిధున అరిస్తే భాను మిధున ముఖం మీద చిటికెలు వేస్తూ బస్తీ నాది అరిస్తే సాల్తీ లేచిపోతుందని అంటుంది. దాంతో మిధున ఎందుకు అలా చేశావ్ అని అడుగుతుంది.
మిధున: ఆర్ యూ మ్యాడ్.భాను: అవును నేను పాగల్ దాన్నే. పాగల్ దాన్నే. నా రాజాని ప్రేమించడంలో పాగల్ దాన్నే. కానీ నువ్వు మా ఇద్దరి మధ్యలోకి వచ్చి నన్ను ఇంకా పాగల్ దాన్ని చేస్తున్నావ్.మిధున: ఏయ్ మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు. నేను మీ ఇద్దరి మధ్యలోకి రావడం ఏంటి. నువ్వే మా భార్య భర్తల మద్యలోకి వస్తున్నావ్.భాను: ఏయ్ చుప్ ఇంకొక్క సారి ఆ మాట అన్నావ్ అంటే ఐపోతావ్. ఏయ్ మోడ్రన్ పిల్లా ఈ జన్మకి దేవా భార్యని నేనే. మిధున: ఇంకో సారి దేవాకి భార్యని అన్నావ్ అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. పరాయి అమ్మాయి భర్తని నువ్వు భర్త అంటుంటే నాకు అసహ్యంగా ఉంది. ఎండ్ వన్ మోర్ థింగ్ దేవా నాకు తాళి కట్టినందుకు ఈ జన్మకి నేను తన భార్యని. భాను: ఎలాంటోడిని మొగుడిగా చేసుకోవాలో నీకు తెలీదా. దేవా ఓ రౌడీ ఈ బస్తీలో చిన్న పోరగాడిని అడిగినా ఆ మాట చెప్తాడు. మిధున: దేవా ఎవరికీ నచ్చడా అతను అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా అయితే నువ్వు ఎలా ప్రేమించావ్.భాను: మనసులో నేను దీనికి ఏదో చెప్పి పంపేద్దాం అంటే ఇది నాకే ఇరికించేస్తుంది. ఇది బాగా ఖతర్నక్‌ది.మిధున: చెప్పు దేవాని ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావ్.భాను: మేం ఇద్దరం మాస్ కాబట్టి మాకు సెట్ అవుతుంది. నువ్వు మర్యాదగా నా దేవాని వదిలేసి వెళ్లిపో. మిధున: ఒకమ్మాయి మాస్ అయినా క్లాస్ అయినా అబ్బాయి మంచి వాడు కాకపోతే ప్రేమించదు. నువ్వు 13 ఏళ్ల వయసు నుంచే దేవాని ప్రేమిస్తున్నావ్ అన్నావ్. దేవా మంచి వాడు అని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి.భాను: దేవుడా దీన్ని ఎలా వదిలించువాలి.
దేవా రాహుల్ దగ్గరకు వస్తాడు. నా చెల్లి నాకు కావాలి.. మెడలో తాళి తీసేసి రావాలి అంటాడు. దానికి దేవా నేను ఏమైనా అడ్డుకున్నానా మీరు తనని తీసుకెళ్లిపోతే నాకు హ్యాపీ అంటాడు. మా చెల్లిని మా ఇంటికి పంపేస్తే నీకు ఎంత కావాలి అంటే అంత ఇస్తామని అంటారు. తాము చెప్పినట్లు చేస్తే కోటి ఇస్తామని డబ్బు దేవాకి ఇస్తారు. అది త్రిపుర వీడియో తీస్తుంది. బ్రహ్మాస్త్రం దొరికిందని త్రిపుర అంటుంది. ఇక దేవా చిన్న అన్న వదినలు రీల్స్ తీసుకుంటూ ఉంటారు. మిధున కడుపు మాడ్చితే ఈ ఇంటి నుంచి వెళ్లిపోతుంది అనుకుంటే రోజు రోజుకి పాతుకుపోతుందని అది ఇంట్లో ఉంటే మనం దాచిన డబ్బు, నగలు కొట్టేస్తుందని అంటుంది. ఇక దేవా డబ్బు బ్యాగ్‌తో ఇంటికి వస్తాడు. దేవా దాన్ని తీసుకెళ్లి మిధున చేతిలో పెట్టి కోటి రూపాయలు తీసుకో మీ అయ్య నీకు కట్టిన రేటు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపకి 50.. కార్తీక్‌కి 50.. దీపతో జ్యోత్స్న బేరం.. కూతిరి కోసం జ్యో కండీషన్‌కి దీప ఒప్పుకుంటుందా!