Nuvvunte Naa Jathaga Serial Today Episode రెండు జంటలు పెళ్లి పీటల మీద కూర్చొంటారు. పెద్దవాళ్లు జంటల్ని చూసి మురిసిపోతారు. దేవా డల్‌గా ఉండటం చూసి భాను ఎందుకు అలా ఉంటావ్ రాజా నువ్వు నవ్వితే చాలా బాగుంటావ్.. పెళ్లి అయిన తర్వాత నుంచి నేను నిన్ను ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాను అని అంటుంది. ఇక రెండు జంటలకు పెళ్లి బట్టలు ఇస్తారు. 

Continues below advertisement

దేవాకి బట్టలు ఇచ్చేటప్పుడు బేబీ బామ్మ కావాలనే తుమ్మి పెళ్లి ఆపండి అపశకునం తుమ్మితే శుభకార్యం చేయకూడదు అని అంటుంది. కావాలని తమ్మితే ఏం పట్టించుకోనవసరం లేదు అని కాంతం అంటుంది. ఇక బేబీ బామ్మ కావాలనే నా తుమ్ము చాలా పవర్ ఫుల్ కచ్చితంగా పెళ్లి ఆపేయండి అని వాధిస్తుంది. మీకు తుమ్ము ఎందుకు వచ్చిందో మాకు తెలుసు మీరు వెళ్లి కూర్చొండి అని శారద అంటుంది. ఇక సత్యమూర్తి అయితే ఏది ఏమైనా ఈ పెళ్లి ఆగే ప్రసక్తే లేదు ఈ పెళ్లి కచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్తాడు. చేసేది ఏం లేక బామ్మ వెళ్లి కూర్చొంటుంది. 

రెండు జంటలు బట్టలు మార్చుకోవడానికి వెళ్తారు. మిథున దేవా ఒకరికి ఒకరు ఎదురు పడి చూసుకుంటారు. వెళ్తూ వెళ్తూ కూడా వెనక్కి తిరిగి చూసుకుంటారు. దేవా రెడీ అయి మిథున కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో బేబీ బామ్మ అక్కడికి వచ్చి దేవా చేయి పట్టుకొని పక్కకి తీసుకెళ్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ నానమ్మా అని దేవా అడిగితే నువ్వు చాలా మంచి పని చేశావురా.. మిథునని వదిలేసి మంచి పని చేశావ్.. నీ జీవితంలో నుంచి ఆ మిథునని తరిమేసి చాలా మంచి పని చేశావ్‌రా.. ఆ మిథున ఓ ఊసరవెళ్లిరా.. వగలాడిరా.. నువ్వు కట్టిన తాళి కోసం వచ్చానని చెప్పిందిరా.. తన ప్రేమ నిజమని నమ్మి గుడ్డిగా మోసపోయానురా.. ఆ మాయలాడి నువ్వు బలవంతంగా తాళి కట్టినా నీ కోసం వచ్చేశానని చెప్పిందిరా..ఈ కాలంలో కూడా తాళికి ఇంత విలువ ఇచ్చేవాళ్లు ఉంటారా అని అనుకున్నా నా మనవడికి దేవత లాంటి భార్య వచ్చిందని అనుకున్నారా  కానీ తను నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చిందిరా.. అందుకే నీ మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందిరా.. నువ్వే కాదురా నేను పెళ్లి చేసుకోగలను అని ఛాలెంజ్ చేసినట్లు ఇదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటుంది..ఏం బతుకురా దాన్ని అది దాని సిగ్గులేని బతుకు థూ అని తిడుతుంది. 

Continues below advertisement

దేవా కోపం నానమ్మా మిథున కోసం ఇంకోక్క మాట తప్పుగా మాట్లాడితే నానమ్మ అని చూడను గొంతు నలిపి చంపేస్తా.. మిథున గురించి నీకు ఏం తెలుసు.. బంగారం తను.. తను మన ఇంటికి వచ్చింది పగతో కాదు నేను కట్టిన తాళి కోసం.. నేనేమైనా ఆస్తి పరుడినా.. మంచోడినా.. గుణ వంతుడినా.. పోనీ అందగాడినా.. కానీ అవేమీ చూడకుండా నేను కట్టిన తాళి కోసం వచ్చేసింది. తన ఇంట్లో ఓ రాజకుమారిగా బతికింది కానీ నా కోసం మన ఇంటి ముందు వర్షంలో నిలబడింది.. గుడిలో ప్రసాదం తింటూ.. కటిక నేల మీద పడుకొని పడరాని కష్టాలు పడింది. నేను తనని ప్రతీ క్షణం అసహ్యించుకున్నా.. ఇంట్లో వాళ్ల పచ్చి మంచినీళ్లు ఇవ్వకుండా టార్చర్ చేసినా భరించింది.. కానీ గుమ్మం దాటలేదు.. అసలు నేను ఈరోజు ఇలా మీ ముందు ఉన్నాను అంటే దానికి కారణం మిథున.. మిథున ఎంత గొప్పదో తెలుసా.. ఒకమ్మాయి నా మీద రేప్ కేస్ పెట్టినా ఊరు మొత్తం నమ్మినా నా భర్త తప్పు చేయడు అని నా వైపు నిలబడింది మిథున.. కాలికి బులెట్ గాయం తగిలి నేను చావు బతుకుల మధ్య ఉంటే చస్తే చావని అని వదిలేయకుండా తనకు ప్రాబ్లమ్ అవుతుందని తెలిసినా నన్ను కాపాడింది.. తన ఇంట్లో పెట్టుకొని సేవలు చేసింది.. మిథున ఎంత గొప్పది కాకపోతే ఇంత చేస్తుంది చెప్పు అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.