Nuvvunte Naa Jathaga Serial Today February 9th: నువ్వుంటే నా జతగా: తండ్రీకొడుకుల్ని కలపడానికి మిథున, బేబీ బామ్మల నాటకం! కాంతానికి తెలిస్తే!
Nuvvunte Naa Jathaga Serial Today February 9th Episode: దేవా, సత్యమూర్తి కలవాలి అని బేబీ బామ్మకి గుండెపోటు వచ్చినట్లు మిథున, బామ్మ నాటకం ఆడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode : సత్యమూర్తి ఫ్యామిలీ మొత్తం బేబీ బామ్మకు హార్ట్ అటాక్ వచ్చిందని వెళ్తారు. బేబీ బామ్మని సంతోషంగా చూసుకోవాలి.. షాకింగ్ విషయాలు చెప్పకూడదు అని డాక్టర్ హెచ్చరిస్తారు. బామ్మ అందరినీ చూసి ఈ విధంగా అయినా నా దగ్గరకు వచ్చారు.. సంతోషం అని చెప్పి అందరినీ చూసి అందరూ వచ్చారు.. దేవా, మిథున ఎక్కడ అని అడుగుతుంది. వాళ్లు రారు కదా అని కాంతం అంటే ఏమైంది.. ఎందుకు రారు అని బేబీ టెన్షన్ పడుతూ అడుగుతుంది.
సత్యమూర్తితో నువ్వు నా మనవరాలిని, మనవడిని గెంటేశావా.. వాళ్లు మీతో లేరా అని అడుగుతుంది. అంతా తెలిసినట్లే మాట్లాడుతుందని కాంతం అంటుంది. చెప్పరా అని బామ్మ అడిగి గుండెనొప్పి అని అంటుంది. అలాంటిది ఏం లేదు అని శారద అంటే మరి నన్ను చూడటానికి ఇద్దరూ ఎందుకు రాలేదు అని అడుగుతుంది. ఇంతలో దేవా మిథున వస్తారు. పాప చూసి బాబాయ్, పిన్ని వచ్చారని చెప్తుంది. దేవా మిథున దూరంగా నిల్చొని ఉంటారు. వాళ్లు ఎందుకు రావడం లేదు.. ఏదో జరుగుతుందని నాకు అర్థమవుతుందని బామ్మ గుండె పట్టుకుంటుంది. ఏం జరగడం లేదు మీరు టెన్షన్ పడొద్దని శారద అంటే అయితే నీ కొడుకు కోడల్ని పిలవరా అని చెప్తుంది. శారద కూడా చెప్పడంతో తల్లి గురించి ఆలోచించి సత్యమూర్తి దేవా మిథునల్ని రమ్మని అంటాడు. మిథున, దేవా వచ్చి మాట్లాడటంతో బామ్మ చాలా సంతోషపడుతుంది.
కాంతం బేబీ గదిలోకి దూరం మొత్తం వెతికేస్తూ ఉంటుంది. ఇంతలో రంగం రావడంతో నాకేం తెలీదు నాకేం తెలీదు అని భయపడిపోయి భర్తని పట్టుకొని చితక్కొట్టేస్తుంది. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగితే డబ్బు కోసం వెతుకుతున్నా అని అంటుంది. మరోవైపు దేవా మిథునతో తన బాధ, సంతోషం పంచుకుంటాడు. ఆ దేవుడు నా కోసం ఇలా అయినా నేను నాన్న వాళ్లతో కలిసి ఉండాలని చూశాడు.. అని అంటాడు. చూస్తూ ఉండు దేవా ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేలోపు నువ్వు మీ వాళ్లతో కలిసిపోతావని మిథున దేవాకి ధైర్యం చెప్తుంది. బేబీ బామ్మ పనివాడితో చెప్పి లడ్డూలు, సున్నుండలు ఇలా అన్నీ స్వీట్స్ లాగించేస్తుంది. అప్పుడే అక్కడికి మిథున వచ్చి చూస్తుంది. బేబీ అని అరుస్తుంది. మీరు ఇలా స్వీట్స్ తినడం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా.. మీకు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందని అనుమానపడరా అని అడుగుతుంది. బామ్మ దగ్గర స్వీట్స్ తీసుకుంటుంది. మొత్తానికి మిథున, బామ్మ కలిసి దేవాని తండ్రితో కలపడానికి హార్ట్ అటాక్ నాటకం ఆడుతారు. మిమల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అమ్మమ్మా అని మిథున చెప్తే మీ అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉండటం కోసం నాటకం ఆడటం ఏంటే అవసరం అయితే నా ప్రాణాలు కూడా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తా అని బామ్మ అంటే అలా అనొద్దు అని మిథున ఏడుస్తుంది.
బామ్మ, మిథున మాట్లాడుకోవడం ప్రమోదిని చూసేస్తుంది. మిథున ప్రమోదినిని పక్కకి తీసుకెళ్లి ఇదంతా నువ్వు అమ్మమ్మ కలిసి ఆడుతున్న నాటకమా అని అడుగుతుంది. అవును అక్క ఇదంతా తప్పు అని తెలుసు కానీ తప్పడం లేదు అని మిథున చెప్తుంది. దేవా తన కుటుంబానికి దూరం అవ్వకుండా చేయడానికి ఆ పరిస్థితిలో నాకు ఇంత కంటే మంచి దారి కనిపించలేదు అని మిథున చెప్తుంది. నేను మీకు సపోర్ట్ చేస్తా అని ప్రమోదిని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























