Nuvvunte Naa Jathaga Serial Today February 7th: నువ్వుంటే నా జతగా: దేవా వర్సస్ సత్యమూర్తి! కంట నీరు పెట్టించిన దేవా! బామ్మకు గుండెపోటు!
Nuvvunte Naa Jathaga Serial Today Episode February 7th దేవా తండ్రితోనే ఉంటా అని ఇంటికి వెళ్లడం నువ్వు ఉంటే నేను చచ్చిపోతా అని సత్యమూర్తి అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode రంగాన్ని సత్యమూర్తి లాగి పెట్టి కొడతాడు. నువ్వు చేసిన మోసం నాకు తెలీదు అనుకుంటున్నావా.. నిన్ను అందరి ముందు చెంప పగలగొట్టేవాడినిరా కానీ అలా చేస్తే నా కొడుకు మోసగాడు అని నేనే చెప్పినట్లు అవుతుందని ఊరుకున్నాను.. నువ్వు వాళ్లందరి డబ్బులు కొట్టేసి ఇళ్లు కొన్నట్లు ఆ బిల్డర్ నాకు ఎప్పుడో చెప్పాడు అని సత్యమూర్తి చెప్పగానే కాంతం, రంగం నోరెళ్ల బెడతారు. మిగతా అందరూ షాక్ అయిపోతారు.
బిల్డర్‌కి వెంటనే ఫోన్ చేయ్ అని సత్యమూర్తి అంటాడు. దాంతో రంగం వెంటనే ఫోన్ చేస్తాడు. సత్యమూర్తి బిల్డర్ దామోధర్‌తో మాట్లాడి ఇళ్లు ఇప్పుడు వద్దు అనుకుంటున్నాం.. డబ్బు తిరిగి ఇచ్చేయండి అని అడుగుతాడు. బిల్డర్ సరే అనడంతో ఆనంద్‌ని పంపిస్తానని చెప్తాడు. కాంతం, రంగం ముఖాలు మాడ్చుకుంటారు. దేవా తండ్రి మాటలు గుర్తు చేసుకొని బాధ పడుతూ ఉంటాడు. మిథున దేవాతో మీ రంగం అన్నయ్య మోసం చేసిన విషయం మీ నాన్నకి చెప్పుంటే సరిపోయేది నువ్వు ఎందుకు గొడవ పడ్డావు అని అడుగుతుంది. దానికి దేవా మా నాన్నకి ఎవరైనా అవమానిస్తే ఎలా చూస్తూ ఉండాలి.. అవతల వాడు మా అన్న అయినా సరే వదిలేదు లేదు.. ఇందాక జరిగింది కూడా అదే.. కానీ నా ఖర్మ ఏంటి అంటే మా నాన్న మీద ఉన్న ప్రేమని నేను చూపిస్తే ఆయనకు రౌడీయిజంగానే కనిపించింది అని అంటాడు.
మిథున దేవాతో నీ కోపంలో అర్థం ఉంది కానీ చూశావా నీ కోపం వల్ల మామయ్య మనల్ని ఇక్కడ కూడా ఉండొద్దని చెప్పారు.. ఇప్పుడు జరిగినదాని వల్ల మనం ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాల్సి వచ్చింది.. పరిస్థితి మన చేయి జారిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు అని అడుగుతుంది. దేవా బాగా ఆలోచించి మిథునతో సర్దేయ్.. లగేజ్ మొత్తం సర్దేయ్ అని బ్యాగ్ రెడీ చేస్తాడు. మిథున దేవాని వద్దని ఇక్కడ నుంచి వెళ్లొద్దు అంటుంది. ఏం చెప్పొద్దు మిథున లగేజ్ సర్దేయ్ అంటాడు. మనం ఎక్కడుండాలో.. ఎక్కడ ఉంటే కరెక్టో అక్కడే ఉందాం.. అలాంటి చోటే ఉందాం అని మిథున చేయి పట్టుకొని సత్యమూర్తి ఇంటికి వెళ్తాడు.
సత్యమూర్తి దేవాని చూసి ఆగు అని అరుస్తాడు. దేవా ఆగుతాడు. నా ఇంట్లోకి ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. ఇక నుంచి ఇక్కడే ఉంటాను నాన్న అని దేవా అంటాడు. నోర్మయ్ ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించొద్దు అన్నా మరి నా ఇంట్లో ఉంటాను అని చెప్పడానికి నీకు ఎంత ధైర్యంరా అని అడుగుతాడు సత్యమూర్తి.. మీ కొడుకుగా నాకు హక్కు ఉంది అని దేవా అంటాడు. నా కొడుకుగా నీకు ఎప్పుడో నీళ్లు వదిలేశా మరి నీకు హక్కు ఎక్కడిది మర్యాదగా బయటకు వెళ్లు అంటాడు. సరే నాన్న మీరు అన్నట్లు నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు అంటే (రంగాని చూపించి) వీడికి కూడా ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు వాడిని తరిమేయండి అప్పుడు నేను పోతా అంటాడు. నేను ఎందుకురా అని రంగం అడిగితే రౌడీయిజం చేసి నాన్న పరువు తీశాను అనే కదా.. నన్ను గెంటేసింది.. మరి నువ్వు కూడా జనాల డబ్బు కొట్టేసి నాన్న పరువు తీశావ్.. అంటే నీకు హక్కు లేదు కదా అంటాడు. తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా అని సత్యమూర్తి దేవాని అడిగితే లేదు నాన్న నేను ఈ ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఉందని తెలుసుకొని మాట్లాడుతున్నా.. మొన్నటికి మొన్న వీడు ఈ ఇంటిని అమ్మేయాలి అనుకున్నాడు.. ఇప్పుడు జనాల సొమ్ము కొట్టేసి అందరూ ఇంటి మీదకి గొడవకు వచ్చేలా చేశాడు.. ఇక్కడ నేను లేకపోతే మీ పక్కన లేకపోతే వీడు నిన్ను రోడ్డు మీదకు లాగేస్తాడు.. అందుకే నేను ఇక్కడే ఉంటా అని దేవా అంటాడు.
సత్యమూర్తి కోపంగా ఇంకొక్క క్షణం నువ్వు ఇక్కడే ఉంటే నా శవం కళ్లచూస్తావ్ మర్యాదగా బయటకు వెళ్లు.. లేదంటే నా చావుకి నువ్వే కారణం అవుతావ్ అని అంటాడు. దేవా ఎమోషనల్ అవుతూ బాధేస్తుంది నాన్న.. నేను రౌడీగా ఉన్నప్పుడు మీరు ద్వేషించారు.. మారిన తర్వాత కూడా ద్వేషిస్తున్నారు. మీరు రోడ్డున పడకూడదు అని నేను పడుతున్న తపన మీరు అర్థం చేసుకోవడం లేదు నాన్న.. మిమల్ని వదిలేసి వెళ్లడం అంటే నేను నా ప్రాణం వదిలేసి వెళ్లడమే.. అయినా మీ చావుకి నేను కారణం అవుతాను అన్నారు చూడండి ఆ ఒక్క మాట కోసం సముద్రం అంత దుఃఖాన్ని మోస్తూ ఈ గుమ్మం దాటుతున్నా.. పద మిథున అని దేవా మిథునని తీసుకొని వెళ్లిపోవాలి అనుకుంటాడు. నాన్న నేను ఎక్కడున్నా నా ప్రాణం ఇక్కడే ఉంటుంది అని అంటాడు.
దేవా ఇంటి నుంచి వెళ్లే టైంకి ఆనంద్‌కి బేబీ బామ్మ ఫోన్ చేస్తుంది. సత్యమూర్తి మాట్లాడి షాక్ అయిపోతాడు. ఎప్పుడు ఏమైంది.. ఇప్పుడు ఎలా ఉంది అని అంటాడు. ఏమైందని అందరూ అడిగితే అమ్మకి హార్ట్ అటాక్ అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. వెంటనే వస్తున్నాం అని చెప్పి సత్యమూర్తి చాలా ఏడుస్తాడు. మిథున, దేవా తప్ప అందరూ బేబీ బామ్మ ఇంటికి వెళ్తారు. డాక్టర్ బామ్మకి ట్రీట్మెంట్ చేస్తారు. నా చుట్టూ నా వాళ్లు ఎవరూ లేరు ఒంటరి అయిపోయా అనే బాధలో ఉన్నారు అందుకే హార్ట్‌అటాక్ వచ్చింది.. అందుకే మీరంతా నాలుగు రోజులు ఆవిడతో గడపండి అని చెప్తారు. తనకి బాధ కలిగించే షాక్ అయ్యే విషయాలు ఆవిడకు చెప్పకండి అని అంటారు. సత్యమూర్తి ఎమోషనల్‌గా తల్లితో మాట్లాడతాడు. ఏ పండగ అయినా పబ్బం అయినా ఇంత పెద్ద కుటుంబం ఉన్నా మీరు నాతో ఉండటం లేదు కదా.. నా ప్రాణం మీకు వచ్చింది అంటే మీరు నా కోసం రాలేదు.. అలా వచ్చుంటే నాకు పరిస్థితి వచ్చేది కాదు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























