Nuvvunte Naa Jathaga Serial Today February 19th: నువ్వుంటే నా జతగా: మిథున, దేవాల మాస్టర్ ప్లాన్! భూపతి చేతిలో తన్నులు తిన్న కాంతం, రంగం!
Nuvvunte Naa Jathaga Serial Today Episode February 19th మిథున దేవా భూపతి ఇంటికి వెళ్లి కార్డు ఇచ్చి షష్టిపూర్తికి పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా, మిథున ఇద్దరూ భూపతి ఇంటికి కార్డులు తీసుకొని వెళ్తారు. భూపతి మామయ్య అని దేవా పిలుస్తాడు. భూపతి కోపంతో మొదటి సారి నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టినందుకే నిన్ను చంపేయాలి అనుకున్నా రెండో సారి అడుగు పెట్టడానికి ఎంత ధైర్యంరా అని అడుగుతాడు. మా అమ్మానాన్నల షష్టిపూర్తి వేడుకకు మిమల్ని రమ్మని మాటలతో చెప్పాను.. ఇప్పుడు గౌరవంగా కార్డు ఇచ్చి పిలుద్దాం అని వచ్చాను అని కార్డు ఇచ్చి కుటుంబ సమేతంగా రావాలి అని పిలుస్తాడు.
దేవా ఇచ్చిన కార్డు భూపతి చింపేస్తాడు. దేవా నువ్వుతూ మళ్లీ ఇస్తాడు. మళ్లీ భూపతి చింపేస్తాడు. దేవా ఇస్తూనే ఉండటంతో నేను చింపేస్తూ ఉంటే కార్డు మీద కార్డులు ఇస్తూ నాతో ఆటలు ఆడుతున్నావా.. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటాడు. ఇందాక చంపేస్తా అన్నావ్,. ఇప్పుడ మర్యాద అన్నావ్.. ఇంతలోనే అంత మార్పు ఏంటి మామయ్య.. కోపం కూడా అంతే అదే పనిగా ఎదుటి వాళ్ల మీద ప్రేమ చూపిస్తే ఏదో ఒక చోట మారుతుంది అని అంటాడు. భూపతి చిరాకు పడుతూ ఉంటే దేవా, మిథునలు నవ్వుతూ మాట్లాడుతారు. మీరందరూ తప్పకుండా మీరంతా రావాలి అని చెప్పి అక్కడే కార్డు పెట్టి బయల్దేరుతారు. ఇంతలో దేవాకి ఫోన్ వస్తుంది. దేవా మాట్లాడుతూ ఏంటి మర్డర్ చేయాలి.. నేను రౌడీయిజం మానేసి చాలా రోజులు అయింది..ఇప్పుడు అవేమీ చేయడం లేదు.. కానీ లోపల రౌడీ బాయ్ అలాగే ఉన్నాడు అని చెప్పి ఫోన్ కట్ చేసి వెళ్లిపోతాడు. దేవాని చూసి అందరూ భయపడతారు. మీరంతా తప్పకుండా రావాలి వస్తారు అని దేవా చెప్పి వెళ్లిపోతారు.
కాంతం, రంగం ఇద్దరూ ఎదురింటిని చూస్తూ దేవా మిథునలు దెబ్బలు తిని వస్తారు అని రంగం, నార్మల్గా వస్తారు అని కాంతం ఇద్దరూ పదివేలు పందెం కాస్తారు. తీరా చూస్తే మిథున దేవా ఇద్దరూ నవ్వుతూ వస్తారు. రంగం నోరు తెరిచి చూస్తాడు. కాంతం తాను గెలిచాను అని డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. వీడేంటి అందర్ని ఇలా మడత పెట్టేస్తున్నాడు.. ఇది వీడి టాలెంట్ కాదు అంతా మిథున టాలెంట్ అని రంగం అంటాడు. దేవా మిథునతో అంతా నీ సలహానే కత్తితో చేయనిది కలంతో చేయొచ్చని నిరూపించావ్ సూపర్ అంటాడు. దేవా గదిలో ఉంటే మిథున వెళ్లి హగ్ చేసుకొని ఇంతకు ముందు కొంచెం నచ్చావ్ ఇప్పుడు పూర్తిగా నచ్చేశావ్ అని అంటుంది. అయితే గుర్తిండిపోయేలా ఏమైనా ఇవ్వు అని దేవా ముద్దు అడుగుతాడు. మిథున ఇవ్వదు.. హగ్ అయినా ఇవ్వమని అంటాడు. మిథున ఇవ్వను అనేసరికి బల్లి బల్లి అని భయపెట్టి మిథున హగ్ చేసుకునేలా చేస్తాడు.
కాంతం, రంగం భూపతి ఇంటికి వెళ్లి సత్యమూర్తి కొడుకు అని చెప్పకుండా పక్క ఊరి వాళ్లగా మాట్లాడుతూ దేవా గురించి చెడుగా చెప్తారు. ఊరిలో అందరికీ మీరు తనకి భయపడుతున్నారని.. దేవాకి మీరు వణికిపోతున్నారని అందరికీ చెప్తున్నారని అంటారు. ఇంతకీ మీరు ఎవరు అని భూపతి అడిగితే అక్కడే ఉన్న పని వాడు సత్యమూర్తి రెండో కొడుకు కోడలు అంటారు. దాంతో కాంతం, రంగం ఇద్దరూ బిత్తరపోతారు. ఇక మిథున, ఆనంద్, ప్రమోదినిలు బయట నిల్చొని ఉంటారు. భూపతి ఇంటి నుంచి రంగం, కాంతం ముఖానికి ముసుగు వేసుకొని రావడం చూసి అలా చూస్తూ ఉంటారు. ఇద్దరినీ ఆపి దొంగల్లా ముసుగులు ఏంటి తీయమని అంటారు. ఇద్దరూ తీయకపోవడంతో ప్రమోదిని కాంతం ముసుగు తీస్తే.. ఆనంద్ రంగం ముసుగు తీస్తాడు. ఇద్దరి ముఖాలు కందిపోయి ఉంటాయి.. అది చూసి మిథున వాళ్లు నవ్వుతారు. షష్టిపూర్తి జరగకూడదు అని కుళ్లుతో వెళ్లి ఏదో చేయాలి అని ఇలా ముఖాలు కమిలిపోయేలా కొట్టించుకొని వచ్చారన్నమాట అని మిథున అంటుంది. దానికి కాంతం నవ్వండి నవ్వండి రేపు షష్టిపూర్తి ఆగిపోతే మేం నవ్వుతాం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























