Nuvvunte Naa Jathaga Serial Today February 18th: నువ్వుంటే నా జతగా: షష్టిపూర్తికి తప్పని ఆటంకాలు! కాంతం ప్లాన్ తిప్పి కొట్టిన మిథున!
Nuvvunte Naa Jathaga Serial Today Episode February 18th మిథున భూపతిరాజు ఇంటికి వెళ్లిన విషయం బామ్మ, శారదలకు ప్రమోదిని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున భూపతిరాజు ఇంటికి వెళ్లి మేనకోడలిని తీసుకెళ్తుంది. నువ్వు ఎవరమ్మా దేవతలా నా కూతురిని తీసుకొచ్చావని పాప వాళ్ల అమ్మ అంటుంది. దానికి మిథున సత్యమూర్తి గారి చిన్న కోడల్ని అని చెప్పడంతో భూపతి రాజు ఆవేశంతో కత్తి తీసుకొచ్చి చంపేస్తా అని హడావుడి చేస్తాడు. భూపతి రాజుని చెల్లి ఆపి మిథునని వెళ్లిపోమని చెప్తుంది.
భూపతి రాజు ఆవేశపడుతుంటే చెల్లి అన్నతో.. ఏంటి అన్నయ్యా చంపేది.. నీ మేనకోడలు పెద్ద మనిషి అయి నడిరోడ్డు మీద కడుపు నొప్పితో అల్లాడిపోతుంటే మన మీద భయంతో ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు.. కానీ మనం ఆ ఫ్యామిలీ మీద పగతో రగిలిపోతున్నాం అని తెలిసి కూడా.. మన ఇంటికి పాపని జాగ్రత్తగా తీసుకొచ్చింది.. దేవతలాంటి ఆ అమ్మాయికి రెండు చేతులు పెట్టి నమస్కరించాలి అంతే కానీ ప్రాణం తీస్తా అంటావేంటి అని అంటుంది. భూపతిరాజు ఆలోచనలో పడతాడు.
ప్రమోదిని మిథున ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో శారద, బామ్మ వచ్చి ఏమైంది ఎందుకు టెన్షన్గా ఉన్నావ్ అని అడిగితే మిథున భూపతిగారి ఇంటికి వెళ్లిందని చెప్తుంది. బామ్మ, శారద ఇద్దరూ షాక్ అవుతారు. మిథున అప్పుడప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది. మొగుడు పెళ్లాలు ఇద్దరూ ఇద్దరే.. ఎవరి మాట వినరు అని శారద అంటుంది. ఇంతలో మిథున వస్తుంది. బామ్మ మిథునతో ఆ ఇంటికి ఎందుకు వెళ్లావమ్మా అని అడుగుతుంది. ఆ ఇంటి ఆడపిల్ల పెద్దమనిషి అయింది అని మిథున చెప్తుంది. బామ్మ చాలా సంతోషపడుతుంది. ఒకప్పుడు రెండు కుటుంబాల్లో ఏ శుభకార్యం జరిగినా.. అందరూ ఒకే ఇళ్లలో ఉండేవాళ్లు.. కానీ ఇప్పుడు విరోధం పెంచుకొని ఒకర్ని ఒకరు చంపుకునే స్థాయికి వచ్చేశాం.. ఈరోజు ఇంత మంచి వార్త చెప్పినా పెద్దిరకంగా వెళ్లి మంచీ చెడు చెప్తే స్థితిలో నేను లేకపోయాను అని బామ్మ ఏడుస్తుంది. మిథున బామ్మకి ధైర్యం చెప్తుంది. త్వరలోనే రెండు కుటుంబాలు కలుస్తాయి.. రెండు కుటుంబాలకు మీరే పెద్ద దిక్కు అని అంటుంది.
దేవా, ఆనంద్ ఇద్దరూ ఫంక్షన్ భోజనాలు కోసం వంట వాడితో మాట్లాడుతారు. వంట అతను భయంతో పంతులు పరిస్థితి చూస్తే మీ రెండు కుటుంబాల మధ్య ద్వేషం ఎంత ఉందో తెలిసింది. భూపతి గారి మాట కాదని నాతో పాటు ఎవరూ రారు.. ఈ విషయం చెప్పడానికే వచ్చా.. మీరు ఎవర్ని పిలిచినా రారు సార్ అని చెప్పేసి వెళ్లిపోతారు. ఇప్పుడేం చేస్తాం రా అని ఆనంద్ అంటే ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా నేను షష్టిపూర్తి జరిపించి తీరుతా.. ఎంత దూరం అయినా వెళ్తా అని అంటాడు. మరోవైపు కాంతం, రంగం ఇద్దరూ ఇంట్లో అందరినీ పిలిచి షష్టిపూర్తి ఇన్విటేషన్ కార్డు కొట్టించామని చదువుతాం వినండి అని చెప్తారు. సత్యమూర్తి, శారదల షష్టిపూర్తి మహొత్సవానికి ఆహ్వానిస్తున్న వాళ్లు అని పెద్ద కొడుకు పెద్దకోడలు, చిన్న కొడుకు చిన్న కోడలు అని ఆ నలుగురి పేర్లు మాత్రమే రాస్తారు. బామ్మ ఆపి దేవా మిథునల పేర్లు ఏవి అని అడుగుతుంది.
రంగం నానమ్మతో దేవాకి నాన్న నీళ్లు వదిలేశారు కదా ఇక వాడి పేరు కార్డు మీద ఎందుకు అని వేయించలేదు అని అంటాడు. బామ్మ రంగాన్ని ఒక్కటి కొట్టి నోర్ముయ్.. గొప్ప ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావ్.. సత్యం నీకు బుద్ధుందారా.. పిల్లల మీద కోపం ఇంకోలా చూపించాలి కానీ నీళ్లు వదిలేయడం ఏంట్రా.. చదువుకున్నావ్, చాలా మందికి చదువు చెప్పావ్ ,, ఇలాగేనా ప్రవర్తించేది అని అంటుంది. మిథున బామ్మని ఆపి ఆ క్షణంలో మామయ్యగారికి కోపం ఉండి అలా చేశారు.. కానీ ఆ కోపం ప్రతీ క్షణం అలా చూపించలేదు.. కార్డు మీద చిన్నకొడుకు చిన్న కోడలు పేర్లు వద్దనేంత ద్వేషం చూపించలేరు.. కానీ శ్రీరంగం బావ, కాంతం అక్క పెద్దగా చదువుకోలేదు కదా వాళ్లకి బుద్ధి లేదు అని అంటుంది. మిథున అందరితో మేం కార్డులు కొట్టించాం అని తాను కార్డు చదువుతుంది. అందులో అందరి పేర్లు ఉంటాయి. సూర్యకాంతం విన్నావు కదా కార్డు అంటే ఇలా ఉండాలి అని ప్రమోదిని అంటుంది. మిథునని ఏడిపించాలి అనుకుంటే రివర్స్‌లో నన్ను ఏడిపించింది..ఇప్పుడేం చేయాలి అని కాంతం అనుకుంటే అక్కడికి మిథున వెళ్లి చూస్తుంది. కార్డులో నాపేరు మా ఆయన పేరు లేకుండా చేసిన దిక్కుమాలిన ప్లాన్ నీదేనా అని కాంతాన్ని అడుగుతుంది. నాకేం తెలీదు అని కాంతం అంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీకు మామూలుగా ఉండదు అని మిథున వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























