అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today February 16th: నువ్వుంటే నా జతగా: దేవా సంచలన నిర్ణయం! శత్రువుల గుండెల్లో గుబులు, 2 కుటుంబాల కలయికకు నాందీనా?

Nuvvunte Naa Jathaga Serial Today Episode February 16th దేవా తన తండ్రి తాతగారి ఇంటికి వెళ్లి తనని తాను పరిచయం చేసుకొని మామయ్యతో మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode బామ్మ తన గదిలో కూర్చొని దేవా చెప్పింది నిజం అయితే నా 30 ఏళ్ల నిరీక్షణ నిజం అవుతుంది. రేపు నేను ఉన్నా లేకపోయినా నా కుటుంబానికి ఏం హానీ జరగదు.. ఈ కుటుంబానికి ఆ కుటుంబం.. ఆ కుటుంబానికి ఈ కుటుంబం అండగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సత్యమూర్తి వచ్చి తల్లి దగ్గర కూర్చొంటాడు.

సత్యమూర్తి ఏం మాట్లాడకపోవడం చూసి బామ్మ ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. అమ్మా నా గురించి నీకు తెలుసు నాకు గొడవలు అంటే ఇష్టం ఉండదు.. ఆ విషయంలోనే నాన్నతో గొడవలు అయ్యవి.. అందుకే పెళ్లి తర్వాత ఈ ఊరు వదిలి వెళ్లిపోయా.. అప్పుడు అందరూ నన్ను పిరికివాడు అన్నారు.. ఇంటి పేరు చెడగొట్టా అన్నారు.. కానీ నేను నాన్న వెళ్లిన దారిలో వెళ్లకూడదు అనుకున్నా.. నా పిల్లల్ని ఎప్పటికీ ఆ దారిలో నడిపించకూడదు అనుకున్నా.. 30 ఏళ్లగా పగ నా జోలికి రాలేదు.. కానీ ఇప్పుడు మొదలయ్యావి,, మన కుటుంబానికి ఎప్పుడు ఏమవుతుందా అని భయం మొదలైంది..అందుకే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటాడు. దానికి బామ్మ మనకి మనవాళ్లతో సమస్య వస్తే వాళ్లని వదిలేసి వెళ్లిపోతూ ఉంటే మన అనేవాళ్లు తగ్గిపోతూ ఉంటారురా.. అదే కలుపుకుంటూ వెళ్తే ఎక్కువ అవుతారురా.. మనం ఆ కుటుంబం వల్ల కోల్పోయిన దాని కంటే మన వల్ల వాళ్లు కోల్పోయిందే ఎక్కువరా.. నా మనవడు ఏ ముహూర్తాన అన్నాడో కానీ ఈ మూడు రోజుల్లో వాడు కచ్చితంగా కలుపుతాడురా.. నా మనవడి మీద నాకు నమ్మకం ఉంది.. వాడు ఒక పని తీసుకున్నాడు అంటే జరిగి తీరుతుందిరా.. వాడివన్నీ మీ నాన్న గారి పోలికలే.. రెండు కుటుంబాలు కలిసిపోయిన తర్వాత నేను చనిపోయినా నువ్వు చూడటానికి రావాల్సిన అవసరం లేదురా అని అంటుంది. తల్లి మాటలతో సత్యమూర్తి షష్టిపూర్తికి ఒప్పుకుంటాడు. అమ్మా కాసేపు నీ ఒడిలో పడుకుంటా అని తల్లి ఒడిలో పడుకుంటారు.

మిథున, దేవా దూరం నుంచి మొత్తం చూస్తూ ఉంటారు. మిథున భర్తతో నువ్వు అన్నట్లు ఈ రెండు కుటుంబాలు కలవాల్సిన అవసరం ఎంత ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది.. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే రెండు కుటుంబాలు కలుపుదాం.. ఈ క్రమంలో నేను నీ జీతగా ఉంటానని అంటుంది. నువ్వుంటే నా జతగా నేను ఏమైనా సాధిస్తా అని దేవా అంటాడు.

దేవా తండ్రి తాతగారి ఇంటికి వెళ్తాడు. భూపతి మామయ్య అని మాట కలుపుతాడు. అందరూ ఆశ్చర్యంగా చూసి ఎవరు నువ్వు అంటే శ్రీపతి కొడుకుని అమెరికా అని చెప్తాడు. భూపతి సంతోషంగా దేవాని కూడా కూర్చొపెట్టి భోజనం వడ్డిస్తాడు. సడెన్‌గా అమెరికా నుంచి ఎందుకు వచ్చావని అడిగితే సత్యమూర్తి గారి షష్టిపూర్తి కదా తప్పకుండా రమ్మని పిలిస్తే వచ్చా అంటాడు. పగవాళ్లు పిలిస్తే రావడం ఏంట్రా అని భూపతి అంటే మీరు వద్దు అంటే వెళ్లను మామయ్య అని దేవా అంటాడు. ఒకవేళ నేను సత్యమూర్తి గారి కొడుకుని అయితే అని దేవా అంటాడు. దాంతో భూపతి తిండి దగ్గర లేచి రేయ్ అని అంటాడు. అయితే ఏంటి నేను సత్యమూర్తి గారి కొడుకునే అవును మామయ్య నేను సత్యమూర్తి గారి చిన్న కొడుకు దేవాని అని అంటాడు. దాంతో భూపతి ఆవేశంగా గన్ తీసుకొస్తాడు. 

భూపతి గన్ గురిపెడితే దానికి దేవా.. మీరు ఒకసారి హైదరాబాద్లో మా ఏరియాకి వచ్చి ఏవరినైనా అడగండి.. ఏ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అయినా అడగండి.. దేవా అంటే ఏంటి అని.. నేనో పెద్ద రౌడీషీటర్‌ని మామయ్య.. ఇలాంటి గన్‌లు కత్తులు ఎన్ని చూసుంటానో చెప్పండి.. నా సగం జీవితం వీటితోనే అయిపోయింది. ఈ గన్‌లు కత్తులు నాకు కొత్త కాదు మామయ్య.. నాకు గన్ గురి పెట్టడం కాదు..అసలు అలాంటి ఆలోచన చేసిన వాడిని నేనే చంపేస్తా.. ఇప్పుడు కూడా ఇక్కడ అదే జరిగేది కానీ రౌడీయిజం వదిలేస్తా అని నా భార్యకి మాటిచ్చా అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది.. తాతయ్య మనది అంతా ఒక కుటుంబం.. మన రెండు కుటుంబాలు కలవాలి అని నానమ్మ కోరిక తన కోరిక నిజం చేస్తా అని మాటిచ్చా.. మన రెండు కుటుంబాలు కలవడానికి మా అమ్మానాన్నల షష్టిపూర్తి ఓ వేదిక కావాలి .. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి షష్టిపూర్తికి రండి అని పిలుస్తాడు.

భూపతి దేవాతో మీ నాన్న ఒక పిరికి వాడురా వాడి కొడుకు రౌడీ అంటే నమ్మేస్తా అనుకున్నావా అని అడుగుతాడు. నా నాన్న పిరికి వాడు కాదు మామయ్య మంచి వాడు.. ఆయనకు హాని చేయాలి అని చూసిన వాళ్లని కూడా బాగుండాలి అని కోరుకునే గొప్పవాడు. అన్నింటికంటే ముఖ్యంగా పగతో కాకుండా ప్రేమతో గెలివాలి అనుకునేవాడు.. మీరంతా తప్పకుండా షష్టిపూర్తికి రండి అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 08) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే - డోంట్ మిస్
Nindu Manasulu Serial Today March 7th: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
నిండుమనసులు: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
Chinni Serial Today March 7th: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
చిన్ని సీరియల్: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
Illu Illalu Pillalu Serial Today March 7th: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs New zealand Final Toss: ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
Team India Playing 11: ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
ఫైనల్ నుంచి మిస్టరీ స్పిన్నర్ ఔట్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ !
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Embed widget