Nuvvunte Naa Jathaga Serial Today February 13th: నువ్వుంటే నా జతగా: 30 ఏళ్ల పగ దేవా తాతగారితోనేనా! దేవా ఏం చేస్తాడు? షష్టిపూర్తికి ముప్పు తప్పదా?
Nuvvunte Naa Jathaga Serial Today Episode February 13th బేబీ బామ్మ పుట్టింటితోనే 30 ఏళ్ల పగ అని సత్యమూర్తి దేవాతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode 30 ఏళ్ల పగ మళ్లీ మొదలవుతుందేమో అని బామ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. మిథున బామ్మ దగ్గరకు వెళ్లి భూపతిరాజు ఎవరు? అసలు ఆ కథ ఏంటి అని అడుగుతుంది. బామ్మ మొత్తం మిథునకు చెప్తుంది. సీన్ చూస్తే దేవాలా మరో వ్యక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. 30 ఏళ్ల పగ అలాగే ఉంది.. ఈ ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉన్నా.. ఏ శుభకార్యం జరుగుతుంది అన్నా ఆ భూపతి తట్టుకోలేడు.. ప్రాణాలు తీయడానికి అయినా వెనకాడడు.. అంత మూర్ఖుడు ఆ భూపతి.. దీని వల్ల ఎవరి ప్రాణాలు పోతాయా అని భయంగా ఉందమ్మా అని బామ్మ అంటుంది.
కాంతం ఇంట్లో జరిగిన టాపిక్ గుర్తు చేసుకొని గజగజా వణికిపోతూ ఉంటుంది. రంగం వెళ్లి మీద చేయి వేయగానే పెద్దగా అరిచి గట్టిగా తిడుతుంది. ఇప్పుడేమైందే ఇంత కంగారు పడుతున్నావ్ అని రంగం అడిగితే అలా అడుగుతావేంట్రా మతి లేని నా మొగుడా.. ఇందాక పంతులు గారి ఒంటి మీద దెబ్బలు చూడలేదా.. ముహూర్తం పెట్టడానికి వచ్చిన పంతులునే మర్డర్ చేయాలని చూశారు అంటే మనం ఈ ఇంటి వాళ్లం అని తెలిస్తే మన పరిస్థితి ఏంట్రా మొగుడా అని ఏడుస్తుంది. రంగం కూడా భయపడతాడు. ఏం చేద్దాం అని అనుకుంటూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు.
మిథున ధీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అక్కడికి ప్రమోదిని వెళ్లి మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. అసలు మామయ్యగారి షష్టిపూర్తి జరుగుతుందా మిథున.. మీ ప్రేమని మామయ్య గారు అర్థం చేసుకుంటారు.. ఇక్కడి నుంచి అందరం సంతోషంగా వెళ్లాలి అనుకున్నాం.. మామయ్య గారు గొడవలు పడేవాళ్లు కాదు.. గొడవలు పెంచుకునేవాళ్లు కాదు.. కానీ ఇదంతా ఏంటి అంటుంది. దానికి మిథున నేను ఇన్ని ఆలోచించడం లేదు అక్క దేవా గురించి ఆలోచిస్తున్నా.. దేవా ఇందాక ముహూర్తం ఫిక్స్ చేయించి పంతుల్ని తీసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. దేవాకి కోపం ఎక్కువ.. ఇంటికి తిరిగొచ్చేలోపు మళ్లీ ఆ భూపతి వాళ్ల ఇంటికి వెళ్లి ఏం గొడవ చేస్తాడా అని భయంగా ఉంది. ఇప్పుడే దేవా మారాడు. కానీ మామయ్యకి నమ్మకం లేదు.. దేవా గొడవలు వదిలేసి కష్టపడుతున్నాడు.. ఆ కష్టాన్ని మామయ్య చూడలేకపోతున్నారు. దేవా ఆవేశంలో ఇప్పుడు మళ్లీ పాత దేవాలా మారిపోతే.. అదే నాభయం అక్కా..అదే జరిగితే దేవాని ఇంక జీవితంలో మామయ్య క్షమించరు.. దేవాని కూడా కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది అని అంటుంది. అలా ఏదీ జరగకూడదు అని మొక్కుకుందాం అని ప్రమోదిని అంటుంది.
రంగం, కాంతం ఇంట్లో వాళ్లతో పగ అంటుంటే భయంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని అడుగుతారు. సత్యమూర్తి కూడా ఇప్పుడు ఈ షష్టిపూర్తి అవేమీ వద్దు వెళ్లిపోదాం నువ్వు కూడా మాతో వచ్చేయ్ అమ్మా అని పిలుస్తాడు. బామ్మ ఎమోషనల్‌గా ఈ వయసులో నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదరా.. నీకు షష్టిపూర్తి చేయాలి అని.. అన్నింటికీ మించి మీ నాన్నగారి జ్ఞాపకాలు ఉన్న ఈ ఇళ్లు వదిలేస్తే నాకు ఎందుకురా ఈ జీవితం అని ఏడుస్తుంది. మన ప్రాణాలు మనకు ముఖ్యం కదా అమ్మా.. అంటాడు. ఇంతలో దేవా మీర ఇంట్లో ఉండటానికి భయపడాల్సిన పని లేదు.. నానమ్మ నువ్వు అనుకున్న ముహూర్తానికే షష్టిపూర్తి జరుగుతుంది అని అంటాడు. అసలు నీకు ఏం తెలుసురా.. ఇది నువ్వు చేసే సెటిల్ మెంట్స్ అనుకున్నావా.. పగరా.. పగ.. ఎన్ని ప్రాణాలు పోతాయో తెలుసా అని అంటాడు సత్యమూర్తి. ఏం జరిగినా నేను చూసుకుంటా నాన్న అని దేవా అంటే ఏంట్రా నువ్వు చూసుకునేది.. ఇది 30 ఏళ్ల పగ..నువ్వు వాళ్లలా కత్తులు పట్టుకుంటావా.. చంపుకుంటారా.. ఆ రక్తం పరాయివాళ్లది కాదు.. అందరిదీ.. అందరిదీ ఒకే రక్తం.. నువ్వు గొడవ పడాల్సింది ఎవరిదో తెలుసా.. నువ్వు ఎంతో ప్రేమించే మీ నానమ్మ అన్నయ్య కుటుంబంతోనే.. అంటే మీ తాతయ్యతోనేరా అని సత్యమూర్తి చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























