Nuvvunte Naa Jathaga Serial Today February 11th: నువ్వుంటే నా జతగా: మిథున-బామ్మల మాస్టర్ ప్లాన్! దేవా తండ్రిని గెలిపిస్తాడా? అదిరిపోయిన ఆట!
Nuvvunte Naa Jathaga Serial Today Episode February 11th దేవా, సత్యమూర్తిలను కలపాలి అని బామ్మ, మిథున ప్లాన్ చేసి గేమ్ ఆడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode సూర్యకాంతం మిథునతో నీ ఆశలు అన్నీ అడియాసలు అయిపోయావి కదా.. బేబీకి గుండెపోటు రావడంతో జస్ట్ మిస్ లేదంటే మీరు ఈ పాటికి రోడ్డున పడేవాళ్లు.. ఇక్కడి నుంచి వెళ్లగానే నీకు ఆ గతి గ్యారెంటీ అని వెళ్లిపోతుంటే మిథున చిటెకెలు వేసి కాంతాన్ని పిలుస్తుంది. పచ్చడి తిన్న కోతిలా అలా నోటికి వచ్చినట్లు వాగేసి వెళ్లిపోతే ఎలా కాంతం అక్కాయ్.. నేను చెప్పింది కూడా నువ్వు వినాలి కదా విను అంటుంది. ఇక్కడున్నన్ని రోజులు నువ్వు చాలా చూస్తావ్.. షాక్‌ల మీద షాక్‌లు తగులుతాయి.. ఇక్కడ నుంచి వెళ్లే లోపు మామయ్య గారిని దేవాని కలుపుతా.. నీ కళ్లముందే ఇదంతా జరుగుతుంది,, నువ్వు కుళ్లి కుళ్లి ఏడుస్తావ్ అక్కాయ్ అని అంటుంది. ఇద్దరూ ఛాలెంజ్‌లు చేసుకుంటారు.
బేబీ బామ్మ సత్యమూర్తి, దేవాలను కలపడానికి తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే టగ్ ఆఫ్ వార్ ఆటకి ఏర్పాట్లు చేస్తుంది. ఇంట్లో అందరినీ పిలిచి తన సంతోషం కోసం అందరూ ఆడాలని అంటుంది. మీరందరూ ఈ తాడు పట్టుకొని నన్ను ఓడించాలి అని ఛాలెంజ్ విసురుతుంది. ఇప్పుడు నీ ఆరోగ్యం బాలేదు ఇలాంటి ఆటలు ఎందుకమ్మా అని సత్యమూర్తి అడుగుతాడు. ఉన్నిన్ని రోజులు నన్ను సంతోషంగా చూసుకోమని డాక్టర్ చెప్పారు కదా నాతో ఆడాలి.. నా ఆనందానికి ఎవరూ అడ్డు పడొద్దు అని అందరితో చెప్తుంది. ముందుగా శ్రీరంగంతో నీ టాలెంట్ అబద్ధాలు చెప్పడం.. మాయలు చేయడంలోనేనా.. ఇంకేమైనా ఉందా అని అడుగుతుంది. కాంతం భర్తతో తాడు గట్టిగా లేగేసి ముసలి పోయేలా చేయ్ అని అంటుంది. నాది జిమ్ బాడీ తగ్గేదేలేదు.. ఒక్క చేత్తో లాగేస్తా అని రంగం అంటాడు.
పోటీకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముందుగా బామ్మ ఓ వైపు తాడు పట్టుకొని నిల్చొంటే మరోవైపు రంగం నిల్చొంటాడు. అంగుళం కూడా బామ్మని కదిలించలేకపోతాడు. ఒక్క అడుగు కూడా కదలడం లేదు.. ఇంత స్ట్రాంగ్ ఏంటి బామ్మ.. ఇప్పుడప్పుడే పోయేలా లేదు అని అనుకొని తాడు లాగలేక బామ్మ కాలి దగ్గర పడిపోతాడు. తర్వాత బామ్మ ఆనంద్‌ని పిలుస్తుంది. వద్దులే నేను రాను అని ఆనంద్ అంటాడు. లక్కీ వెళ్లమని తండ్రికి చెప్తుంది. అందరూ చెప్పడంతో ఆనంద్ వెళ్తాడు. ఆనంద్ కూడా బామ్మని ఒక్క అడుగు కూడా కదిలించలేకపోతాడు. ఆనంద్ ఓడిపోతాడు. నీకు గుండెపోటు వచ్చింది అంటే నమ్మలేకపోతున్నాం నానమ్మ అని ఆనంద్ అంటే అసలు వస్తేనే కదా అని పని వాడు అంటాడు. అది విని కాంతం, రంగం చూడండి మళ్లీ అన్నాడు అంటారు.
బేబీ తనతో ఆడటానికి దేవాని పిలుస్తుంది. దేవా ఇష్టం లేదు అనేస్తాడు. తర్వాత సత్యమూర్తిని పిలుస్తుంది. సత్యమూర్తి కూడా రాను అంటాడు. దాంతో శారద వెళ్లమని అంటుంది. పాప కూడా చెప్పడంతో సత్యమూర్తి వెళ్తాడు. సత్యమూర్తి కూడా లాగలేకపోవడంతో బామ్మ రంగం, ఆనంద్‌లను పిలుస్తుంది. వాళ్లు వచ్చినా కూడా బామ్మని అంగుళం కదపలేకపోతారు. ఇదేంటి అని అందరూ అనుకుంటారు. తీరా చూస్తే బామ్మ, మిథునలు ప్లాన్ ప్రకారం ముందే బామ్మ వైపు తాడుని కొబ్బరి చెట్టుకు కట్టేసి ఉంటారు. దేవా రావడం లేదని బామ్మ కావాలనే రెచ్చగొడుతుంది. మీ నాన్నని గెలిపించే సత్తా ఎవరీకీ లేదా.. మీ నాన్న ఓడిపోతుంటే గెలిపించాలి అన్న పంతం ఒక్కరిలో లేదేంటి అని దేవాని రెచ్చగొడుతుంది. దాంతో దేవా ముందుకు వచ్చి తాడు పట్టుకొని నాన్నని నేను ఓడిపోనివ్వను అని అంటాడు.
బామ్మ, మిథునలు ప్లాన్ వర్కౌట్ అయిందని అనుకుంటారు. దేవా వెళ్లి పట్టుకోగానే మిథున సైలెంట్‌గా వెళ్లి కొబ్బరి చెట్టుకు ఉన్న తాడు విప్పేస్తుంది. తాడు వదిలేయడంతో సత్యమూర్తి పడిపోబోతే దేవా పట్టుకుంటాడు. బామ్మ, మిథున , ప్రమోదిని సంతోషంగా ఫీలవుతారు. బామ్మ దేవాతో నువ్వు మీ నాన్నని పడిపోకుండా పట్టుకోవడమే కాదురా.. ఓడిపోకుండా గెలిపించుకున్నావ్,, నువ్వు మాత్రమే మీ నాన్నని గెలిపించుకోగలవురా,, మీ నాన్నని గర్వంగా తలెత్తుకునేలా చేయగలవురా అని అంటుంది. సత్యమూర్తి దేవాని కోపంగా చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























