Nuvvunte Naa Jathaga Serial Today February 10th: నువ్వుంటే నా జతగా: దేవాని ఘోరంగా అవమానించి సత్యమూర్తి! చేతిలో అన్నం విసిరికొట్టి ఏం చేశారంటే!
Nuvvunte Naa Jathaga Serial Today February 10th దేవా, సత్యమూర్తిలను ఎలా అయినా కలపాలి అని బామ్మ ఆవకాయ్ అన్నం ఏర్పాటు చేయడం సత్యమూర్తి దేవాకి అన్నం పెట్టకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode
మిథున ప్రమోదినితో బామ్మ గుండెపోటు నాటకం గురించి చెప్తుంది. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే మామయ్య గారి కోపం తాలూక పరిణామాలు చాలా దూరం వెళ్తాయి. జాగ్రత్త మిథున అని ప్రమోదిని చెప్తుంది. ఈ నాలుగు రోజుల్లో మామయ్య గారు దేవాని అర్థం చేసుకునేలా చేస్తా.. తండ్రీ కొడుకుల్ని ఒక్కటి చేస్తా ఆ నమ్మకం నాకు ఉంది అక్క అని అంటుంది.
సత్యమూర్తి పాపతో ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో శారద మనవరాలి కోసం పాలు తీసుకొస్తుంది. తాతయ్యతో ఆడుకుంటే నీ డిస్ట్రబెన్స్ ఏంటి అని పాప అంటుంది. పాప తాతయ్య దగ్గరకు వెళ్లి నేను స్కూల్‌కి వెళ్లను అంటే మా అమ్మ నన్ను కొడుతుంది కదా.. అలాగే మీ అమ్మ కూడా చిన్నప్పుడు నిన్ను కొట్టేదా అని అడిగితే సత్యమూర్తి పెద్దగా నవ్వి.. లేదమ్మా నేను ఎప్పుడూ స్కూల్‌కి వెళ్లను అని మారాం చేయలేదు.. అని చెప్తాడు. ఓ అయితే నువ్వు గుడ్ స్టూడెంట్ కదా తాతయ్య.. నేను కూడా నీలా రోజు స్కూల్‌కి వెళ్లి బాగా చదువుకొని లక్కీ గుడ్ స్టూడెంట్ అనిపించుకుంటా.. అంటుంది. సత్యమూర్తి భార్యతో పోనీలే ఈ సత్యమూర్తి మాస్టారు పేరుని మనవరాలు అయినా నిలబెడతా అంది.. ఈ జన్మకి ఇది చాలు అని అంటాడు. దేవా రౌడీ కాకపోయి ఉంటే మీరు కలగన్నట్లు సైంటిస్ట్ అయ్యేవాడు.. మిమల్ని తల ఎత్తుకునేలా చేసేవాడు అంటుంది. దేవా గురించి మాట్లాడొద్దని సత్యమూర్తి చెప్తాడు.
రాత్రి అందరూ ఆరు బయట కూర్చొంటారు. దేవా రాగానే సత్యమూర్తి లేచి వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు. ఇంతలో బేబీ బామ్మ రావడం చూసి శారద చెప్తుంది. బామ్మ మనవరాళ్లతో అన్నం, ఆవకాయ్, నెయ్యి తీసుకొస్తుంది. పెద్ద ప్లేట్‌లో కలిపి నేనే అందరికీ తినిపించాలి అనుకున్నా కానీ ఈ గుండెపోటు వల్ల నాకు అంత శక్తి లేదు.. సత్యం నువ్వే అందరికీ ముద్దలు ఇవ్వరా అంటుంది. సత్యమూర్తి దేవాని చూసి ఇవ్వనని అంటాడు. ఇంతలో పని వాడు బేబమ్మ గారు మీకు ఎప్పుడు గుండెపోటు వచ్చింది అని అడుగుతాడు. అందరూ షాక్ అయిపోతారు. బామ్మ కవర్ చేయడానికి రేయ్ మతిమరిపోడా.. నువ్వు అలా అడుగుతావేంట్రా.. గుండెపోటు వచ్చిందనే కదా డాక్టర్ వచ్చాడు.. వీళ్లంతా అందుకే వచ్చారు కదా.. నువ్వు ఇలా అడిగితే నాటకం ఆడుతున్నా అని అనుకుంటారు. గుర్తుంచుకోరా అని తిట్టి కవర్ చేస్తుంది. అందరికీ తినిపించరా అని మళ్లీ బామ్మ చెప్తే శారద తినిపిస్తుందని అంటాడు. దాంతో బామ్మ గుండె పట్టుకుంటుంది. నాకు గుండె పోటు కంటే కొడుకు పోటు ఎక్కువైందిరా దేవుడా.. ఈ మధ్య నా కొడుకు ప్రతీ మాటకి ఎదురు చెప్తున్నాడు ఇక ఈ తల్లి మాటకు ఏం విలువ ఉంటుంది అని అంటుంది.
శారద భర్తతో మీ అమ్మగారికి టెన్షన్ పెట్టే పనులు చేయొద్దని డాక్టర్ చెప్పారు కదా వెళ్లి తినిపించండి అని అంటుంది. సత్యమూర్తి వెళ్లి అందరికీ ముద్దలు ఇస్తాడు. దేవా కూడా చేయి చాచుతాడు. ఈ విధంగా అయినా నాకు నాన్న చేతి ముద్దలు తినే అదృష్టం దక్కిందని మనసులో అనుకుంటాడు. కానీ సత్యమూర్తి ఇవ్వకుండా అన్నాన్ని ప్లేట్‌టో విసిరికొట్టి అమ్మా నన్ను క్షమించు.. నాకు ఇష్టమైన వాళ్ల అందరికీ నేనే తినిపించా .. నాకు ఇష్టం లేని వాళ్లని నీ కోసం కూడ మనసు చంపుకొని తినిపించలేను అని వెళ్లిపోతాడు. దేవా చాలా బాధపడతాడు. దేవాని చూసి మిథున కూడా బాధ పడుతుంది.
మిథున చాలా బాధ పడుతూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత నాన్న చేతి ముద్దలు తినే అదృష్టం దొరికిందని దేవా చాలా సంతోషపడుంటాడు కానీ మామయ్య అలా చేసినందుకు దేవా చాలా బాధపడుతుంటాడు అనుకుంటుంది. ఇంతలో కాంతం వచ్చి అనుకున్నది ఒకటి అయినది ఒకటి బొల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అని పాటలు పాడి పాపం మిథున మేడం ఆశలు అన్నీ అడియాసలు అయ్యావని బాధగా ఉందని అంటుంది. దేవాకి మామయ్య గారు తినిపిస్తారు అని దేవా మామయ్యకి దగ్గరవుతాడని నువ్వు ఆనందంతో ఆకాశానికి వెళ్లడం నేను చూశా అంటుంది. దేవాని మామయ్య గారు చచ్చినా క్షమించరు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























