Nuvvunte Naa Jathaga Serial Today Episode బేబీ బామ్మ శారదతో భాను తల్లిని పిలిచి ఈ పెళ్లి ఆగదు అని చెప్పేయ్ అని అంటుంది. దానికి శారద ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని అంటుంది. నాకే ఎదురు చెప్తావా అని బేబీ అంటే మీరు అత్తగా ఏం చెప్పినా చేస్తాను కానీ నా కొడుకు జీవితం నాకు ముఖ్యం అందుకు మీరు చెప్పినట్లు చేయను అంటుంది. నేను నా మనవడి జీవితం గురించి ఆలోచించనా అని బేబీ అడిగితే అలా ఆలోచించేవాళ్లు అయితే ఈ పెళ్లి ఆపాలి అని అనుకోరు అని అంటుంది. 

Continues below advertisement

శారద కోపంగా మాట్లాడితే భార్యాభర్తల్ని విడదీస్తున్నారు అంటున్నారు. కానీ ఆ పిల్ల పక్కనే పెళ్లి చేసుకుంటుంది.. మరి అది తప్పు కాదా.. తన జీవితం తను చూసుకుంటే నేను నా కొడుకు జీవితం చూసుకోవడం తప్పు కాదా అని అడుగుతుంది. దానికి బేబీ బామ్మ మిథున ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకుందో నేను అడుగుతాడు. మిథునతో మిథున తల్లిదండ్రులతో నేను మాట్లాడి పెళ్లి రద్దు చేయిస్తా అందరం కలిసి ఇదే మండపంలో దేవా, మిథునల్ని ఆశీర్వదించుదాం అని అంటుంది. 

శారద అత్తని అడ్డుకొని మళ్లీ మీరు రెండు కుటుంబాల మధ్య గొడవలకు కారణం కావొద్దు..జ మీకు దండం పెడతాం వదిలేయండి.. మేం వాళ్ల ఇంటికి వెళ్లడం మాట్లాడటం అన్నీ జరిగిపోయావి.. దయచేసి రెండు కుటుంబాలను ప్రశాంతంగా ఉంచండి.. మీ మనవడి పెళ్లి చూసి ఆశీర్వదిస్తా అంటే ఇక్కడే ఉండండి లేదంటే మీ ఇష్టం అని చెప్తుంది. ప్రమోదిని దేవాకి హారతి ఇస్తుంటే హారతి ఆగిపోతుంది. చూశారా హారతి ఆరిపోయింది. ఆ అపశకునం పెళ్లి ఆపేయమని సంకేతం.. దేవా, మిథునల్ని వేరు చేసి ఈపెళ్లి చేయడం దేవుడికి కూడా ఇష్టం లేదు.. అని బామ్మ చెప్తుంది. శారద మళ్లీ దీపం వెలిగించి హారతి ఇప్పిస్తుంది. 

Continues below advertisement

మిథున దేవాని గుర్తు చేసుకొని దేవా దగ్గరకు వెళ్లబోతుంది. ఇంతలో హరివర్థన్ వచ్చి ఎక్కడికమ్మా వెళ్తున్నావ్.. నీ దగ్గర నా ప్రశ్నకు సమాధానం లేదో లేదంటే నీ అడుగులకు గమ్యం ఏంటో తెలీనీ తికమకలో ఉందో నాకు తెలీదు కానీ నాకు క్లారిటీ ఉన్న విషయం చెప్తా విను.. పెళ్లి పీటల వరకు వచ్చి కూడా ఏదో తెలియని శక్తి నిన్ను వెనక్కి లాగుతుంది. అన్నీ వదిలేసి కాసేపట్లో జరగబోయే పెళ్లి మీద దృష్టి పెట్టేలా నీకు ఓ మాట చెప్తా విను.. నాకు నా కూతురి భవిష్యత్ ఎంత ముఖ్యమో నా పరువు కూడా అంతే ముఖ్యం. నా పరువుకి ఏమైనా భంగం కలిగితే నా గుండె ఆగిపోతుంది. ఆ రౌడీ కోసం నువ్వు వెళ్లిపోయావ్ అన్న బాధలో ఈ గుండె చావు చివరి వరకు వెళ్లొచ్చింది..మరోసారి నువ్వు నీ జీవితాన్ని చీకటిలో నెట్టేయాలని చూస్తే తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదు. నీకు నిజంగా నీ కన్నవాళ్ల మీద ప్రేమ ఉంటే.. వాళ్లు బాగుండాలి.. ప్రాణాలతో ఉండాలి అనుకుంటే తల వంచుకొని తాళి కట్టించుకో.. కాదని ఈ నాన్నకి తలవంపులు తీసుకొస్తా ఈ గన్‌తో షూట్ చేసుకొని చచ్చిపోతా అని గన్ తీస్తారు. 

మిథున ఏడుస్తుంది. నా కూతురి నా పరువు తీస్తే నేను ఎందుకు బతకాలి.. అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండు నా కూతురికి ఏదైనా చెడ్డ పేరు వస్తే నా ఆత్మకి కూడా ప్రశాంతత ఉండదు అని అంటారు. మిథున చాలా ఏడుస్తుంది. ఇక పెళ్లి తంతు మొదలవుతుంది. రిషి పెళ్లి మండపంలో పూజ చేస్తాడు. మరోవైపు దేవా పెళ్లి తంతు కూడా జరుగుతూ ఉంటుంది. రిషి, మిథున పెళ్లి పీటల మీద కూర్చొంటారు. ఇక దేవా, భాను కూడా పెళ్లి పీటల మీద కూర్చొంటారు. రెండు జంటలు బట్టలు మార్చుకోవడానికి వెళ్తారు. మిథున, దేవా ఒకరికి ఒకరు ఎదురవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.