Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం మొదలవుతుంది. ఆడవాళ్లు అంతా పసుపు దంచుతారు. దేవాని ఆనంద్, శ్రీరంగం తీసుకొచ్చి డ్యాన్స్ చేస్తారు. అందరూ దేవా చుట్టూ చేరి చిందులు వేస్తారు. ఇంతలో భాను చాలా సీరియస్‌గా వచ్చి ఆపండి అని అరుస్తాడు.
భాను అరవడంతో అందరూ షాక్ అయిపోతారు. ఏమైందని అందరూ అడుగుతారు. భాను దేవాతో నాతో ఆడుకోవాలి అనుకుంటున్నావా.. లేదంటే నన్ను చంపేయాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. దేవా ఏం అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. సత్యమూర్తి భానుతో ఏమైందని అడుగుతాడు. భాను పోస్టర్ అందరికీ చూపిస్తుంది. అందరూ షాక్ అయి నోరెళ్లపెడతారు. ఎందుకు ఇలా చేశావ్.. ఏ ఉద్దేశంతో ఇలా చేశావ్ అని అడుగుతుంది.
దేవా కోపంగా నీకు పిచ్చా నువ్వు చెప్పే వరకు నాకు ఈ విషయం తెలీదు.. నేను ఇప్పుడే చూస్తున్నా.. మరి ఈ పోస్టర్ నేను వేయించాను అంటున్నావేంటి అని దేవా అంటాడు. నువ్వే చేశావ్ నువ్వు కాకపోతే మరెవరు చేస్తారు.. ఈ ఊరిలో నీ గురించి ఇలాంటి పోస్టర్ వేయించే ధైర్యం ఎవరికి ఉందని భాను అడుగుతుంది. నేను కాదని చెప్పినా వినవా అని దేవా భాను మీద చేయి ఎత్తుతాడు. సత్యమూర్తి దేవాని ఆపి ఏంట్రా ఇది అసలు ఎవరు వేయించుంటారు ఈ పోస్టర్ అని అడుగుతారు. నాకు తెలీదు నాన్న అని దేవా అంటాడు.
మిథున వేయించుంటుందని సూర్య కాంతం అంటుంది. అందరూ ఆలోచనలో పడతారు. ఈ పోస్టర్లను కచ్చితంగా మిథునే వేయించుంటుందని రంగం అనడంతో అన్నయ్యా.. మిథున అలా చేయదు.. తన గురించి తప్పుగా మాట్లాడితే ఎవరికీ బాగోదు అని దేవా వార్నింగ్ ఇచ్చాడు. దీని వెనక ఎవరు ఉన్నారో నేను తెలుసుకుంటా.. తేల్చుకుంటా అని బయటకు వెళ్తాడు. శారద భర్తతో ఇలా ఎవరు చేయించుంటారు అని అంటుంది. సత్యమూర్తి ఈ పోస్టర్ వల్ల ఎన్ని గొడవలు వస్తాయో అని అంటారు.
మిథున పెళ్లి ఫిక్స్ అవ్వడంతో హరివర్థన్, లలిత సంతోషంగా మాట్లాడుకుంటూ కారులో వస్తుంటారు. రోడ్డు మీద మిథున, దేవాల పోస్టర్ చూసి షాక్ అయిపోతారు. హరివర్థన్ పోస్టర్ దగ్గరకు వెళ్లి ఎవరు ఇలా చేసుంటారు.. నా కూతురు సంతోషంగా ఉండటం ఆ దేవుడికి ఇష్టం లేదా.. నన్ను నవ్వు ల పాలు చేస్తున్నారు అని ఏడుస్తూ పోస్టర్లు చింపేస్తాడు. లలిత భర్తతో పోస్టర్లు ఊరంతా పెట్టారు రిషి చూస్తే ఏమైనా ఉందా అని అంటుంది. హరివర్థన్ చాలా కంగారు పడతాడు.
రిషి మిథున కోసం ఇంటి ముందు వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో అలంకృత వచ్చి బావ నేను రెడీ అని అంటుంది. రిషి అలంకృతని పట్టించుకోడు. ఇప్పటి వరకు ఫుల్ జోష్‌గా ఉంది ఇప్పుడు ఇలా అయిపోయావు ఏంటి బావ అని అలంకృత అడిగితే మాకు కాస్తా స్పేస్ ఇవ్వొచ్చు కదా అని అంటాడు. దానికి అలంకృత దూరం జరిగి చాలా అంటుంది. అది కాదు నేను చెప్పింది మాకు కొంచెం ఏకాంతం ఇవ్వొచ్చుకదా అంటాడు. అంత లేదు అని అలంకృత అంటే మీ అక్కకి కొత్త ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశా అందుకే అంటాడు. కొత్తగా వచ్చిన రెండు లక్షల రూపాయల ఫోనా అని అడుగుతుంది. అవును అంటాడు.
మిథున రాగానే అలంకృత భాయ్ చెప్తుంది. నువ్వు వస్తా అన్నావ్ కదా అంటే బావ వద్దు అన్నాడు అంటుంది. ఏంటి అని మిథున అంటే భరించలేని తలనొప్పి అక్కా అందుకే రాను అంటుంది. నీకు తగ్గితే వెళ్దాంలే అని మిథున అంటే లేదు ఇప్పుడు వెళ్లండి అని పంపిస్తుంది. ఇంతలో హరివర్థన్ వాళ్లు వస్తారు. మిథునని తీసుకొని బయటకు వెళ్తా అని రిషి అంటే హరివర్థన్ కంగారు పడతాడు. పోస్టర్లు రిషి చూస్తే చాలా ప్రాబ్లమ్ అయిపోతుందని రిషి వాళ్లని వెళ్లొద్దని అంటాడు. రిషి వద్దు అన్నా సరే హరివర్థన్ బలవంతంగా లోపలికి పద అని అంటాడు. మీ ప్రవర్తన నాకు డౌట్‌గా ఉంది మామయ్యా అని రిషి లోపలికి వెళ్లిపోతాడు. రిషి మెకానిక్ షెడ్ దగ్గరకు వెళ్లి తన ఫ్రెండ్స్ మీద ఎవర్రా పోస్టర్లు వేసింది అని కోప్పడతాడు. మాకు తెలీదు అని అంటారు. దేవా అందర్ని కొడతాడు. అయినా వాళ్లు మాకు తెలీదు అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.