Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథునకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే.. అని హరివర్ధన్ దేవాకి చెప్తాడు. పోలీసుల ఎంక్వైరీలో నీ శత్రువులే ఇదంతా చేశారని ఏడుస్తూ చెప్తాడు.

హరివర్ధన్: రౌడీ అయినా సరే నీ కంటే మంచి భర్త తనకు దొరకడు అని నాతో చెప్పింది.. నిరూపిస్తా అని చెప్పింది. నిరూపించింది కూడా.. నువ్వు రౌడీ అయినా సరే గొప్పోడివి. మంచి గుణగణాలు ఉన్న వాడివి. అన్నింటికంటే ముఖ్యంగా తనని జాగ్రత్తగా చూసుకున్నావ్. ఈ విషయాలు అన్నింటిలో నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ నీ కారణంగానే నా కూతురి ప్రాణాలకు ప్రమాదం ఉంది అనేభయం ప్రతీ క్షణం వెంటాడింది. అందుకే నువ్వు నా కూతురికి భర్తగా సరిపోతావా లేదా అని నాలో నేను చాలా మానసిక సంఘర్షణ అనుభవించాను. అయినా సరే నా కూతురు నువ్వే సర్వస్వం అని నమ్ముతుంది కాబట్టి తన సంతోషం కోసం నా భయం కాస్త పక్క పెట్టాలి అనుకున్నా. కానీ ఇప్పుడు నా భయమే నిజం అయింది కదా. నీ కారణంగా నా కూతురికి చావుతో పోరాడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కిడ్నాప్ ఈ రోజు ఇది ప్రతీసారీ ఇలా అయితే ఎలా నమ్మకం వస్తుంది. కూతుర్ని పోషించలేని చేతకాని వెధవ అయినా సరే ఏ తండ్రి అయినా భరిస్తాడు. కానీ కూతురి ప్రాణాలు పోతాయని తెలిసి ఎవరి దగ్గర కూతుర్ని ఉంచాలి అనుకోరు. దేవా ఇప్పటి వరకు నిన్ను బెదిరించాను కానీ ఇప్పుడు కూతురే పంచప్రాణాలుగా బతుకుతున్న ఒక తండ్రిగా వేడుకుంటున్నాను.. దండం పెట్టి బతిమాలుతున్నాను వెళ్లిపో దేవా.. నువ్వు వెళ్లిపో.. నా కూతురి జీవితంలో నుంచి వెళ్లిపోదేవా. ప్లీజ్ దేవా నీ కాళ్లు పట్టుకుంటా. నా కూతురిని ప్రాణాలతో ఉండనివ్వు. నువ్వు పక్కనుంటే అది ప్రాణాలతో బతకదు. బతకదు దేవా.. అని చాలా ఏడుస్తూ అక్కడే కూర్చొండిపోతాడు.

దేవా: హరివర్ధన్ దగ్గరకు వెళ్లి కూర్చొని సార్ ఈ విషయం గురించి నేను మీతో ఎప్పుడూ మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడకపోతే నా జీవితమే కోల్పోతాను సార్. సార్ మీ బాధ నాకు అర్థమైంది నా బాధ కూడా అర్థం చేసుకోండి సార్. మిథునని నేను ఎంత దూరం చేసుకోవాలి అనుకుంటే అంత దగ్గరయ్యాను అని నాకు ఇప్పుడు అర్థమైంది. మిథున రాక ముందు నా లైఫ్‌కి అర్థం లేదు అసలు నా జీవితానికి అర్థం వచ్చింది. చెప్పాలి అంటే నా జీవితంలో తన జ్ఞాపకాలు తప్ప నాకు ఇంకేం గుర్తు లేవుసార్. మన కోసం ప్రాణం ఇచ్చేవారు కేవలం ఒకరే ఉంటారని మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది. మిథునని కోల్పోయి నన్ను నేను కోల్పోలేను సార్. నా కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ మిథునకు మాత్రమే ఉంది సార్. మిథున ప్రేమకు తల వంచాను. తనని ప్రేమించకుండా ఉండలేకపోయాను. మరి అంతలా ప్రేమించిన మిథునని నేను వదులుకోలేను సార్.

హరివర్ధన్: కానీ నువ్వు మిథునని వదిలేసి వెళ్లకపోతే తను నీ కారణంగా ఏ క్షణం అయినా ప్రాణం వదిలేస్తుంది.

దేవా: లేదు సార్ నా మిథునకు అలాంటి పరిస్థితి నేను రానివ్వను. నా ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాను సార్.

హరివర్ధన్: ఇప్పుడు కాపాడగలిగావా.. ఒకవేళ నా కూతురు చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి. నా కూతుర్ని నువ్వు మాకు తెచ్చేవాడివా.. మా కడుపు కోత తీర్చేవాడివా. నీకు తన మీద ప్రేమ లేదు అనడం లేదు కానీ దయచేసి మా బాధని అర్థం చేసుకో. ఈ క్షణమే నా కూతుర్ని వదిలేసి వెళ్లిపో దేవా.. ప్లీజ్ వెళ్లిపో.

దేవా: సార్ మిథునని వదిలేసి వెళ్లు అన్న మాట వింటుంటే నాకు ప్రాణం పోయినట్లు ఉంది సార్ అలాంటిది నేను మిథునని వదిలేసి ఉండగలనా.

హరివర్ధన్: నువ్వు ఉంటే మిథున ప్రాణాలే పోతాయి దేవా.

దేవా: సార్ సార్ మిథునకు ఏం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటా ఒక్క అవకాశం ఇవ్వండి సార్.

హరివర్ధన్: నీకు అవకాశం ఇవ్వడం అంటే నా కూతురి ప్రాణాలను నీ చేతిలో పెట్టడమే.

దేవా: అయ్యో అలా కాదు సార్. మిథున దూరం అయితే నేను కూడా బతకలేను సార్. నాకు తెలీకుండానే మిథునని నేను అంతలా ప్రేమించేశాను. నేను దూరం అయినా కూడా మిథున బతకలేదు సార్.

హరివర్ధన్: నీ ప్రేమ తనకు కావాలి అన్నా తన ప్రేమ నీకు కావాలి అన్నా మిథున బతికి ఉండాలి కదా. మిథున లేకపోతే మీ ప్రేమ ఎలా బతుకుతుంది. దయచేసి మిథునని బతకనివ్వు. తండ్రి బాధ అర్థం చేసుకో.

దేవా: నావల్ల కాదు సార్ మిథున లేకుండా బతకడం నా వల్ల కాదుసార్. మిథునే నా ప్రాణం అయినప్పుడు నా ప్రాణం నేను వదిలేసి ఎలా వెళ్లిపోతాను దయచేసి అర్థం చేసుకోండి సార్.

హరివర్ధన్: మిథునని నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న మాట నిజమే అయితే నువ్వు ఇక్కడ నుంచి ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోవాలి. నిజమైన ప్రేమ ఎప్పుడూ బలి కోరదు. నువ్వు చెప్పినట్లు నువ్వు మిథునని నిజంగా ప్రేమిస్తే ఇంకెప్పుడూ నా కూతుర్ని కన్నెత్తి చూడకు. అలా కాదని నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. నా కూతురిని బలి తీసుకోవాలని అనుకున్నట్లే.

దేవా: కుప్పకూలిపోయి. నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు. మోసం చేయడం తెలీదు. నాకు మిథున మీద ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైంది సార్. నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందో చెప్పడానికి నా కన్నీళ్లే సాక్ష్యం సార్. మిథున మీద నాకు ఉన్న ప్రేమని మీరు అనుమానించారు. అందుకే మిథునని వదిలేసి వెళ్లిపోమని అంటే నేను ప్రాణం వదిలేసి పోవడమే నా ప్రేమ స్వచ్ఛమైంది అని మీకు నిరూపించడానికి ప్రాణం పోతున్న బాధ ఉన్నా సరే మిథునని వదిలేసి వెళ్లిపోతున్నా అని దేవా చాలా ఏడుస్తాడు.

హరివర్ధన్: మళ్లీ నువ్వు నా కూతురి జీవితంలోకి తిరిగి రావని నమ్మడం ఎలా దేవా.

దేవా: చెప్పాను కదా సార్ నాకు ప్రేమించడమే తెలుసు మోసం చేయడం తెలీదు. మీ నమ్మకం కోసం మిథున సాక్షిగా మీకు మాటిస్తున్నా. మిథున మీద ప్రేమ నాలోనే దాచుకొని నేను నరకం అనుభవిస్తా కానీ మిథున జీవితంలోకి రాను. అని చేతితో చేయి వేసి ఒట్టు వేస్తాడు.

దేవా చాలా చాలా ఏడుస్తాడు. మిథున దగ్గరే కూర్చొని ఏడుస్తాడు. మిథునని తాకాలి అని ప్రయత్నించి తాకకుండా ఆగిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.