Nuvvu leka Neanu Lenu Serial Today Sep 2nd: రాధపై కత్తితో దాడి చేయబోయిన చిట్టి...సుందరి చెంప పగులగొట్టిన రాధ
Nuvvu leka Neanu Lenu Serial Today Episode Sep 2nd: రాధపై కత్తితో దాడి చేయబోయిన చిట్టి... దాంతో రాధ చెంప పగులగొట్టినంత పని చేసింది.

Nuvvu leka Neanu Lenu Serial Today Episode: స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో నడుస్తున్న నువ్వులేక నేనులేను సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని ఇంటి నుంచి వెళ్లిపొమ్మని సుందరికి రాధ వార్నింగ్ ఇవ్వగా...రాధను చంపేందుకు సుందరి కత్తితో పొడవబోతుంది.వెంటనే చేయిపట్టుకుని సుందరి చెంపపగులగొడుతుంది.నేను నిన్ను చంపాలని అనుకుంటే ఎప్పుడో చంపేసేదాన్నని మర్యాదగా ఇప్పటికైనా ఈ నాటకం వదిలేసి వెళ్లిపొమ్మని హెచ్చరిస్తుంది. అటు దమయంతి చేతిలో తన్నులు తిని వచ్చిన తల్లిదండ్రులకు సుందరి నిజం చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోదామని చెబుతుంది.
రాధపై హత్యాయత్నం
రాధ, విక్కీ మాట్లాడుకోవడం విని కోపంతో రగిలిపోతున్న సుందరి...రాధను పిలిచి నువ్వు, ఆ విక్కీ కలిసి నాటకం ఆడి నాతో ఆడుకుంటారా అని నిలదీస్తుంది. ఆస్తి నా చేతికి రాకుండా అడ్డుపడతారా అని ప్రశ్నిస్తుంది. అసలు నాటకం ఆడటానికి వచ్చింది నువ్వుని గుర్తులేదా అని రాధ కడిగిపారేస్తుంది. దేవుడిలాంటి గురూజీకి తన బిడ్డపై ఉన్న ప్రేమను అడ్డుపెట్టుకుని ఆ దమయంతి నువ్వు కలిసి నాటకం ఆడటమే కాకుండా...ఆయన ఆస్తి కాజేయడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్న మేం తప్పు చేశామా అని నిలదీస్తుంది. నాటకం ఆడటానికి వచ్చిన నువ్వు మమ్మల్నే నాటకం ఆడుతున్నావని ప్రశ్నిస్తున్నావా అని అంటుంది.
అసలు నువ్వు దొంగ చిట్టివని తెలిసిన రోజే విక్రమ్ నిన్ను జైలులో పడేసేవాడు..కానీ ఈ నాటకంలో నువ్వు కేవలం పాత్రధారివని వదిలేశాడని చెబుతుంది. అసలు సూత్రాధారి వాళ్ల అత్తయ్యకు మరో అవకాశం ఇద్దామని ఇన్నిరోజులు ఎదురుచూస్తున్నాడని..ఆ దమయంతి తన తప్పు తెలుసుకుని గురూజీకి క్షమాపణలు చెప్పడం కోసమే ఆగామని అంటుంంది. ఇంతలో నువ్వు ఆస్తిపై కన్నేసి మొత్తం రాయించుకుందామని పిచ్చిపిచ్చి వేషాలు వేశావంటే నిన్ను కూడా లోపల పడేస్తాడని హెచ్చరిస్తుంది.కాబట్టి నీ నాటకం బయటపడక ముందే మీవాళ్లను తీసుకుని వెళ్లిపొమ్మని చెబుతుంది.
రాధ వార్నింగ్ ఇవ్వడం నచ్చని సుందరి...విషయం నా వరకు వస్తే నేను ఎవ్వరినీ వదిలిపెట్టనని ఆస్తి నాకు రాకుండా చేసేవారిని చంపిపడేస్తానంటూ కత్తి తీసుకుని రాధను పొడవబోతుంది. వెంటనే అడ్డుకున్న రాధ...ఈ విషయం విక్కీకి తెలిస్తే...క్షణం ఆలోచించకుండా నిన్ను రివల్వార్‌తో కాల్చిపడేస్తాడని చెప్పి ఆమె చేతిలో ఉన్న గన్ లాక్కుని చెంప పగులగొడుతుంది.మేం అడితే నాటకమే అయితే విక్కీని అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని మీరు ఆడుతున్నది నాటకం కాదా...రామచంద్రం గారిని మోసం చేయడం నాటకం కాదా అని సుందరి నిలదీస్తుంది.మేం దొంగ పెళ్లి చేసుకుని నాటకం ఆడుతున్నా...అది ఓ మంచి పనికోసం చేస్తున్నామని..మీలా ఆస్తులు కొట్టేయడానికి కాదాని అంటుంది. మా నాటకంలో న్యాయం ఉందని...మర్యాదగా రేపటి కల్లా నువ్వు ఇల్లు వదిలి వెళ్లకపోతే విక్కీ నిన్ను జైలులో వేయడం ఖాయమని హెచ్చరించి వదిలేస్తుంది.
అప్పలరాజును కొట్టిన దమయంతి
ఒకవైపు రాధ వార్నింగ్‌లు..మరోవైపు సుందరి కుట్రలతో దమయంతికి తలపోటు వస్తుంది. ఆ సుందరిని తీసుకొచ్చి నా గోతిని నేనే తీసుకున్నానని బాధపడుతుంటే...మధ్యలో ఈ రియాల్టీషో పేరిట వీళ్లు చేసే రచ్చ తట్టుకోలేకున్నానని అనుకుంటుంది. అప్పుడే అప్పలరాజు తన భార్యతో ఆమె దగ్గరకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడతుంటాడు.దీంతో దమయంతికి కోపం పెరిగిపోయి...అప్పలరాజును కొట్టినా అదంతా రియాల్టీ షోలో భాగమేనని అనుకుంటాడు.దీంతో దమయంతి బెల్టు తీసుకుని ముగ్గురిని పిచ్చికొట్టుడు కొట్టి తరిమేస్తుంది. వాళ్లు సుందరి దగ్గరకు వచ్చి రియాల్టీషోలో ఇలా కొడుతున్నారేంటని అడుగుతారు.అప్పుడు సుందరి ఇదంతా రియాల్టీ షో కాదు...ఆ విక్కీ, రాధ కలిసి నాటకం ఆడారని చెప్పి తెల్లారేసరికి మనం ఈ ఇల్లు వదిలి పారిపోదామని సుందరి వాళ్లకు చెబుతుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
ట్రెండింగ్ వార్తలు





















